Home Health నల్ల ద్రాక్ష వలన మన ఆరోగ్యానికి కలిగే మేలు ఏంటో తెలుసా

నల్ల ద్రాక్ష వలన మన ఆరోగ్యానికి కలిగే మేలు ఏంటో తెలుసా

0

నల్ల ద్రాక్షలు మధ్య, ఉత్తర యూరప్, ఉత్తర ఆసియా దేశాల్లోని వాతావరణంలో పండుతాయి. వీటిలో విటమిన్స్, మినలర్స్, యాంటీఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్, ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్, ఫైబర్ ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయి.

benefits with black grapesఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో మరిన్ని ప్రయోజనాలు చూద్దాం.

రక్తసరఫరా:

మధుమేహం ఉన్నవారు ద్రాక్ష తీసుకోకూడదని చెబుతారు. కానీ నల్లద్రాక్షకు రక్తంలోని చక్కెరస్థాయుల్ని అదుపులో ఉంచే శక్తి ఉంది. అలాగే రక్తసరఫరా సజావుగా సాగేలా చేసి అధికరక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతుందని చెబుతున్నారు నిపుణులు. నల్లద్రాక్షలోప్రత్యేకంగా ఉండే పాలీఫెనాల్‌ మైగ్రెయిన్‌ తలనొప్పినీ, మతిమరుపును అదుపులో ఉంచి.. మెదడు పనితీరును చురుగ్గా మారుస్తుంది.

వృద్ధాప్య ఛాయలను తొలగిస్తాయి:

ద్రాక్షలో ప్లేవనాయిడ్స్‌లాంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలను తొలగిస్తాయి. నిత్యయవ్వనులుగా ఉంచుతాయి. అంతేకాకుండా నల్లటి ద్రాక్షలు రక్తంలో నైట్రిన్‌ ఆక్సైడ్‌ మోతాదును పెంచుతాయి, నైట్రిక్‌ ఆక్సైడ్‌ రక్తం గడ్డలుగా ఏర్పడకుండా నివారిస్తాయి, గుండెపోటు నివారణకు దోహదపడుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సౌందర్యాన్ని కూడా అందిస్తాయి:

నల్లద్రాక్షలో ఉన్న పోషకాలు ఆరోగ్యాన్ని మాత్రమే కాదు సౌందర్యాన్ని కూడా అందిస్తాయని వైద్యులు చెబుతున్నారు. నల్ల ద్రాక్ష పండ్లను తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా రావన్నది నిపుణుల మాట. ఈద్రాక్షలో ఉండే పాలిఫినాల్స్‌ శరీరంలోని కొల్లాజిన్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది చర్మాన్ని వాడిపోకుండా రక్షించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

మంచి పోషణనిస్తాయి:

నల్లని ద్రాక్ష చర్మానికి నిగారింపు తెస్తుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటికి పంపించి, చర్మానికి జీవకళను తెచ్చిపెడుతుంది. జుట్టుకు కూడా మంచి ఔషధంలా పనిచేస్తుంది. ద్రాక్షలో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు వెంట్రుకలకు మంచి పోషణనిస్తాయి.

ఏకాగ్రత పెరుగుతుంది:

అధికరక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. చదువుకునే పిల్లలకు వీటిని తరుచూ తినిపిస్తూ ఉంటే వారిలో ఏకాగ్రత పెరుగుతుంది. జ్ఞాపకశక్తి పెంపొందుతుంది. వీటిలోని ఫైటో కెమికల్స్‌ చెడు కొలెస్ట్రాల్‌ ను తగ్గించి గుండెకు మేలు చేస్తాయి.

కొవ్వును అదుపులో ఉంచుతుంది:

నల్ల ద్రాక్షలో ఉండే కొన్ని రకాల పోషకాలు క్యాన్సర్‌ కారకాలతో పోరాడతాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా నల్ల ద్రాక్ష చాలా మంచివి. ఇవి శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపి కొవ్వు పట్టకుండా చూస్తాయి.

కండరాలకు మేలుచేస్తాయి:

నల్లద్రాక్షలో ఉండే ఫైటోకెమికల్స్‌ గుండెలో పేరుకొనే చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి అక్కడి కండరాలకు మేలుచేస్తాయి. అలా హృద్రోగాలను దూరంచేస్తాయి. ఈ ద్రాక్షలోని పోషకాలు క్యాన్సర్‌ కారకాలతో పోరాడుతాయి కూడా. బరువు తగ్గాలనుకునేవారు ఈ పండ్లను ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను తొలగించి, బరువు తగ్గించేందుకు కారణం అవుతాయి.

 

Exit mobile version