Home Health రక్తంలో ఉన్న వ్యర్థ పదార్థాలను తొలగించడానికి ఈ పద్ధతులు పాటించండి చాలు

రక్తంలో ఉన్న వ్యర్థ పదార్థాలను తొలగించడానికి ఈ పద్ధతులు పాటించండి చాలు

0

ఒక వాహనం నడవాలంటే ఇంధనం ఎంత ముఖ్యమో.. శరీరానికి రక్తం అంతే ముఖ్యం. శరీరానికి గుండె ఇంజినైతే, రక్తం ఇంధనం వంటిది. శరీరంలో ఆక్సిజన్, పోషకాలు మరియు హార్మోన్లను కణజాలాలను రవాణా చేయడం రక్తం యొక్క ముఖ్య విధి. శరీరంలోని అవయవాలు సక్రమంగా పని చేయాలంటే రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరు బాగా ఉండాలి. ఈ ప్రసరణ వ్యవస్థలో ఏమాత్రం తేడా వచ్చిన ఏదో సమస్యకు లోనయ్యే అవకాశాలు లేకపోలేదు.

Home tips to purify the bloodఇన్ని పనులను చేసే రక్తం శరీరంలో స్వచ్చంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే కలుషితమయిన, రసాయన కారకాలతో నిండిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల రక్తం కలుషితం అవుతుంది. రక్తం కలుషితం అవ్వడం వల్ల మూత్రపిండాలు మరియు కాలేయం దెబ్బతింటాయి. పలితంగా గుండె కూడా ఆ దుష్ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మన శరీరంలోని రక్తాన్ని మనమే శుభ్రం చేసుకోవాలి. దానికి హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. రక్తంలో ఉన్న వ్యర్థ పదార్థాలను తొలగించడానికి మన రోజువారీలో తీసుకునే ఆహారాన్ని మారిస్తే సరిపోతుంది. అవేంటో చూసేద్దాం.

భారతీయులు పసుపును శుభ సూచకంగా భావిస్తారనే సంగతి తెలిసిందే. పసుపు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్త కణాలకు రక్షణ కల్పిస్తాయి. ఇందులో కుర్కుమీన్ శరీరంలోని కణాలను దెబ్బతీసే ఫ్రీరాడికల్స్‌ను నాశనం చేస్తుంది. అందుకే, తినే ఆహారంలో తప్పకుండా పసుపు ఉండేలా చూడండి.

ఇటీవల ఉసిరి వాడకం చాలా తగ్గిపోయింది. పూర్వికలు ఏదో ఒక రూపంలో ఉసిరిని ఎక్కువగా తినేవారు. ఇప్పుడు ఇది దొరకడమే గగనమైపోయింది. ఒక వేళ మీకు ఉసిరి దొరికితే అస్సలు వదలొద్దు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫిటోన్యూట్రియంట్లు, విటమిన్‌-E, C పుష్కలంగా ఉంటాయి. ఉసిరి రక్తాన్ని వృద్ధి చేయడమే కాకుండా శుద్ధి చేస్తుంది.

ప్రతి రోజూ ఎనిమిది గ్లాసుల నీటిని తాగితే అన్నీ ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. త్రాగునీటిలో కాస్త సోంపు కలిపి తాగినట్టయితే శరీరములోని అధిక బరువును తగ్గిస్తుందట.

వారానికి రెండు, మూడు సార్లు బీట్‌రూట్‌ను ఆహారంగా తీసుకుంటే శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది. బీట్‌రూట్ లో బీటాలైన్స్ మరియు నైట్రేట్స్ అనే యాంటీఆక్సిడెంట్ ఉండటం వల్ల, రక్తాన్ని శుద్ధిచేసి, శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరగడంతో దోహదం చేస్తుంది.

అల్లం రసంలో లేదా దంచిన అల్లంలో కాస్త తేనెచుక్కలు కలుపుకుని సేవిస్తే రక్తంలోని మలినం విసర్జితమవుతుంది.తినే ఆహారంల్లో కాస్త ఎక్కువ ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి కలిపి తిన్నట్టయితే శరీరములోని క్రొవ్వును తగ్గించి ఉత్సాహమును పెంచుతుందట. వెల్లుల్లిశరీరంలో కొత్త కణాల తయారీకు సహకరిస్తుంది.

ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే రక్తంలోని మలినాలు బయటకుపోతాయి. రోజూ కనీసం ఓ గంటసేపు వాకింగ్ చేస్తే క్యాలరీలు తగ్గి బాడీలో ఉన్న విషపదార్ధాలు బయటకు పోతాయి. ఫలితంగా రక్తప్రసరణ మెరుగు పడుతుంది.

అలాగే, మునగాకుతో కాస్త కందిపప్పు, మరియు ఒక కోడిగుడ్డు, కొంచెం నెయ్యి చేర్చి తయారు చేసిన వంటను 41 రోజులు తీసుకున్నట్టయితే శరీరములోని రక్తము శుభ్రపడుతుందని నాటు వైద్యులు చెపుతున్నారు.

నిద్ర సమయంలోనే శరీరంలో కణజాలంలో మార్పులు జరుగుతుంటాయి. కణాల పుననిర్మాణానికి అవసరమైన హార్మోనులు విడుదలవుతాయి. నిద్ర సమయంలో శరీరంలోని కండరాలు విశ్రాంతి తీసుకోవడం వల్ల పెద్దగా పని ఉండదు. ఆ సమయంలోనే శరీరంలోని టాక్సిన్‌లు బయటకు వెళ్తుంటాయి. కాబట్టి.. రోజుకు కనీసం 8 గంటలైనా నిద్రపోండి. అలాగే, రాత్రిపూట నిద్రకు ఉపక్రమించేందుకు కనీసం రెండు, మూడు గంటలకు ముందు ఆహారాన్ని తీసుకున్నట్టయితే రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుందట.

తులసి ఆకులు, విత్తనాల్లో విటమిన్-K, ఐరన్‌, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఎర్ర రక్తకణాలు, రక్త శుద్ధికి, వృద్ధికి తులసి ఆకులు, విత్తనాలు ఎంతో మంచివి.

పచ్చని ఆకు కూరలతోపాటు క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌ వంటివి వారంలో ఒక్కసారైనా తీసుకోండి. ఇవి రక్తాన్ని శుద్ధి చేసి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. వీటిలో ఉండే పోషకాలు, ఖనిజాలు రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

నిమ్మరసం రక్తం మరియు జీర్ణవ్యవస్థను శుద్ధి చేయడానికి సహాయపడుతుంది, ఇది ఆరోగ్యానికి ఆటంకం కలిగించే ఫ్రీ రాడికల్స్ తో పోరాడి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నిమ్మరసంలో ప్రకృతి సిద్ధమైన సిట్రస్ ఆమ్లం ఉంటుంది ఇది పిహెచ్ స్థాయిని క్రమబద్దీకరించి రక్తం నుండి మలినాలను తొలగించడంలో ఉపయోగపడుతుంది. శరీరంలో రసక్తంలో కలిసిపోయిన మలినమైన కలుషిత పదార్థాలను తొలగించడానికి ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాజా నిమ్మరసం త్రాగాలి. 1/2 నిమ్మకాయ రసాన్ని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో పిండి పరగడుపున తీసుకోవాలి.

బ్లూబెర్రీస్ సహజంగా రక్త శుద్ధి చేస్తుంది. కాలేయ క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా నిషేధిస్తుంది.

విటమిన్ సి, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, కాల్షియం, పొటాషియం, భాస్వరం మరియు మాంగనీస్ తో కూడిన బ్రోకలీ రక్తం నుండి విషపదార్థాలను తొలగిస్తుంది.

బెల్లం శరీరంలో గడ్డకట్టిన రక్తాన్ని తొలగిస్తుంది, ఇది రక్తాన్ని శుభ్రపరచడానికి అవసరం.

రక్తాన్ని శుద్ధి చేసేది కాలేయమే. కాబట్టి.. ఇది సక్రమంగా పనిచేస్తేనే రక్తం కూడా శుద్ధిగా ఉంటుంది. కాబట్టి.. దీన్ని శుభ్రంగా ఉంచుకోవాలంటే బ్లాక్ కాఫీ తాగడం అలవాటు చేసుకోండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని, రక్తాన్ని శుద్ధిగా ఉంచుతాయి. ఇందులో ఇంకా విటమిన్ B2, B3 కూడా ఉన్నాయి. మెగ్నీషియం, పోటాషియం, మ్యాంగనీస్‌లు కూడా శరీరానికి అందుతాయి.

 

Exit mobile version