Home Health మద్యం సేవించడం వల్ల ఎదురయ్యే ఆనారోగ్యసమస్యలు ఏంటో తెలుసా ?

మద్యం సేవించడం వల్ల ఎదురయ్యే ఆనారోగ్యసమస్యలు ఏంటో తెలుసా ?

0

ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఎంతో కష్టపడుతుంటాం. అదే మనచేత్తో మనమే ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటే..? ఫంక్షన్ అని ఓ రోజూ, పాత ఫ్రెండ్స్ కలిశారాని మరో రోజు, ఇంకేదో కారణంతో ఇంకో రోజు ఇలా రోజూ ఓ పెగ్గు వేస్తుంటారు. ఇలా చేస్తే ఏరికోరి అనారోగ్యాన్ని రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానించినట్టే. ఎందుకంటే వ్యసనంలా మద్యం తాగటం కన్నా తరచుగా కొద్దిమొత్తంలో మద్యం తాగటం వల్ల గుండెదడ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఒక పరిశోధనలో తేలింది. గుండెదడ సాధారణంగా గుండె కొట్టుకునే తీరులో వచ్చే సమస్య, ఇది గుండెపోటు వచ్చే అవకాశాలను ఐదు రెట్లు పెంచుతుంది. దీని లక్షణాలు దడగా గుండె కొట్టుకోవడం, గుండె కొట్టుకునే వేగం పెరగటం లేదా నాడి సరిగ్గా అందకపోవటం, ఊపిరి అందకపోవటం, అలసట, ఛాతీలో నొప్పి, కళ్ళు తిరగటం వంటివి.

health problems caused by alcoholఇవన్నీ కూడా మద్యవయ్యస్సు నుండే మొదలవుతున్నాయి. మీరు కనుక ఆల్కహాలిక్ డ్రింకర్ అయితే ఈ సమస్యలంటిన్నీ మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంకా మద్యం సేవించడం వల్ల ఎదురయ్యే ఆనారోగ్యసమస్యలు చూద్దాం.

రక్తహీనత:

మద్యపానీయాలు తీసుకునే వారికీ రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. తెల్ల కణాల శాతం తగ్గి వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లుతుంది. కాలేయం దెబ్బతిని పేగుల నుండి రక్తం స్రవిస్తుంది. రక్తం గడ్డ కట్టే గుణంలో లోపం ఏర్పడుతుంది.

క్యాన్సర్:

ఆల్కహాలిసమ్‌ వల్ల జీర్ణావయవాలలో నోరు, గొంతు, కంఠనాళం, కడుపు, శ్వాసావయవాలు, క్యాన్సర్‌ వ్యాధికి గురయ్యే ప్రమాదముంది. కాలేయం క్యాన్సర్‌కు మద్యపానానికి దగ్గరి సంబంధం ఉంది.తాగుడు వల్ల ఆరోగ్య సమస్యలే కాక, ఆర్థిక సమస్యలు కూడా వస్తాయి. తాగుడుకు అలవాటు పడిన వారి పని సామర్థ్యం తగ్గిపోతుంది. ఆరోగ్యంగా మరియు దృఢంగా ఉండటానికి ఆల్కహాల్ ను పరిమితంగా తీసుకోవాలి

కార్డియోవాస్క్యులర్ వ్యాధులు: 

బి1 (థెైయమిన్) లోపం వల్ల గుండెలోని కండరాలకు హాని కలగడం చేత గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. గుండె పని చేయుటలో తేడాలు రావచ్చు. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటం వల్ల సాధారణంగా రక్తంలో కొవ్వు పదార్ధం మరియు శరీరం యొక్క రక్తపోటు పెరుగుతుంది.రక్తపోటు ఎక్కువగా ఉంటే, అది గుండెను ప్రభావితం చేస్తుంది.అంతే కాకుండా ఇది శరీరం యొక్క మంచి కొలెస్ట్రాల్ స్థాయి మీద ప్రభావితం చేసి గుండె పోటు అపాయాలను పెంచుతుంది.

కణజాలల మధ్య నార పధార్దములు(సిర్రోసిస్):

ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటం వల్ల కాలేయం మీద ప్రభావం చూపుతుంది.ఆల్కహాల్ కాలేయంలో కొవ్వును పెరిగేలా చేస్తుంది.అందువల్ల కాలేయం పాడయ్యి ఫ్యాటీ లివర్ వ్యాధి వస్తుంది.

