ప్రతీ ఒక్కరి వంట గదిలో తప్పనిసరిగా ఉండేవి టమాటాలు. అలాంటి టమాటాలు ఆరోగ్యానికి చేసే మేలు అధికమని నిపుణుల పరిశోధనలో తేలింది. ఇప్పుడు టమాటా జ్యుస్ వలన కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలుసుకుందాం.
ప్రతిరోజూ టమాట జ్యూస్ తాగితే.. బరువు తగ్గడంతోపాటు రక్త పీడనం సమస్యను కూడా సులభంగా తగ్గించుకోచ్చు. టమాటలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. దీంతో జీర్ణక్రియ ప్రక్రియ వేగవంతంగా జరిగి ఉదర సమస్యలు ఉత్పన్నం కావు. చర్మ సమస్యలున్నా త్వరగా నయమవుతాయని.. నిపుణులు పేర్కొంటున్నారు.
టమాటలో ఉండే విటమిన్ సి, బీటా కెరాటిన్, విటమిన్ ఈ వల్ల కొవ్వు అదుపులో ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీని ద్వారా బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఉదయాన్నే టామాట జ్యూస్ తాగాలని సూచిస్తున్నారు.
టమాట జ్యూస్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.
డయాబెటిస్ ఉన్నవారు టమాట రసాన్ని తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల నుంచి బయట పడవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.