Home Health మిరియాల చారు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మిరియాల చారు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

0

మిరపకాయలొచ్చి మిరియాలకు ఆదరణ తగ్గింది కానీ మిరపకాయలే లేని కాలంలో కారం రుచిని ఇచ్చింది మిరియాలే. పురాణాల్లో, శాస్త్రాల్లో కూడా మిరియాల ప్రస్తావన ఉంది అంటే ఆయుర్వేదంలో మిరియాల ప్రాధాన్యత అర్థమవుతుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలకు సత్వర ఉపశమనం మిరియాలతో లభిస్తుంది. వాతావ‌ర‌ణంలో మార్పు కార‌ణంగా లేదంటే వ‌ర్షంలో త‌డ‌వ‌డం వ‌ల్ల జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు ఎదురవుతుంటాయి. ఇవి చిన్న రోగాలే అయిన‌ప్ప‌టికీ వాటి బాధ మాత్రం ఎక్కువ‌గానే ఉంటుంది. ఈ సమస్యలన్నిటినీ న‌యం చేయ‌డానికి ఒకే ఒక్క ఔష‌ధం… మిరియాల ర‌సం. దీన్ని అన్నంలో క‌లుపుకున్నా.. గ్లాసులో పోసుకొని తాగినా గొంతు గ‌ర‌గ‌ర‌, జ‌లుబు, ద‌గ్గు నిమిషాల్లో మాయమవుతాయి.

Health Benfits pepper rasamవారంలో ఒక్కసారైనా మిరియాల చారు సేవిస్తే పొట్టలో జీర్ణం కాకుండా మిగిలిపోయిన వ్యర్థాలు జీర్ణమైపోతాయి. ఎన్ని మందులు వేసుకున్నా మిర్యాల చిరుతో పొట్ట తేలికై కాస్త సమస్య తగ్గింది అనిపిస్తుంది. అంతేకాదు మనం తినే ఆహరం చక్కగా వంటబట్టాలంటే కాస్త మిరియాల పొడిని వంటల్లో వాడాల్సిందే. అయితే దీన్నీ మరీ ఎక్కువ మోతాదులో వాడినా సమస్యే… కడుపులో మంటగా ఉంటుంది.

మిరియాలలో పైపిరిన్, పైపీరిడిన్, పైపీర్టిన్, కేవాసిన్ అనే ఆల్కలాయిడ్స్ ఉంటాయి. వీటి వల్లనే మిరియాలు చేదు, ఘాటు వస్తాయి. ఇదికాకుండా మిరియాలలో తైలం, కొవ్వు, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఖనిజాలు, కాల్షియం, ఐరన్, భాస్వరం, థియామైన్, రైబోఫ్లేవిన్, నికోటినిక్ ఆసిడ్, విటమిన్ ఏ ఉంటాయి.వాతాన్ని కఫాన్ని మిరియాలు అణిచి వేస్తాయి. చేదుగా ఉష్ణతత్వం కలది కాబట్టి లాలాజలం ఊరుతుంది. దానివల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది.

బ్రాంకైటీస్, మూత్ర సమస్యలను తగ్గిస్తుంది. పుల్లటి పెరుగు 3 గ్రాములు తీసుకోని దానిలో ఒక గ్రాము మిరియాల పొడి వేసుకొని మూడుపూటలా తాగాలి. దానివల్ల హిస్టీరియా నయం అవుతుంది.

Exit mobile version