జ్ఞాపకశక్తి:

మెదడు యొక్క సాధారణ కార్యాచరణ మీద ప్రభావం చూపుతుంది. ఆల్కహాల్ వల్ల ప్రత్యక్షంగా కంటి చూపును మరియు జ్ఞాపకశక్తి కోల్పోవడం సంభవిస్తుంది.మెదడు యొక్క నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.అధిక మద్యపానం అసందర్భ సంభాషణ మరియు బలహీనమైన ప్రవర్తనకు కారణమవుతుంది.ఇది ఒక వ్యక్తి యొక్క ఆలోచన సామర్థ్యం మీద కూడా ప్రభావితం చేస్తుంది.

డిప్రెషన్:

తాగుడు వల్ల మెదడు మందగిస్తుంది. నరాలలో శక్తి తగ్గుతుంది. దాంతో ఒత్తిడి పెరుగుతుంది విటమిన్లు, ముఖ్యంగా ‘బి’ విటమిన్ల లోపం వల్ల మద్యపానం మెదడు పొరలపై చూపే చెడు ప్రభావం వల్ల ఇలా అవుతుంది. నడక తిన్నగా ఉండదు. మాట తడబడుతుంది. కళ్ళ కదలికలో లోపం ఉంటుంది. మానసికంగా కృంగిపోతారు. పక్షవాతం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మద్యపానం చేసే వ్యక్తి ఒకసారి ఇలాంటి లోపానికి గురయితే చికిత్స చేయడం కష్టమవుతుంది.

గౌట్ పెయిన్:

మోకాళ్ళ నొప్పులు. ఆల్కహాలు సేవించడం వల్ల శరీరంలోని యూరిక్ ఆమ్లం తగ్గి జాయింట్ పెయిన్స్ కు దారితీస్తుంది.

అధిక రక్తపోటు:

ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శైలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులోనూ అధికంగా హైబీపీ, లోబీపి.

జీర్ణకోశం వ్యాధులు:

ఆల్కహాల్‌లో ఉండే హానికర గుణం వల్ల, కాలేయం దెబ్బ తింటుంది. పోషకాహారం దృష్ట్యా తగిన ఆహారం తీసుకుంటున్నప్పటికీ, మద్యం ఎక్కువగా తాగడం వల్ల కాలేయం దెబ్బ తింటుంది. కొవ్వు పేరుకోవడం వల్ల కాలేయం పెరుగుతుంది. ఉదయం పూట వికారంగా ఉండి వాంతి వస్తున్నట్టు ఉంటుంది. నీళ్ళ విరోచనాలు అవుతాయి. పొత్తి కడుపు కుడి వెైపు పైభాగాన నొప్పిగా ఉంటుంది. కాలేయం వాపు వస్తుంది. ఇది ముదిరే కొద్ది కామెర్లు వస్తాయి.

అంటువ్యాధులు:

ఆల్కహాల్ ను అధికంగా తీసుకోవడం వల్ల కొన్ని రకాల అంటువ్యాధులకు కూడా గురిచేస్తుంది. అందులో ట్యూబర్ క్విలోసిస్, ఫ్నిమోనియా, హచ్ ఐ వి మరియు ఇతర సెక్స్యువల్ వ్యాధులకు గురిచేస్తుంది. మద్యం ఎక్కువగా సేవించడం వల్ల శరీరం యొక్క జననేంద్రియ వ్యవస్థ నాశనానికి కారణం అవుతుంది. ఆల్కహాల్ తీసుకోవటం వల్ల పరోక్షంగా మహిళలు మరియు పురుషులు లో సంతాన ప్రాప్తి లేకుండా పోతుంది.

ప్యాంక్రియాటిస్:

కాలేయం మరియు ప్యాన్‌క్రియాస్‌ దెబ్బతినడం. మద్యసేవనంవల్ల కాలేయానికి సంబంధించి సిర్రోసిస్ ఆఫ్ లివర్ అనే వ్యాధి రావచ్చు.

నరాల నష్టం/నరాల బలహీనత:

మద్యపానంవల్ల మనిషికి ‘స్కెలిటల్ మయోపతి’ అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి సోకిన వారికి నరాలు క్షీణించి విపరీతమైన బలహీనత కలుగుతుంది. శారీరక శ్రమ చేయలేకపోతారు.

 

Exit mobile version