Home Health కీళ్ల నొప్పులును నివారించే పొద్దు తిరుగుడు విత్తనాలు

కీళ్ల నొప్పులును నివారించే పొద్దు తిరుగుడు విత్తనాలు

0

మనం రోజూ తినే స్నాక్స్ లో భాగంగా పొద్దు తిరుగుడు విత్తనాలను తినటం వల్ల మన ఆరోగ్యానికి అనేక ఉపయోగాలు ఉన్నాయి. కాస్త తియ్యగా, పప్పు పదార్థంతో ఉండే సీడ్స్ స్నాక్స్‌గా ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నాయి. కేలరీలతోపాటూ ముఖ్యమైన ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్ ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఇవి ఎముకల ఆరోగ్యం, ముఖ్యమైన అవయవాల పనితీరు బాగుండేలా చూస్తాయి. శరీరంలోని ఎన్ని జీవనక్రియలకు సాయపడతాయి.

benefits of eating sunflower seedsఈ విత్తనాల్ని పొద్దు తిరుగుడు పువ్వు మధ్యలో నుంచీ సేకరిస్తారు. ఇవి బూడిద రంగులో లేదా నలుపు రంగులో ఉంటాయి. నీటి బిందువు ఆకారంలో కనిపిస్తాయి. సైంటిఫిక్‌గా మూడు రకాల సన్‌ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి. అవి లైనోలెయిక్, హైలీ ఒలెయిక్, న్యూసన్. విత్తనాల్లోని మోనోశాచురేటెడ్, శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఆధారంగా వాటిని విభజించారు. పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలతో 21 ప్రయోజనాలు తెలుసుకుందాం.

ఈ విత్తనాల్లోని విటమిన్ E, సెలెనియం, కాపర్‌కి విష వ్యర్థాల్ని అడ్డుకునే శక్తి ఉంది. ఇవి కణాలు దెబ్బ తినకుండా కాపాడతాయి. కొలన్ కాన్సర్, ప్రొస్టేట్ కాన్సర్, బ్రెస్ట్ కాన్సర్ సోకకుండా చేస్తాయి. సన్‌ఫ్లవర్ సీడ్స్… మన ఊపిరి తిత్తులను బాగు చేస్తాయి. ఊపిరి పీల్చేటప్పుడు, వదిలేటప్పుడూ ఎదురయ్యే సమస్యల్ని నయం చేస్తాయి.

శరీర ద్రవాలు బ్యాలెన్సింగ్‌తో ఉండేలా ఈ విత్తనాల్లోని పొటాషియం చూసుకుంటుంది. అలాగే అమీనో యాసిడ్… ఒత్తిడిని తగ్గించే సెరెటోనిన్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కీళ్ల నొప్పుల్ని నివారించడంలో కూడా ఈ పప్పులు బాగా పనిచేస్తాయి.

జుట్టుకు అవసరం. మన వెంట్రుకలకు కావాల్సిన సెలెనియం, ప్రోటీన్స్, విటమిన్ ఈ, బీ వంటి వాటిని జుట్టు కోరుకుంటుంది. ఈ గింజలు తిని మనం వాటిని అందించవచ్చు. ఫలితంగా జుట్టు బాగా పెరిగి హెయిర్ లాస్ అరికట్టవచ్చు. జుట్టు తెల్లబడే సమస్యకు కూడా ఈ గింజలు చక్కటి పరిష్కారం అవుతాయి.

ముసలితనం రాకుండా చెయ్యడంలో ఈ గింజలు ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని పోషకాలు మన చర్మానికి అత్యంత ప్రయోజన కారకాలు. ముఖ్యంగా విటమిన్ E స్కిన్ డ్యామేజ్ నుంచీ కాపాడుతుంది. చర్మం మెరిసేలా చేస్తుంది.

Exit mobile version