Home Health ఆనెలు వెంటనే తగ్గించే సులువైన చిట్కాలు

ఆనెలు వెంటనే తగ్గించే సులువైన చిట్కాలు

0

అరికాళ్ళలో ఆవగింజంత పరిమాణంలో మొదలై అంతకంతకు పెరిగి దాదాపు కందిగింజ కంటే పెద్దగా తయారై ఇబ్బంది పెట్టేవి ఆనెలు. మృత క‌ణాలు పేరుకుపోవ‌డం, బాక్టీరియా, అధిక రాపిడి ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల పాదాల‌పై ఆనెలు ఏర్ప‌డ‌తాయి. ఈ ఆనెలు బాధ‌ను క‌లిగించ‌డ‌మే కాదు న‌డిచే స‌మ‌యంలో అసౌక‌ర్యాన్ని కూడా క‌లిగిస్తాయి.

easy tips to help you get rid of acneఅరిపాదాలల్లో ఆనెలు పుడితే ఆ బాధ వర్ణణాతీతం. ముఖ్యంగా కాళ్లకి చెప్పులు లేకుండా పొలాల్లో తిరిగే వారి పాదాలకి ఆనెలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. బయట ప్రదేశాల్లో, ఇసుకప్రాంతాల్లో తిరగాలంటే ఆనెలు ఉన్న వారికి నరకయాతనే. గట్టిగా ఉండే చెప్పులు ధరించి ఎక్కువ దూరం నడిచినా ఈ సమస్య రావొచ్చు. చర్మం పొడిబారిపోతేనే పాదాల పగుళ్లు, ఆనెల వంటి సమస్యలు వస్తాయి.

సాధారణ వ్యక్తులతో పోల్చితే శరీర బరువు ఎక్కువ ఉన్నవారిలో ఈ ఆనెల సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. పాదాలపై ఒత్తిడి ఎక్కువగా పడడమే దీనికి కారణం. కొంతమంది వీటిని పెరిగినకొద్దీ బ్లేడు తో కోసేయడం చేస్తుంటారు. అది చాలా పొరపాటు. అలా చేసిన కొద్దీ మరింత పెరగడమే కాక పొరపాటున ఆనె చివర బ్లేడు తగిలినా సెప్టిక్ అయ్యే ప్రమాదమూ లేకపోలేదు.

కొన్ని ఇంటి చిట్కాలు వాడి ఆనెలను తగ్గించవచ్చు. మరి ఆనెలను పోగొట్టే హోమ్‌రెమిడీస్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… కలబందని పేస్ట్‌ చేసి ఆ మిశ్రమాన్ని ఆనెకి పూయాలి. ఆ భాగంలో కాలికి బ్యాండేజ్‌ చుట్టాలి. కొన్ని రోజులపాటు ఇలా చేస్తే మంచిఫలితం ఉంటుంది.

ఉల్లి కూడా పాదాల‌పై ఏర్ప‌డిన ఆనెల‌కు చెక్ పెడ‌తాయి. ముందు ఉల్లిపాయ నుంచి ర‌సం తీసుకోవాలి. బ‌కెట్ గోరు వెచ్చ‌ని నీటిలో ఉల్లిపాయ ర‌సం వేసి క‌ల‌పాలి. ఈ నీటిలో పాదాల‌కు ఇర‌వై నిమిషాల పాటు ఉంచి ఆ త‌ర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా ప్ర‌తి రోజు చేసినా కూడా ఆనెలు క్ర‌మంగా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

వెల్లుల్లి రెబ్బలను మెత్తగా చేసి ఆనె ఉండే చోటు కట్టుగా కట్టాలి. వెల్లుల్లి బాక్టీరియాని చంపేస్తుంది. దీంతో పాటు ఆనెలకి చక్కటి మందులాగా పనిచేస్తుంది. తులసి ఆకుల్ని ఆముదంనూనెతో కలిపి పేస్ట్‌ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ఆనె ఉండే చోట పట్టించి కొన్ని గంటల పాటు అలాగే ఉంచాలి. ఒక చుక్క వెనిగర్‌ ని ఆనెపై వేసి అక్కడ కాస్త దూదిని పెట్టి కట్టు కట్టి అలాగే కొద్దిసేపు ఉంచటం వల్ల తగిన ఫలితం కనిపిస్తుంది.

వంట సోడాతో చర్మ సంబంధ సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. మృత కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఓ గిన్నెలో గోరు వెచ్చని నీటిని నింపండి. ఇందులో కొంచెం వంట సోడా వేసి బాగా కలపండి. ఇప్పుడు ఆ నీటిలో మీ పాదాలను కొద్ది సేపు ఉంచండి. ఓ పావు గంట తర్వాత పాదాలను బయటకు తీసి ప్యూమిక్ స్టోన్ తో పాదాల అడుగు భాగంలో రబ్ చేయండి. ఇలా చేస్తే ఆనెలు తగ్గడంతోపాటు పగిలిన, చీలిన పాదాలకు కూడా ఉపశమనం లభిస్తుంది.

పోషకాలు పుష్కలంగా ఉండే పైనాపిల్‌లో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఓ పైనాపిల్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆనెలపై ఉంచితే ఉపశమనం లభిస్తుంది. అలాగే.. ఓ పైనాపిల్ బద్దను ఆనెలపై ఉంచి ఓ శుభ్రమైన క్లాత్‌తో కట్టులా కట్టి ఓ రాత్రంతా ఉంచితే మరింత మేలు చేస్తుంది. ఇలా రాత్రంతా ఉంచాక మరుసటి రోజు ఉదయం కట్టు విప్పి కొంచెం కొబ్బరి నూనెను ఆనెలపై అప్లయ్ చేయండి. క్రమం తప్పకుండా కొన్ని రోజులపాటు ఇలా చేయడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది

 

Exit mobile version