Home Health కాకరకాయతో ఫేస్ ప్యాక్స్ ఎలా వేసుకోవాలో తెలుసా?

కాకరకాయతో ఫేస్ ప్యాక్స్ ఎలా వేసుకోవాలో తెలుసా?

0

కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలుసు. కానీ కాకరకాయ పేరు వినగానే ముందు అందరూ ముఖాన్ని వికారంగా పెడతారు. చేదుగా ఉంటుందని ఎవరూ దీన్ని తినడానికి ఇష్టపడరు. ఇప్పటివరకూ కాకరకాయతో ఆరోగ్య ప్రయోజనాల గురించే విన్నాం కానీ దీన్ని ముఖ సౌందర్యం కోసం ఉపయోగించొచ్చని మీకు తెలుసా… కాకరకాయతో అందానికి ఎలా మెరుగులు దిద్దొచ్చో తెలుసుకుందాం.

kakarakayaకాకరకాయతో కొన్ని ఫేస్ ప్యాక్స్ వేసుకోవడం వల్ల మొటిమల సమస్య చాలా వరకూ తగ్గుతుంది. అయితే ఈ ఫేస్ ప్యాక్స్ ఎలా వేసుకోవాలి? ముందుగా కాకరకాయని రసంలా చేసి ఈ రసాన్ని ముఖానికి రాసుకుని 5 నిమిషాలు అలానే ఉంచి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రంగా కడిగాలి.

ఇలా రోజు చేయడం వల్ల ముఖం ఎంతో కాంతివంతంగా తయారవుతుంది. ముఖంపై ఎలాంటి మచ్చలు ఉన్నా దూరం అవుతాయి. ముఖం ఎంతో తాజాగా మారుతుంది. మొటిమల సమస్యతో బాధపడేవారు ఈ ప్యాక్‌ని రెగ్యులర్‌గా వేసుకుంటూ ఉండడం వల్ల సమస్య త్వరగా తగ్గుతుంది.

కాకరకాయని పేస్ట్‌లా చేసి అందులో జాజికాయ పొడి, పెరుగు కలిపాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని ముఖంపై ప్యాక్‌లా వేసుకుని ఆరిన తర్వాత చల్లని నీటితో క్లీన్ చేయాలి. ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే మొటిమలు, మచ్చల సమస్య పూర్తిగా తగ్గుతుంది.

చర్మ సమస్యలు, దురద సమస్యలు ఉన్నవారు కాకరకాయని పేస్ట్‌లా చేసి అందులో కొద్దిగా కలబంద గుజ్జు, పసుపు కలిపి సమస్య ఉన్న ప్రాంతంలో అప్లై చేసి ఆరిన తర్వాత నీటితో కడిగేయాలి. రెగ్యులర్‌గా ఇలా చేయడం వల్ల క్రమంగా ముఖం మీద ఉన్న మచ్చలు మొత్తం తగ్గుతాయి.

కాకరకాయ ముక్కలను నీటిలో వేసి మరిగించి ఆ నీటిలో కాటన్ బాల్ ముంచి ముఖాన్ని క్లీన్ చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న ఎలాంటి మచ్చలైనా దూరం అవుతాయి. దీనిని ముఖానికి మంచి టోనర్‌గా వాడొచ్చు. ఎప్పటికప్పుడు రసంని తీసుకోవడం కష్టం అనుకుంటే ఒక్కసారిగా రసంని తీసుకుని ఓ బాటిల్‌లో పోసుకుని ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడల్లా ఈ టోనర్‌ని రాసి సమస్యని దూరం చేసుకోవచ్చు.

 

Exit mobile version