Home Health వాకింగ్ చెయ్యడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటి?

వాకింగ్ చెయ్యడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటి?

0

నడక అన్నది మన శరీరానికి మంచి ఎక్సర్‌సైజ్. అందుకే రోజూ కనీసం 15 నుంచీ 30 నిమిషాలు నడవమని డాక్టర్లు చెబుతున్నారు. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా, వర్క్ టెన్షన్లలో బీజీ అయినా… ఏదో ఒక రకంగా నడిచేందుకు వీలుండేలా చేసుకోవాలి. అసలు మనిషి ప్రయాణం మొదలైందే నడకతో. చెట్లు, పుట్టలూ దాటుకుంటూ, మానవుడు… ప్రపంచాన్ని చూసేందుకు ముందుకు సాగాడు.

Health Benefits of Walkingకానీ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఆ నడకే దూరమవుతోంది. కూర్చున్న చోటునే అన్నీ అందుబాటులోకి రావడంతో బద్ధకం ఎక్కువైపోతోంది. సరే… అసలు వాకింగ్ చెయ్యడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? మనం రోజు చేసుకునే పనుల్లో వాకింగ్ తప్పని సరి ఎందుకు ప్లాన్ చేసుకోవాలి? ఇప్పుడు తెలుసుకుందాం…

నడక వల్ల నాజూకు నడుమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ప్రతిరోజూ ఉదయాన్నే వాకింగ్‌ చేయడం వల్ల బరువు తగ్గడం, డయాబెటిస్‌, గుండె సమస్యలు రాకుండా ఉంటాయని అందరికీ తెలుసు. వాకింగ్‌ అంటే స్లోగా నడువడమే కదా అనుకుంటారు. కాదు. వాకింగ్‌లో ఆరు రకాలు ఉన్నాయి.

1.బ్రిస్క్‌ వాకింగ్‌:

సాధారణంగా నడిస్తే అది వాకింగ్‌ అంటారు. వేగం కొంచెం పెంచితే దాన్నే బ్రిస్క్‌ వాకింగ్‌ అంటారు.

2.పవర్‌ స్ట్రైడింగ్‌:

బ్రిస్క్‌ వాకింగ్‌ చేస్తూ రెండుచేతులనూ ఎక్కువగా ఊపుతూ నడిస్తే దాన్నే పవర్‌ స్ట్రైడింగ్‌ అంటారు.

3.స్టెయిర్‌వెల్‌ వాక్‌:

నడువడానికి స్థలం లేనప్పుడు అపార్ట్‌మెంట్‌లోని మెట్లు ఎక్కుడం, దిగడం లాంటివి చేయడాన్నే స్టెయిర్‌వెల్‌ వాక్‌ అంటారు.

4.పూల్‌ వాకింగ్‌: 

సముద్రపు ఒడ్డున నీళ్లలో వాకింగ్ చేయడాన్ని పూల్‌ వాకింగ్‌ అంటారు.

5.అప్‌హిల్‌ క్లైంబ్:

ఎత్తైన ప్రాంతాలకు వాకింగ్ చేయడాన్నే అప్‌హిల్‌ ‌క్లైంబ్ అంటారు.

6.ట్రెడ్‌మిల్‌ వాకింగ్‌:

బయట వాకింగ్‌ చేయడానికి వీలుకాని వారు ట్రెడ్‌మిల్‌ వాకింగ్‌ చేయవచ్చు. ట్రెడ్‌మిల్‌ మిషన్‌పై చేస్తారు కనుక దీనికి ఆ పేరు వచ్చింది.

ఇక నడక వలన కలిగే లాభాలెంటో తెలుసుకుందాం…

  • నడక మూడ్ ను మార్చేస్తుంది.
  • ఒత్తిడి,డిప్రెషన్ ను దూరం చేస్తుంది.
  • కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  • మానసిక ప్రశాంతత లభిస్తుంది.
  • హైబీపీ,కొలెస్ట్రాల్ తగ్గుతాయి.
  • గుండె సమస్యలు తగ్గుతాయి.
  • కీళ్ళను దృఢంగా చేస్తుంది.
  • రక్త సరఫరా మెరుగుపడుతుంది.

Exit mobile version