Home Health చిటికెలో ఎక్కిళ్లు తగ్గించే ఇంటి చిట్కాలు

చిటికెలో ఎక్కిళ్లు తగ్గించే ఇంటి చిట్కాలు

0

ఎక్కిళ్ళు ఎప్పుడో ఒకప్పుడు అందరికీ అనుభవమైనవే. ఇవి ఉదరవితానం హఠాత్తుగా సంకోచించడం వల్ల ఏర్పడతాయి. ఇలాంటి సంకోచం వలన గాలి ఉఛ్వాసం ద్వారా ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తూ స్వరతంత్రులను దగ్గరచేస్తుంది. దీని మూలంగా ‘హిక్’ అనే ధ్వని పుడుతుంది. ఈ శబ్దాన్ని ఆధారం చేసుకొనే ఆయుర్వేదంలో ఎక్కిళ్ళను ‘హిక్క’ అని, ఆంగ్లంలో ‘హిక్కప్’ అని అంటారు.

Home tips to reduce hiccupsఅసలు ఎక్కిళ్ళు రావడానికి కారణాలేంటి అంటే.. మూత్రపిండాలు, గుండె, కాలేయం వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధుల వల్ల కూడా ఎక్కిళ్లు వస్తాయి.

  • కొన్ని సందర్భాల్లో మెదడు సంబంధమైన వ్యాధుల వల్ల
  • విష పదార్థాల సేవనం వల్ల
  • శరీరానికి సరిపడని ఆహార పదార్థాల వల్ల
  • కడుపు ఉబ్బరం, గ్యాస్‌ వంటి వాటి వల్ల కూడా ఎక్కిళ్లు వస్తాయి.
  • భయం, దు:ఖం వంటి మానసిక కారణాల వల్ల కూడా ఎక్కిళ్లు రావచ్చు.
  • ఎక్కువ మసాలా పదార్ధాలు ఉన్న ఆహారము తినడం వల్ల,
  • కారము ఎక్కువగా ఉన్న ఆహారము భుజించడం వలన
  • సుగరు వ్యాధి ముదినపుడు
  • ఎక్కువగా మందు (సారా) త్రాగడం వలన
  • ఎక్కువగా పొగ త్రాగడం వలన
  • నోటి పూత తో బాధపదుతున్న
  • ఉదరకోశ క్యాన్సర్ ఉన్నపుడు
  • కామెర్ల జబ్బు తో బాదపడుతున్నపుడు
  • తీవ్రమైన ఎలర్జీ వ్యాధులు లతో బాధపడుతున్నపుడు
  • తీవ్రమైన అజీర్ణవ్యాదులతో బాదపడుతున్నపుడు, కూడా ఎక్కిళ్ళు వస్తుంటాయి.

నిజానికి ఎక్కిళ్లు అనేవి జబ్బు కాదు. ఎక్కిళ్లు దీర్ఘకాలంగా ఉన్నా ప్రమాదం లేదు. అయితే ఎక్కిళ్లు వచ్చినపుడు ఇబ్బందిగా, విసుగ్గా ఉంటుంది.అందుకే ఎక్కిళ్లు వస్తున్నప్పుడు వాటిని ఆపడానికి రకరకాల చిట్కాలను ఉపయోగిస్తాము. ఊపిరిని బిగబట్టి ఉంచడం, చల్లని నీరు తాగడం, హఠాత్తుగా భయపడేట్టు చేయడం మొదలైనవి. వెక్కిళ్ళు చాలవరకు కొద్ది నిమిషాలలో సర్దుకుంటాయి. అలా తగ్గకుండా ఎక్కువకాలం రావడం ఒక వ్యాధి లక్షణంగా భావించాలి.

ఎక్కిళ్లు పోవాలంటే సడన్‌గా భయాందోళనలు కల్గించే మాటలు గానీ, షాకింగ్‌ న్యూస్‌ గానీ చెప్పటం వలన కూడా ఎక్కిళ్లు వెంటనే తగ్గుతాయి. ఎందుకంటే మన మెదడు ఆ న్యూస్‌కి రియాక్ట్‌ అయి వెంటనే స్పందిస్తుంది.

శొంఠి, ఎక్కిళ్లకు మంచి పని చేస్తుంది. శొంఠిని పొడిచేసి బెల్లంతో కలిపి పీలిస్తే ఎక్కిళ్లు తగ్గుముఖం పడతాయి. శొంఠి ఒక్కదాన్ని తేనేతో కలిపి తీసుకోవటం వలన కూడా ఎక్కిళ్ళు తగ్గుతాయి. శొంఠి, పిప్పళ్ళు ఉసిరిని పొడిచేసి తేనే, పటికబెల్లం చూర్ణంతో కలిపి సేవిస్తే ఎక్కిళ్ళు తగ్గుతాయి.

నాలుకకు తరుచుగా తేనె రాస్తున్నా ఎక్కిళ్లు తగ్గుతాయి. జామకాయను తిన్నా ఎక్కిళ్లు తగ్గుతాయి. సాధారణంగా చిన్నపిల్లలకు ఎక్కిళ్ళు ఎక్కువగా వస్తుంటాయి. ఇంట్లో అమ్మ, అమ్మమ్మ, నాన్నమ్మ వుంటే ఏవరో ఎక్కువగా తలుచుకోవటం వల్ల ఎక్కిళ్లు ఎక్కువగా వస్తున్నాయి అంటారు. నిజానికి చిన్న పిల్లలకు ఎక్కిళ్లు బాగా వస్తుంటే వాళ్ళనీ బోర్లాపడుకోబెట్టి వెన్ను తట్టాలి. ఇలా చేయటం వల్ల ఎక్కిళ్లు తగ్గుతాయి.

కొద్దిగా పంచదార నోట్లో వేయటం లేదా నీళ్ళలో పంచదార కలుపుకొని తాగడం వల్ల కూడా ఎక్కిళ్లు తగ్గుతాయి. ఊపిరిని గట్టిగా పీల్చి కొంతసేపు బిగబట్టి తరువాత వదలాలి. అలా చేయటం వలన కూడా ఎక్కిళ్లు పోతాయి. నీరుల్లి రసాన్ని పీలిస్తే కూడా ఎక్కిళ్లు తగ్గుతాయి

ఒక స్పూన్ నిమ్మరసం తాగడం గానీ, ఒక స్పూన్ వేరుశెనగ వెన్న తినడం వలన కూడా ఎక్కిళ్లు తగ్గుతాయి. కొంత మందికి ఎక్కువగా ఎక్కిళ్లు వస్తుంటాయి. అలాంటి వాళ్లు పచ్చి అల్లం తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.

ఎక్కిళ్లు రాకుండా ఉండాలంటే ఎక్కిళ్లను ప్రేరేపించే విషయాలకు, తినుబండరాలకు దూరంగా ఉంటే చాలు. అవేంటంటే…

* మద్యం, సిగరెట్లు తాగకూడదు.
* శీతలపానీయాలకు దూరంగా ఉండాలి.
* హఠాత్తుగా ఆందోళనకు గురికావడం, హఠాత్తుగా ఉత్తేజితమవటం వంటివి చేయరాదు.
* వేగంగా తినే అలవాటును మార్చుకోవాలి.
* ఎక్కువ తినడం, తాగడాన్ని తగ్గించుకోవాలి.

 

Exit mobile version