Home Health పెరుగు బెల్లం కలిపి తింటే ఈ సమస్యలు దూరమవుతాయి!

పెరుగు బెల్లం కలిపి తింటే ఈ సమస్యలు దూరమవుతాయి!

0

పాల‌లో చ‌క్కెరకు బ‌దులు తాటి బెల్లం లేదా మాములు బెల్లం అయిన క‌లుపుకొని తాగ‌డం వ‌ల‌న మంచి ఫ‌లితం ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే బెల్లంను పాల‌తోనే కాదు పెరుగుతో క‌లుపుకొని కూడా తిన‌డం వ‌ల‌న కూడా చాలా మంచిది. ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇలా త‌ర‌చు తినండం వ‌ల‌న రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతూ మ‌న‌ల‌ని ఎల్ల‌పుడు ఆరోగ్యంగా ఉంచుతుంది.

How many benefits of eating jaggery in yogurtపెరుగు మనకు సహజంగా లభించే ఒక శక్తి వనరు. అంతేకాదు.. పెరుగులో ప్రోటీన్, కాల్షియం, రైబోఫ్లేవిన్, విటమిన్ బీ6, విటమిన్ బీ12 ఉన్నాయి. బెల్లంలో మెగ్నీషియం, ఇనుము, ఖ‌నిజాలు, సెలీనియం, మాంగ‌నీస్, రాగి, కాల్షియం వంటి అనేక పోష‌కాలు క‌లిగి ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలం వేడి తట్టుకోవాలంటే పెరుగు తినడం చాలా అవసరం. కేవలం వేడి తగ్గించడమే కాకుండా.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మనకు పెరుగు వల్ల కలుగుతాయి.

అరుగుదల సమస్యలను తగ్గించడంతోపాటు.. పొట్ట సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. నిద్రలేమి సమస్య నుంచి పరిష్కారం చూపిస్తుంది. అయితే.. బెల్లం కలిపి తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయట. ప్రస్తుత కాలంలో చాలా మంది రోగనిరోధక శక్తి సరిగాలేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటివారు దీనిని తీసుకోవడం చాలా ఉత్తమమైన మార్గం. రోగనిరోధక శక్తి పెరుగుదలకు ఇది చాలా సహాయం చేస్తుంది.

ఒక్కోసారి క‌డుపు నొప్పి తీవ్రంగా వేధిస్తుంటుంది. ఆ స‌మ‌యంలో పెరుగులో కొద్దిగా బెల్లం క‌లిపి తీసుకోవాలి. ఇలా చేస్తే క్ష‌ణాల్లోనే క‌డుపు నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతారు. పెరుగులో బెల్లం క‌లిపి తీసుకుంటే మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య కూడా దూరం అవుతుంది. బ‌రువు త‌గ్గాల‌ని ప్ర‌య‌త్నించే వారు పెరుగులో బెల్లం క‌లిపి తీసుకుంటే.శ‌రీరానికి బోలెడంత శ‌క్తి ల‌భిస్తుంది. అతి ఆక‌లి కూడా త‌గ్గుతుంది.

అలాగే ఇటీవ‌ల కాలంలో చాలా మంది మ‌హిళ‌లు, పిల్ల‌లు ర‌క్త హీన‌త స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. అయితే ప్ర‌తి రోజు ఒక క‌ప్పు పెరుగులో కొద్దిగా బెల్లం పొడి క‌లిపి తీసుకుంటే. శ‌రీరానికి కావాల్సిన ఐరన్ మ‌రియు ఇత‌ర‌ పోష‌క విలువ‌లు పుష్క‌లంగా అందుతాయి. దాంతో ర‌క్త హీన‌త త‌గ్గు ముఖం ప‌డుతుంది. స్త్రీల‌కు ఋతుచక్రం స‌మ‌స్య‌లు ఉంటే ఈ బెల్లం తిన‌డం వ‌ల‌న ఋతుచక్రం స‌క్ర‌మంగా క్ర‌మం త‌ప్ప‌కుండా వ‌స్తుంది.

పీరియడ్స్ స‌క్ర‌మంగా క్ర‌మం త‌ప్ప‌కుండా వ‌చ్చేవారైనా స‌రే దీనిని తిన‌వ‌చ్చు. మ‌గ‌వారు కూడా బెల్లంను తిన‌వ‌చ్చు. వీరిలో కూడా ఎర్ర రక్త క‌ణాల‌ను ఉత్ప‌త్తి చేయ‌డానికి, అధిక బ‌రువు త‌గ్గించుకొవ‌డానికి, వ్యాధినిరోద‌క శ‌క్తిని పెంచ‌డానికి స‌హ‌య‌ప‌డుతుంది. చిన్న పిల్ల‌లు అయినా పెద్ద‌వాలైన స‌రే బెల్లంను పెరుగు తో క‌లుపుకొని తిన‌డంవ‌ల‌న శారిర‌క బ‌ల‌హిన‌త‌ను త‌గ్గిస్తుంది.

పెరుగులో బెల్లం క‌లిపి తీసుకుంటే అల‌స‌ట‌, నీర‌సం వంటి స‌మ‌స్య‌లు దూర‌మై. ఫుల్ యాక్టివ్‌గా మారతారు. జ‌లుబు స‌మ‌స్య‌తో బాధ ప‌డే వారు పెరుగులో బెల్లం పొడి మ‌రియు చిటికెడు న‌ల్ల మిరియాల పొడి వేసి తీసుకోవాలి. ఇలా చేస్తే జ‌లుబు స‌మ‌స్య సూప‌ర్ ఫాస్ట్‌గా ప‌రార్ అవుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడటానికి సహాయం చేస్తుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది.

హైపర్ టెన్షన్ ప్రమాదం నుంచి కూడా కాపాడుతుంది. దంతాలు, ఎముకలు బలంగా తయారవ్వడానికి కూడా ఇది సహాయం చేస్తుంది. దీనిలో కాల్షియం మెండుగా ఉంటుంది. విరేచనాలు ఎసిడిటీ వంటి సమస్యలను కూడా తొలగిస్తుంది. చర్మం, జుట్టుకు పెరుగు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చుండ్రు సమస్యను కూడా తగ్గించగలదు. సుమారు 30 నిమిషాలు జుట్టుకి పెరుగు అప్లై చేసి.. ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి.

Exit mobile version