Home Health వేసవికాలంలో బరువు తగ్గడానికి సహాయపడే చిట్కాలు మీ కోసం

వేసవికాలంలో బరువు తగ్గడానికి సహాయపడే చిట్కాలు మీ కోసం

0

బరువు తగ్గాలనుకునే వారు కేలరీలు కరిగించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారిలో కొందరు త్వరగా సన్నబడాలనే ఉద్దేశంతో అధికంగా వ్యాయామం చేయడం, చాలా తక్కువగా ఆహారం తీసుకోవడం వంటివి చేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల బరువు తగ్గడమేమోగానీ బలహీనంగా తయారువుతారు. బరువు తగ్గించుకోవాలనుకునే వారికి వేసవి ప్రకృతి ఇచ్చిన అవకాశం.

Weight Loss Tips In Summerవేసవిలో వర్క్‌ అవుట్స్‌, కష్టతరమైన యోగాసనాలు, సూర్య నమస్కా రాలు తక్కువ చేయడం ఉత్తమం. బరువు తగ్గాలనుకున్న వారికి స్విమ్మింగ్‌ మంచి వ్యాయామం. ఈత రాని వారికోసం ఆక్వా జుంబా, ఆక్వా యోగ అందుబాటులోకి వచ్చాయి. వర్క్‌అవుట్స్‌ చేయడానికి ముందే చన్నీటి స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరగదు.

ఆహారంతోపాటు శీతలి ప్రాణాయామం కూడా చేస్తే కొంత వరకు ఎండల ప్రతాపాన్ని తట్టుకునే శక్తి శరీరానికి అందుతుంది. బరువు తగ్గడానికీ ఉపయోగపడుతుంది. వేసవిలో భానుడి ప్రతాపం ఉదయం ఏడు గంటల నుంచే మొదలవుతుంది. ఈ ఎండల తీవ్రతను తట్టుకోవాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. నీరు ఎక్కువ తాగాలి. వీటితోపాటు శీతలి ప్రాణాయామం కూడా చేయాలి.

మామూలు రోజుల కంటే, వేసవిలో మనిషి ఆకలిలో ఎక్కువ వ్యత్యాసాలు కనిపిస్తాయి. వేసవిలో దాహం ఎక్కువ, ఆకలి తక్కువగా ఉంటుంది. ఘన పదార్థాల కంటే ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలనిపిస్తుంది. 15 నుంచి 20 నిమిషాలకు ఒకసారి చొప్పున రోజుకు కనీసం ఏడు లీటర్లు తాగితే బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ఫ్రిజ్‌లో నీటికన్నా కుండలోని నీటిని తాగడం ఉత్తమం.

అలాగే నీటి శాతం ఎక్కువగా ఉంటే పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి. పుచ్చ, కీర, కర్బూజ, తాటిముంజలు, బీర, పొట్ల వంటి వాటిలో నీటి శాతం పుష్కలంగా ఉంటుంది. వీటి ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు, లవణాలు అందుతాయి. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల కడుపు నిండినట్టుంటుంది. డైట్‌ కంట్రోల్‌ అవుతుంది.

శీతల పానియాలు, చక్కర వేసిన జ్యూస్‌లు, మ్యాంగో, సపోటా వంటివి తీసుకుంటే మాత్రం బరువుతగ్గకపోగా కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి. వాటికి బదులు నీళ్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు తీసుకోవాలి. వేసవిలో ఆకలి తక్కువగాను, దాహం ఎక్కువగాను ఉంటుంది. జీర్ణక్రియలోనూ తేడాలు వస్తుంటాయి. డైట్‌ పాటిస్తూ కాలానికి తగ్గట్టుగా ఆహారపదార్థాలను తీసుకోవడం ద్వారా బరువును నియంత్రించుకోవచ్చు.

 

Exit mobile version