Home Health వాముతో కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

వాముతో కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

0

పోపుల డబ్బాలో కాకుండా విడిగా ఓ చిన్నడబ్బాలో మాత్రమే కనిపించే వాములో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వీటిలో ఉండే అనేక రసాయనాలు జీర్ణక్రియకి సహాయపడతాయి. ఇవి ఇన్‌ఫెక్షన్‌ బారిన పడకుండా కాపాడుతాయి. వాముతో తలనొప్పి, ముక్కు దిబ్బడ, తలదిమ్ము వంటి సమస్యలు తగ్గుతాయి. వాముతో కలిగే మరిన్ని ఉపయోగాలు తెలుసుకుందాం..

Health benefits of Vamuవాములో అధికంగా ఉండే థైమల్‌ అనే రసాయనం బ్యాక్టీరియా, ఫంగల్‌ వ్యాధుల్ని నిరోధిస్తుంది. యాంటీ సెప్టిక్‌గానూ పని చేస్తుంది. అలాగే ఇందులో అనేక విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. తలనొప్పి, జలుబు, అలసట, మైగ్రెయిన్‌ వంటి వాటికి వాము మందులా పని చేస్తుంది.

వాము కడుపునొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఒక గ్లాసు గోరు వెచ్చటి నీటిలో ఒక చెంచా వాము కలిపి తాగితే అజీర్తి తగ్గి, ఆకలి పెరుగుతుంది. గ్యాస్‌ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. గర్భిణుల్లో ఆకలిని పెంచి గర్భాశయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

వాము నుంచి తీసిన నూనె కీళ్లనొప్పుల్ని తగ్గిస్తుంది. ముక్కు బాగా బిగిసిపోయి ఉంటే వామును నూరి పలుచని బట్టలో కట్టి వాసన చూస్తే త్వరగా ఉపశమనం పొందుతారు. ఒక చెంచా వామును గ్లాసు నీళ్లల్లో మరిగించి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే దగ్గు, జలుబు సమస్యలు తగ్గుముఖం పడతాయి.

శీతాకాలంలో వాము వేసి మరిగించిన నీటిని సేవించడం ద్వారా జీర్ణక్రియ సక్రమంగా వుంటుంది. ఈ నీటిని సేవించడం ద్వారా ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. వాముతో మరిగించి నీళ్లని పుక్కిలించడం వల్ల పంటి నొప్పి తగ్గుతుంది. వాముని తేనెతో కలిపి వరుసగా పది రోజులు తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు కరిగే కరిగిపోతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఒక చెంచా వామును గ్లాసు నీళ్లల్లో మరిగించి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే దగ్గు, జలుబు సమస్యలు తగ్గుముఖం పడతాయి. వాము కడుపునొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఒక గ్లాసు గోరు వెచ్చటి నీటిలో ఒక చెంచా వాము కలిపి తాగితే అజీర్తి తగ్గి, ఆకలి పెరుగుతుందని.. అల్సర్ దూరమవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

 

Exit mobile version