Home Health బోడ కాకారకాయల వలన కలిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలేంటో తెలుసా ?

బోడ కాకారకాయల వలన కలిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలేంటో తెలుసా ?

0

బోడ కాక‌ర‌కాయ‌లు.. వీటిని కొన్ని ప్రాంతాలలో ఆ కాకరకాయలు అని కూడా అంటారు.. వర్షకాలంలో దొరికే ఈ బోడ కాక‌ర‌కాయ‌ల గురించి చాలామందికి తెలియ‌దు కూడా… ఇవి కొన్ని ప్రాంతాలలో మాత్రమే దొరుకుతాయి.. అందుకే కుంచెం రేట్ కూడా ఎక్కువే.. ధరకు తగ్గట్టే ఉపయోగాలు ఎక్కువే.. ఇవి కాక‌ర‌ జాతికి చెందినవి.. అయితే కాక‌ర‌కాయ‌లంత చేదు ఉండవు.. మంచి రుచిని క‌లిగి ఉంటాయి.. మ‌రి ఈ బోడ కాకారకాయల వలన కలిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలేంటో మనం ఇపుడు తెల్సుకుందాం..

boda kakarakayaబోడ కాకరలో పోషక విలువలతో పాటు ఔషధ విలువలు మెండుగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి. బోడ కాక‌ర‌‌ల‌ను వండేటప్పుడు కాకరకాయల్లా పైన ఉండే తొక్కును తొలిగించ‌కూడ‌దు. అలా చేస్తే అందులో ఉన్న పోష‌కాల‌న్ని పోతాయి. కాబట్టి శుభ్రంగా క్లీన్ చేసుకుని వాడుకుంటే సరిపోతుంది.. ఇవి తినటం వలన రోగనిరోధకశక్తి మెరుగవుతుంది.. ఈ వ‌ర్షాకాలంలో తరచూ జ‌లుబు బారిన పడకుండా బోడ కాక‌ర ర‌క్షిస్తుంది. అంతేకాదు వివిధ అలెర్జీలకు చెక్ పెడ్తుంది..

దీనిలో ఫైబర్ శాతం ఎక్కువ, వీటిని తినటం వలన జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ మెరుగవుతుంది. తిన్న ఆహారం జీర్ణం కాక‌ ఇబ్బందిపడే వారికి బోడ కాకర మంచి ఔషధం.. ఇందులోని ఫొలేట్లు శ‌రీరంలోని కొత్త క‌ణాల‌ను వృద్ది చెందేలా చేస్తాయి. గర్భిణీ స్త్రీలు తిన్నట్లైతే శిశువు ఎదుగుద‌ల‌కు ఉప‌యోగ‌ప‌డుతాయి. ఇందులోని కెరోటినాయడ్స్ కంటి సంబంధిత వ్యాధుల నివారణకు ఉపకరిస్తాయి… అలాగే క్యాన్సర్ సహా ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడగకుండా కూడా రక్షిస్తాయి..

డ‌యాబెటిస్‌తో బాధపడే వాళ్ళు ఈ బోడక్కరకాయల్ని హ్యాపీగా తినేయొచ్చు.. ఇవి ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.. వీటిలో ఉండే విట‌మిన్ సి ఉంటుంది ఇన్ఫెక్ష‌న్ల‌తో పోరాడుతుంది. అలాగే క్యాన్స‌ర్ వంటి పెద్ద వ్యాధుల బారిన ప‌డ‌కుండా చూసేందుకు బోడ కాక‌ర ఎంతో తోడ్ప‌డుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కంతో బాధ‌ప‌డేవారు ఈ కాక‌ర తింటే మేలు జ‌రుగుతుంది. చ‌ర్మం మెరుగుప‌డేందుకు కూడా బోడ కాక‌ర ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. వీటిలో ప్ల‌వ‌నాయిడ్లు ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి వ‌య‌సును క‌నిపించ‌కుండా చేస్తుంది. వ‌య‌సు పెరిగినా యంగ్‌గా క‌నిపించేందుకు దోహ‌ద‌ప‌డుతుంది. అంతేకాదు చ‌ర్మంపై ముడ‌త‌ల‌ను త‌గ్గిస్తాయి.

Exit mobile version