Contributed By: Bala Bhanu Prakash
పొద్దునే లేవగానే ఉరకలు పెడుతూ, పరుగులు పడుతూ, పలోమని పళ్ళు తోముకుని, పనులకి బయలుదేరుతాం.
ఈ పరుగులు పెట్టె జీవితంలో సాటి మనిషి ని మనిషి గా భావించడం మర్చిపోయాం బహుశ అందుకే నేమో ఇంట్లో వాళ్లకి పరాయి వాళ్లకి తేడా లేకుండా పోయింది.
మాది ప్రేమ వివాహం, వివాహం తరువాత ప్రేమ పోయి విషాదం మిగిలింది, ఇక మాకు కుదరదు అని విడాకులకు అప్లయ్ చేశాం.
ఇళ్ళు సర్డుదాం అని శుభ్రం చేస్తుండగా కాలేజ్ ఆల్బమ్, నేను రాసిన ప్రేమ లేఖలు, ఒకరికొకరం ఇచ్చుకున్న బహుమతులు కనిపించాయి. మేమిద్దరం వాటిని చూసుకొని బాధపడాం, సిగ్గు పడాం తరువాత మనసు విపుకొని మాట్లాడుకున్నాం, కలసి వంట చేసి ఒకరికి ఒకరం తినిపించుకునాం, ఇంటి పనులు అనీ కలసి చేసుకొని మళ్ళీ ఒకటీ అయాం.
ప్రాణాలు తీసే ఈ కరోనా రోగం, నా ప్రాణాని నాకు దగ్గర చేసి నాకు బోగం అయింది.
మనుషులు మాట్లాడుకుంటే చాలు వారి మనస్సులు దగ్గరవుతాయి.
Not just staying in home, stay in the hearts of your loved ones.