Home Health మొటిమలు మరియు మచ్చలు తగ్గించే హోమ్ రెమిడీస్

మొటిమలు మరియు మచ్చలు తగ్గించే హోమ్ రెమిడీస్

0

టీనేజ్‌లోకి వచ్చాక చాలా మందికి మొటిమలు మొదలవుతాయి. ఇవి వారి వారి శరీర తత్వాలను బట్టి కొంతమందికి తగ్గుతాయి. మరికొంత మందికి ఎన్ని రోజులైనా సరే సమస్య తగ్గదు. ఎక్కువ అవుతూనే ఉంటుంది. దీనికి కాలుష్య కారకం, నిద్రలేమి, జీవనశైలి ఇలాంటి అనేక కారణాలు ఉంటాయి.

Home Remedies To Reduce Acne And Scarsవీటిని తగ్గించుకునేందుకు చాలా మంది బ్యూటీ పార్లర్స్‌కి వెళ్లడం, క్రీమ్స్ వాడడం వంటివి చేస్తుంటారు. కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగించడం వల్ల మొటిమలు మరియు మచ్చలు త్వరగా తగ్గుతాయి. ఆ టిప్స్ ఏంటో చూద్దాం..

ఆవాలు మరియు తేనె:

మొటిమలు మరియు మచ్చలను తొలగించడానికి ఆవాలు గ్రేట్ గా సహాయపడుతాయి . ఆవాలలో సాలిసిలిక్ యాసిడ్స్ అనే నేచురల్ కాంపోనెంట్ ఎక్కువగా ఉండటం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ మరియు మొటిమలను నివారించడానికి ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ. 1/4మస్టర్డ్ పౌడర్ లో ఒక చెంచా తేనె మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి

గ్రీన్ టీ ఐస్ క్యూబ్స్:

కొన్ని గ్రీన్ టీ ఆకులను నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ గ్రీన్ టీ వాటర్ చల్లారిన తర్వాత ఐస్ ట్రేలో పోసి ఫ్రీజర్ లో పెట్టాలి. గ్రీన్ టీ ఐస్ క్యూబ్స్ తయారవుతాయి. ఈ గ్రీన్ టీ ఐస్ క్యూబ్ తీసుకొని మొటిమలు మచ్చలున్న ప్రదేశంలో మర్ధన చేయాలి. మొటిమలు మాయం అవ్వడంతో పాటు, స్కిన్ ఇన్ఫ్లమేషన్ మరియు పఫీ ఐస్ ను నివారిస్తుంది

టమోటో స్లైస్:

టమోటోల్లో యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వల్ల చర్మం మీద ఆస్ట్రిజెంట్ ప్రభావం కలిగి ఉంటుంది . అన్ని రకాల చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్స్ నివారించడంలో ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ. కొద్దిగా టమోటో రసంను ముఖానికి అప్లై చేసి మర్ధన చేయడం లేదా టమోటో స్లైస్ తో మొటిమల మీద మర్దన చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

వెల్లుల్లి జ్యూస్:

మొటిమలకు కారణం అయ్యే స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను నాశనం చేస్తుంది. వెల్లుల్లిలో నయం చేసే గుణాలు మెండుగా ఉన్నాయి . మొటిమలు ఎక్కువగా బాధిస్తున్నా..లేదా మొటిమలు పెద్దగా కనబడుతున్నా. వాటి మీద వెల్లుల్లి రెబ్బల రసాన్ని అప్లై చేయాలి. ఒక వెల్లుల్లి పాయ తీసుకొని స్టోన్ మీద అరగదీసి, చిటికెడు రాసన్ని అప్లై చేయాలి. ఎక్కువగా అప్లై చేయకూడదు. .ఒక గంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చాలా ఎఫెక్టివ్ హోం రెమెడీ.

ఎగ్ వైట్ మాస్క్:

ఎగ్ వైట్ ను సపరేట్ గా తీసుకొని మొటిమల మీద అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. అలాగే ఎగ్ వైట్ అప్లై చేయడానికి ముందు నిమ్మరసం అప్లై చేయడం వల్ల నయం చేసే గుణాలు మరింత ఎఫెక్టివ్ గా పెరుగుతాయి.

ఆపిల్ సైడర్ వెనిగర్:

మొటిమలను నివారించుకోవడానికి మరో నేచురల్ ట్రీట్మెంట్ ఆపిల్ సైడర్ వెనిగర్ . కాటన్ బాల్ ను ఆపిల్ సైడర్ వెనిగర్ లో డిప్ చేసి మొటిమల మీద ప్లేస్ చేయాలి. 5నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. మొటిమలున్న ప్రదేశంలో మాత్రమే అప్లై చేయాలి. ఈచిట్కాను రోజులో మూడు నాలుగు సార్లు చేయొచ్చు.

Exit mobile version