Home Health రక్తప్రసరణ సరిగా లేకపోతే కలిగే ఆరోగ్య సమస్యలు

రక్తప్రసరణ సరిగా లేకపోతే కలిగే ఆరోగ్య సమస్యలు

0

రక్త ప్రసరణ వ్యవస్థ శరీరంలోని రక్తనాళాలు వివిధ భాగాలకు మంచి రక్తాన్ని సరఫరా చేసి తిరిగి చెడు రక్తాన్ని గుండెకు చేర్చుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థ గుండె, రక్త నాళాలతో రూపొందించబడింది. ఇది మీ శరీరంలోని అన్ని అవయవాలు, కణజాలాలకు ఆక్సిజన్ , ఇతర పోషకాలను రవాణా చేయడానికి పనిచేస్తుంది. కార్బన్ డయాక్సైడ్, వ్యర్థ పదార్థములను తొలగిస్తుంది. రక్తప్రసరణ సరిగా లేకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా గుండె జబ్బులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో శరీరంలో రక్త ప్రసరణ పెంపొందించుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రక్తప్రసరణబ్లడ్ సర్క్యులేషన్ సజావుగా జరకపోతే.. స్ట్రోక్, హైపర్ టెన్షన్, క్లాట్స్, గుండె సమస్యలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి రక్త ప్రసరణ సజావుగా లేకపోతే.,. చాలా ప్రమాదకరమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. ఆందోళన, స్మోకింగ్ అలవాటు, హైబీపీ, ఒబేసిటీ, డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు కూడా రక్తప్రసరణ సజావుగా జరగకపోవడానికి కారణంగా చెప్పవచ్చు. వ్యాయామం, సరైన ఆహారపు అలవాట్లతో.. రక్త ప్రసరణను మెరుగుపరుచుకోవచ్చు.

సాధారణంగా లభించే కూరగాయలలో కొన్నిటిని చాలామంది వాడరు. కాని ప్రకృతి పరంగా లభించే కూరగాయలు మానవ శరీరంలోని రక్తకణాలను శుద్ధి చేసేటివి ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటివాటిలో దోసకాయ ఒకటి. దోసకాయను ఆహారంగా తీసుకుంటే శరీరంలోని రక్తకణాలను శుద్ధిచేసి రక్త ప్రవాహాన్ని పెంచుతుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు. దీంతో రక్తం గడ్డ కట్టకుండా ఉంటుందంటున్నారు వైద్యులు.

అలాగే నిత్యం దొండకాయను ఆహారంగా తీసుకోవడంతో శరీరంలో శక్తి వస్తుంది. దీంతోపాటు శరీరానికి విటమిన్ సి పుష్కలంగా లభిస్తుందంటున్నారు వైద్యులు.

సీ విటమిన్‌కు నిలయమైన కమలా ఫలాలు తినడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థపై అద్భుతమైన ప్రభావం చూపుతుంది. ధమనుల నుంచి కణాల్లోకి నేరుగా రక్త ప్రసారం జరుగుతుంది. చర్మం ఏర్పాటులో విటమిన్ ‘సీ’ తప్పనిసరి. స్ట్రాబెర్రీలు, నిమ్మకాయలు, పైనాఫిల్, గంట మిరియాలు, క్యాబేజీల్లో విటమిన్ ‘సీ’ అందుబాటులో ఉంది.

జీడిపప్పు, బాదం పప్పుతోపాటు వివిధ గింజల్లో మెగ్నిషియం, ఎల్ – ఆర్జినైన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ధమనులు హాయిగా, రిలాక్స్‌డ్‌గా పని చేసుకోవడానికి మెగ్నిషియం ముఖ్యమైన ఖనిజం.

మీరు పాలతో కలిపిన టీ తరుచుగా తాగుతున్నారా? దానికి బదులుగా గ్రీన్ టీ తాగుతూ ఉంటే అది మీ శరీరంలోని వివిధ అవయవాల్లో ఉద్దీపన తీసుకొస్తుంది. గ్రీన్ టీ మీ రక్త నాళాల విస్తరణ కోసం, రక్త ప్రవాహం పెరుగుదలకు దోహద పడుతుంది. యాంటీ యాక్సిడెంట్స్‌కు నిలయమైన గ్రీన్ టీ పూర్తిగా మీ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.

రక్త ప్రవాహానికి ఉద్దీపనగా వెల్లుల్లి పని చేస్తుంది. జీర్ణ ప్రక్రియలో మంటను తగ్గించడంతోపాటు సూక్ష్మజీవులను అంతమొందించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. వెల్లుల్లిలో గల ఆర్గానో సల్ఫర్ ఉత్పత్తులు టాక్సిన్లను బయటకు నెట్టివేయడానికి, ఇన్ పెక్షన్లపై శరీరం పోరాడటంలో వెల్లుల్లి సహకరిస్తుంది. అల్లం, ఉల్లిపాయలు భోజనంలో తీసుకోవడంతో నిజంగానే రక్త ప్రసారం మెరుగు పడుతుంది.

మూలికలు ఎటువంటి అనారోగ్య సమస్యనైనా పరిష్కరించడానికి తద్వారా రక్త ప్రసరణ మెరుగుదలకు దోహదపడతాయి. కోరింద పళ్లు, పార్స్లీ పండ్ల వంటివి తినడంతో రక్త ప్రసారం మెరుగు పడుతుంది. బీట్‌రూట్లలో నైట్రేట్ నిల్వలు పుష్కలం. వీటిని తినడంతో రక్తనాళాల్లో రక్తం సరఫరా మెరుగవుతుంది. నైట్రిక్ యాసిడ్ నైట్రేట్‌గా మారి ధమనులు విస్తరించడానికి సాయపడుతుంది.

డార్క్ చాకొలెట్ యాంటీ యాక్సిడెంట్స్‌తో నిండి ఉంటుంది. తద్వారా రక్త ప్రవాహం, ప్రసరణ మెరుగుదలకు దారి తీస్తుంది. ఫ్రీ రేడియల్ యాక్టివిటీని నిలువరించడంతోపాటు మంటను నిరోధిస్తుంది.

ప్రతిరోజూ కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలి. అల్లం రసంలో లేదా దంచిన అల్లంలో కాస్త తేనెచుక్కలు కలుపుకుని సేవిస్తే రక్తంలోని మలినం విసర్జితమవుతుంది. ఉల్లి , వెల్లుల్లి మీ ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోండి.

ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే రక్తంలోని మలినాలు బయటకుపోతాయి. రోజూ కనీసం ఓ గంటసేపు వాకింగ్ చేస్తే…క్యాలరీలు తగ్గి బాడీలో ఉన్న విషపదార్ధాలు బయటకు పోతాయి. ఫలితంగా రక్తప్రసరణ మెరుగు పడుతుంది.

Exit mobile version