అరటి పండ్లను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటి వల్ల మన శరీరానికి కావల్సిన కీలక పోషకాలు అందుతాయి. జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. గుండె ఆరోగ్యానికి మంచిది. తక్షణ శక్తిని ఇవ్వడంలోనూ అరటిపండు దానికదే సాటి. అయితే చాలా మందిలో అరటిపండ్లను గురించి కొన్ని అపోహలు ఉన్నాయి. మరి ఆ అపోహలు ఏంటో వాస్తవం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..!
షుగర్ సమస్యతో బాధపడుతున్న వారు అరటి పండ్లను తినరాదని చెబుతారు. అయితే ఇది కేవలం అపోహే. షుగర్ ఉన్నవారు కూడా నిరభ్యంతరంగా అరటి పండ్లను తినవచ్చు. అయితే లిమిట్ చూసుకుని తినాలి. భోజనం చాలా తక్కువగా తినేవారు అరటిపండ్లను నిర్భయంగా తినవచ్చు. షుగర్ ఉన్నా లేకున్నా చాలా మంది అరటి పండ్లను తినేందుకు జంకుతారు. ఎందుకంటే వాటిలో చక్కెర ఎక్కువగా ఉంటుందని వారి ఫీలింగ్. అయితే చక్కెర ఉండే మాట వాస్తవమే గానీ అది సహజసిద్ధమైంది. ఫ్రక్టోజ్ అని దాన్ని పిలుస్తారు. దాంతో మనకు ఎలాంటి హానీ ఉండదు.
అరటి పండ్లను ఎక్కువగా తింటే బరువు పెరుగుతామని భయపడతారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అరటి పండ్లలో పెక్టిన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపు నిండిన భావన కలుగజేస్తాయి. దీంతో పొట్ట సహజంగానే కొంత ముందుకు వస్తుంది. అంతే కానీ అరటి పండ్లను తినడం వల్ల లావు కారు. బరువు పెరగరు. పొట్ట రాదు.
ఇది చాలా మందిలో ఉండే అపోహే. అరటిపండ్లలో కొలెస్ట్రాల్ ఉండదు. కానీ వాటిలో ఉండే పలు ఔషధ గుణాలు మన శరీరంలోని మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. దీంతో మనకు ఉపయోగమే తప్ప నష్టం ఉండదు.
బరువు తగ్గాలని అనుకునే వారు కూడా అరటి పండ్లను తినరు. ఎందుకంటే అరటి పండ్ల వల్ల శరీరంలో అదనపు క్యాలరీలు చేరుతాయని వారు నమ్ముతారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే బరువు తగ్గేవారు ఎక్సర్‌సైజ్ చేసే క్రమంలో అరటి పండ్లను తింటే తద్వారా శరీరానికి ఎక్కువ శక్తి లభిస్తుంది. దీంతో మరికొంత సేపు ఎక్కువగా వ్యాయామం చేయవచ్చు. అది మనకు మేలే చేస్తుంది, కానీ నష్టం చేయదు.
బీపీ ఉన్నవారు అరటి పండ్లను తినడానికి భయపడుతారు. కానీ అలాంటి భయం ఏమీ పెట్టుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే అరటిపండ్లలో ఉండే పొటాషియం నిజానికి బీపీని కంట్రోల్ చేస్తుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. కనుక బీపీ ఉన్నవారు కూడా అరటిపండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు.