Home Health కరోనా వచ్చిన వారికి టీకా ఎన్ని రోజులు తరువాత వేయొచ్చు

కరోనా వచ్చిన వారికి టీకా ఎన్ని రోజులు తరువాత వేయొచ్చు

0

రోగ నిరోధక వ్యవస్థలో రెండు ప్రధాన భాగాలుంటాయి. ఒకటి.. సహజ వ్యవస్థ. రెండోది.. సముపార్జిత వ్యవస్థ. మన ఒంట్లోకి ఏదైనా ప్రవేశించిందని శరీరం గుర్తించిన వెంటనే ఈ సహజ వ్యవస్థ స్పందించి ప్రతి చర్య మొదలుపెడుతుంది. అలా మనం కరోనా టీకా వేసుకోగానే.. తెల్ల రక్తకణాలు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని ప్రక్రియ ప్రారంభిస్తాయి. దాని వల్లే టీకా వేసుకున్న భాగంలో తిమ్మిర్లు, నొప్పిగా అనిపించడం, అలసటగా ఉండటం లాంటి లక్షణాలు కన్పిస్తాయి.

వ్యాక్సిన్‌వ్యాక్సిన్‌ వేసుకున్నాక జ్వరం రావొచ్చు

కరోనా టీకా వేసుకుంటే కొందరిలో తేలికపాటి జ్వరం, ఇంజక్షన్‌ చేసిన ప్రదేశంలో నొప్పి మొదలైనవి రావచ్చు. టీకా వేసుకున్నాక అరగంటపాటు టీకా కేంద్రంలోనే విశ్రాంతి తీసుకోవాలి. అసౌకర్యంగా అనిపిస్తే అధికారులు, ఆశ/ఏఎన్‌ఎంలకు తెలియజేయాలి. షెడ్యూల్‌ పూర్తి చేయడానికి ఒక వ్యక్తి రెండు డోసుల వ్యాక్సిన్‌ను 28 రోజుల వ్యవధిలో తీసుకోవాలి. వ్యాక్సిన్ రకాన్ని బట్టి రెండు డోస్ ల మధ్య వ్యవధి ఉంటుంది. రెండు డోస్‌లు వేసుకున్న రెండు వారాల తర్వాత శరీరంలో సాధారణంగా యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయి.

కరోనా వచ్చినవారికి టీకా వేయొచ్చా?

కరోనా ఉన్న వ్యక్తులకు ఆ సమయంలో టీకా వేయకూడదని కేంద్రం స్పష్టం చేసింది. ఎందుకంటే సంబంధిత వ్యక్తి టీకా కేంద్రానికి వస్తే ఇతరులకు వ్యాపింపజేసే ప్రమాదం ఉంటుందని పేర్కొంది. అలాగే కరోనా ఉన్న వ్యక్తి టీకా వేసుకుంటే ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలాంటి వారు కోలుకున్న తర్వాత అంటే 14 రోజుల తర్వాత టీకా తీసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. మరోవైపు కరోనా టీకా వేసుకున్న తరువాత కూడా ప్రజలు మాస్క్‌లు ధరించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. చేతులు శుభ్రపరుచుకోవాలని, భౌతికదూరం నిబంధనను పాటించాలని సూచించింది.

క‌రోనా వ్యాక్సిన్ తీసుకోవ‌డానికి ముందు, తీసుకున్న త‌ర్వాత‌ విశ్రాంతి చాలా అవ‌స‌రం. ఎంత ఎక్కువ నిద్ర‌పోతే అంత చురుగ్గా ఉంటాం. కాబ‌ట్టి ఈ స‌మ‌యంలో సంతృప్త కొవ్వులు, చ‌క్కెర‌స్థాయులు ఎక్కువ ఉన్న ఆహారాన్ని దూరం పెట్టాలి. ఎందుకంటే చ‌క్కెర అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవ‌డం ద్వారా ఒత్తిడి, యాంగ్జైటీ పెరిగిపోతుంది. దీంతో నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌క‌.. స‌రైన విశ్రాంతి ఉండ‌దు. వీలైనంత వ‌ర‌కు అధిక ఫైబ‌ర్ ఉండే ఆహారమే తీసుకోవాలి.

జ్వరంతో బాధపడుతున్నప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే.. వ్యాధి లక్షణాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని తెలుపుతున్నారు. మీ జ్వరాన్ని.. రియాక్టోజెనిక్ వ్యాక్సిన్ ప్రతిచర్యల నుంచి వేరు చేయడం కష్టంగా మారుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది తీవ్రమైన సైడ్ ఎఫెక్టులకు కూడా దారితీయొచ్చని, కోలుకోవడం కూడా కష్టమవుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మీరు వ్యాక్సిన్ తీసుకోడానికి ముందు తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి. లేదా వ్యాక్సినేషన్ సెంటర్‌లో ఉండే అధికారులకు మీ అనారోగ్య పరిస్థితులను వివరించి చెప్పండి. వారి సలహా తీసుకున్న తర్వాతే వ్యాక్సిన్ వేయించుకోండి.

కరోనా బాధితులకు అవసరం లేదా? అనే సందేహం చాలా మందికి ఉంది. ఇప్పటికే కరోనా వైరస్ సోకి కోలుకున్న బాధితులకు వ్యాక్సిన్ షాట్ అవసరం లేదనే ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవం లేదు. ఎవరైనా సరే తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవల్సిందే. ఎందుకంటే.. కరోనాకు చికిత్సలో భాగంగా అందించే ఔషదాల వల్ల రోగ నిరోధక శక్తి దీర్ఘంగా కొనసాగుతుందని భావించవద్దు. అది తాత్కాలికం మాత్రమే. చివరికి వరకు మన శరీరానికి కరోనా వైరస్‌తో పోరాడే శక్తి కావాలంటే తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ వల్ల మీ శరీరానికి వైరస్ నుంచి పూర్తి భద్రత లభిస్తుంది. అయితే, వ్యాక్సిన్ వేయించుకోడానికి ముందు, ఆ తర్వాత మద్యం ఇతరు చెడు వ్యవసనాలకు దూరంగా ఉండండి. ఏమైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి. వ్యాక్సిన్ మీద వస్తున్న వదంతులు నమ్మకండి.

Exit mobile version