Home Health ఉడకబెట్టిన గుడ్లను ఎంతసేపటిలో తినాలి? ఆలస్యం చేస్తే ఏమవుతుంది?

ఉడకబెట్టిన గుడ్లను ఎంతసేపటిలో తినాలి? ఆలస్యం చేస్తే ఏమవుతుంది?

0

అనారోగాలతో ఆసుపత్రి పాలైన వారికి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలని వైద్యలు చెప్పడం ఎక్కువగా చూస్తుంటాం. ప్రోటిన్‌ ఉండే వాటిని తీసుకోవాలనగానే ముందుగా గుర్తొచ్చేది కోడి గుడ్డు. ఇది ప్రోటీన్ బ్యాంక్‌ పరిగణించబడుతుంది. ఉడకబెట్టిన గుడ్డు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. కోడిగుడ్లను ఒకప్పుడు ఏ ఆదివారమో తినేవారు. కానీ వాటిని ప్రస్తుతం రోజూ తింటున్నారు. గుడ్డుతో పాటు చికెన్, మటన్ లో కూడా పోషకాల సామర్ద్యం ఎక్కువగా ఉంటుంది. కానీ తక్కువ ధరలో ప్రతిఒక్కరికి లభించేది ఒక గుడ్డు మాత్రమే. అందుకని ఎంతోమంది గుడ్డును తినడానికి ముందుగా ప్రాధాన్యతను ఇస్తారు. ఇక వ్యాయామం చేసేవారు అయితే రోజూ గుడ్లను తినాల్సిందే. అలాగే చిన్నారులకు తల్లిదండ్రులు రోజూ గుడ్లను తినిపిస్తుంటారు. అల్పాహారంలో గుడ్లకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించారు.

boiled eggsగుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. కోడిగుడ్ల ద్వారా శరీరానికి అనేక రకాల పోషకాలు లభిస్తాయి. గుడ్లలో మన శరీరానికి కావల్సిన శాచురేటెడ్ ఫ్యాట్లు, పాలీ అన్ ‌శాచురేటెడ్ ఫ్యాట్స్, మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్, పొటాషియం, విటమిన్ ఎ, కాల్షియం, ఐరన్, విటమిన్ డి, విటమిన్ బి6, విటమిన్ బి 12, మెగ్నిషియం వంటి కీలక పోషకాలు ఉంటాయి. ఎందుకంటే గుడ్డు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. మెదడు ఆరోగ్యానికి గుడ్డు ఉపయోగపడుతుంది. గుడ్డు సొనలో కోలిన్‌ అనే పోషక పదార్థం ఉంది. ఇది మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మెదడు నుండి సంకేతాలు వేగంగా అందేందుకు కూడా ఉపయోగపడుతుంది.

గుడ్డులోని ఐరన్‌ని శరీరం వేగంగా గ్రహిస్తుంది. ఐరన్‌ గర్భిణులు, బాలింతలకు ఉపయోగపడుతుంది. మహిళల్లో రొమ్ము కాన్సర్ రాకుండా కాపాడుతుంది. జట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. గుడ్డులో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి సాయపడతుంది. గుడ్డులో పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు గట్టిపడటానికి ఉపయోగపడతాయి. అలానే నరాల బలహీనత ఉన్న వారు రోజూ గుడ్డును తీసుకోవాలి. ఇది నరాల బలహీనత తగ్గేలా చేస్తుంది. గుండె జబ్బుల నివారణకు తోడ్పడుతుంది.

కోడిగుడ్లను కొందరు ఆమ్లెట్‌ వేసుకుని తింటే కొందరు ఫ్రై లేదా కూరలా చేసి తింటారు. కొందరు ఉడకబెట్టుకుని తింటారు. అయితే అన్నింటిలోకెల్లా ఉడకబెట్టి తినడమే శ్రేయస్కరమని నిపుణులు చెబుతుంటారు. అందువల్ల ప్రజలు జిమ్, వ్యాయమం చేసిన తర్వాత ఉడికించిన గుడ్డు తినడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఉడికించిన గుడ్లను ఎంతసేపటిలో తినాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

కోడిగుడ్లను ఉడకబెట్టిన తరువాత వాటి మీద ఉండే పొట్టును తీయరాదు. పొట్టును తీసి తినకుండా ఆలస్యం చేస్తే గుడ్లు గాలికి ప్రభావితం అవుతాయి. గాలిలో ఉండే బాక్టీరియా, ఇతర సూక్ష్మ క్రిములు గుడ్లపై వ్యాప్తి చెందుతాయి. దీంతో ఎక్కువ సమయం పాటు ఉంచిన గుడ్లను తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక పొట్టును తీయకుండా ఉంటే గుడ్లను ఎక్కువ సేపు ఉంచి కూడా తినవచ్చు. ఎలాంటి దుష్ప్రభావాలు కలగవు. కానీ గుడ్డును ఉడకబెట్టిన తరువాత పగిలితే మాత్రం వెంటనే పొట్టును తీసేసి తినాలి. అలాగే ఉంచరాదు.

ఉడికించిన గుడ్లను ఎక్కువసేపు బయట ఉంచితే వాటి PH మారుతుంది. ఈ కారణంగా అవి వాసన పడతాయి. గుడ్లు ఉడకబెట్టిన వెంటనే వాటిని చల్లటి నీటిలో ఉంచండి. గుడ్లు చల్లబడినప్పుడు, వాటిని శుభ్రమైన గుడ్డతో తుడిచి, ఆరబెట్టి, వెంటనే రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి. ఇలా చేయడం ద్వారా, బ్యాక్టీరియా, ఇతర ఇన్ఫెక్షన్లు గుడ్డులోకి ప్రవేశించలేవు. గుడ్లను చల్లబరిచిన తరువాత వీలైనంత త్వరగా వాటిని ఫ్రిజ్‌లో ఉంచండి. గుడ్లను వెంటనే ఫ్రిజ్‌లో ఉంచకపోతే అవి తినడం ప్రమాదకరంగా మారుతాయి. అధిక ఉష్ణోగ్రతలు గుడ్డును సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియాకు గురి చేస్తాయి.

కోడిగుడ్లను ఉడకబెట్టిన తరువాత పొట్టు తీసి వాటిని ఒక పాత్రలో ఉంచి మూత పెట్టి దాన్ని ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇలా చేస్తే గుడ్లు తాజాగా ఉంటాయి. గుడ్లను 4 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఎంత సేపైనా నిల్వ చేయవచ్చు. అలా నిల్వ ఉంచిన గుడ్లు వారం వరకు బాగానే ఉంటాయి. అప్పటి వరకు వాటిని తినవచ్చు. ఈ పద్ధతుల తరువాత, గుడ్ల రుచి మాత్రమే కాకుండా .. వాటి పోషకాలు కూడా చెక్కుచెదరకుండా ఉంటాయి. గుడ్డు తినవలసి వచ్చినప్పుడు, దానికి కొద్ది నిమిషాల ముందు ఫ్రిజ్ నుండి బయటకు తీయండి. రెండు గంటలకుపైగా బయట గుడ్లను బయట ఉంచితే వాటిని తినకూడదు.

Exit mobile version