Home Unknown facts శివుడు గోదావరిని శపించడానికి పార్వతి దాహానికి కారణం ఏంటి?

శివుడు గోదావరిని శపించడానికి పార్వతి దాహానికి కారణం ఏంటి?

0

శివుడికి కాశి అంటే చాలా ఇష్టమైన ప్రదేశము అని చెబుతుంటారు. కానీ శివుడికి కాశి కంటే ఈ ప్రదేశం అంటేనే ఎక్కువ ఇష్టమని పురాణాలూ చెబుతున్నాయి. అయితే ఈ ప్రదేశంలో ఎన్నో విశేషాలు అనేవి ఉన్నాయి. మరి శివుడు గోదావరిని శపించడానికి పార్వతి దాహానికి కారణం ఏంటి? ఈ ప్రదేశం లో ఉన్న విశేషాలు ఏంటి? ఈ ప్రదేశం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Godhavariఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో లింగరాజు అనే ఆలయానికి కొంత దూరంలో ఒక కొలను ఉంది. దీనిని బిందుసాగరం అంటారు. అయితే ఈ ప్రదేశం అంటే శివుడికి ఎంతో ఇష్టమైన ప్రదేశం అని చెబుతుంటారు. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ప్రతి సంవత్సరం సంవత్సరంలో ఒక్కసారి పూరి జగన్నాథుని ఈ బిందుసాగరంలోని కోనేటిలో స్నానం చేయిస్తారు. ఇంకా ఈ ప్రాంతంలో పూర్వం మూడు వేల ఆలయాలు ఉండేవని చెబుతారు.

ఇక పురాణానికి వస్తే, శివుడికి ఈ ప్రాంతం అంటే ఎంతో ఇష్టమని తెలిసిన పార్వతీదేవి ఈ ప్రాంతం ఎలా ఉంటుందో చూసి వద్దామని గోపిక రూపం ధరించి ఇక్కడకి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న కృత్తి, వాస అనే ఇద్దరు రాక్షసులు ఆమెను చూసి మోహించారటా. అప్పుడు పార్వతీదేవి తనను వారి భుజాల మీద మోసుకెళ్ళమని ఆమె ఒక షరతు పెట్టగ వారు ఆమెను తమ ఇద్దరి భుజాల మీదకు ఎత్తుకోగానే వారిని అలాగే అణగద్రొక్కి వేసిందట. అప్పుడు ఆ దేవికి తీవ్రమైన దాహం వేయగా వెంటనే పరమశివుడు అక్కడికి చేరుకొని దేశంలోని అన్ని నదులు, సరస్సులు ఒక్కొక్క బిందువు రాల్చమని ఆజ్ఞాపించాడు.

ఆ సమయంలో ఒక్క గోదావరి నది తప్ప మిగిలిన నదులు అన్ని అలాగే చేశాయట. అప్పుడు శివుడు గోదావరి నదిని శపించగా ఆ నది నీళ్లు అన్ని అపవిత్రం అయిపోయాయి. ఆ తరువాత పశ్చాత్తాపం చెందిన గోదావరి శివుడిని పూజించి శాపవిమోచనం పొందింది అన్ని స్థల పురాణం.

Exit mobile version