Home Health గ్యాస్ ట్ర‌బుల్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేందుకు కొన్ని చిట్కాలు

గ్యాస్ ట్ర‌బుల్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేందుకు కొన్ని చిట్కాలు

0

గ్యాస్ ట్రబుల్. దీనినే ‘కడుపు ఉబ్బరం’ అని కూడా అంటారు. కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఈ సమస్య వస్తోంది. దీనితో మనిషి చాలా ఇబ్బందికి గురవుతాడు. సరైన వేళకు ఆహారం తీసుకోకపోవడం.. మానసిక వత్తిడికి గురి కావడం…రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టకపోవడం..మసాలాతో కూడుకున్న ఆహారాన్ని భుజించడం..ఇలా కొన్ని కారణాలు గ్యాస్ ట్రబుల్ కు దారి తీస్తాయి.

Home Remedies for Gasహార్మోన్ల అస్తవ్యవస్థత తదితర కారణాలు కూడా గ్యాస్ ట్రబుల్ ను కలిగిస్తాయి. భోజ‌నం స‌రిగ్గా చేయ‌క‌పోయినా, టైముకు తిన‌క‌పోయినా, ఎక్కువ‌గా తిన్నా, తిన్న ఆహారం జీర్ణం కాక‌పోయినా… ఇలా అనేక మందికి అనేక ర‌కాలుగా గ్యాస్ ట్రబుల్ స‌మ‌స్య వ‌స్తుంటుంది. అపుడు వారికి ఏం చేయాలో అర్థం కాదు. దీంతో ఎప్పుడూ గ్యాస్ స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతుంటారు. అలాంటి వారు గ్యాస్ ట్ర‌బుల్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేందుకు కొన్ని చిట్కాల‌ను పాటించాలి. అవెంట చూద్దాం..

ఇంగువను చూర్ణంగా చేసుకుని ప్రతిరోజూ అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో కలుపుని తింటే గ్యాస్ సమస్యను అధిగమించవచ్చు.

పరగడుపుతో కరివేపాకు ఆకులను తిన్నా కూడా చక్కని ఫలితం ఉంటుంది. దీంతో ఇతర జీర్ణ కోసం స‌మ‌స్య‌లు పోతాయి.

అలాగే నిత్యం ఆహారంలో పెరుగు మాత్రమే కాకుండా మజ్జిగ‌ను తీసుకుంటే గ్యాస్ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు.

రోజూ రాత్రి పూట అర టీస్పూన్ మోతాదులో జీల‌కర్ర లేదా వాము తీసుకుని తినాలి. అనంత‌రం నీళ్లు తాగాలి. ఇలా రోజూ చేస్తే గ్యాస్ స‌మ‌స్య నుంచి త్వ‌ర‌గా విముక్తి పొంద‌వ‌చ్చు.

ప్రతిరోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే అల్లం ర‌సం సేవించాలి. జీర్ణ స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసే శ‌క్తి అల్లానికి ఉంది. డైలీ ఇలా చేయటం వలన గ్యాస్ సమస్యల నుండి ఈజీ గా బయటపడిపోవచ్చు..

Exit mobile version