మార్కెట్ లో ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, కాదంటే వంటింటి చిట్కాలు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి. అయితే ఎలాంటి చర్మాలకు ఎలాంటి చిట్కాలు వాడాలి అనేది చాలామందికి తెలియదు. వాటి కోసం వందలు ఖర్చుపెట్టాల్సిన పని లేదు. బ్యూటీ పార్లర్‌లకు వెళ్ళాల్సిన అవసరం అంతకన్నా లేదు. అందుబాటులో ఉన్నవాటితో చర్మతత్వాన్ని బట్టి ఎలాంటి ప్యాక్‌లు వేసుకోవాచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
జిడ్డు చర్మం ఉన్న వారు బొప్పాయి గుజ్జు, వేప, ముల్తాన్ మట్టిను రోజువాటర్‌తో కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జిడ్డు పోతుంది, మొటిమలు తగ్గుతాయి.
శనగపిండి ప్యాక్ చర్మంపై టాన్‌ను తొలగించడంలో చాలా అద్బుతంగా పని చేస్తుంది. రెండు చెంచాల శనగపిండి, ఒక చెంచా పసుపు, రెండు చెంచాల పాలు, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి చక్కని ప్యాక్ తయారుచేసుకుని చేతులు, పాదాలకు రాసుకుని పూర్తిగా ఆరాక చల్లని నీటితో కడిగిది టాన్ తొలగిపోతుంది.
పొడి చర్మంగల వారు గులాబీ, చందనం, అల్మండ్ పౌడర్‌లు పాలల్లో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి మెల్లగా మర్దన చేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మంలో పొడితనం పోయి ముఖం కాంతివంతమవుతుంది.
విటమిన్ సి ఎక్కువగా ఉండే మంచి బ్లీచింగ్ ఏజెంట్‌లా పని చేసే నిమ్మకాయలు చర్మాన్ని శుభ్రపరుచుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. అరచెక్క నిమ్మకాయను తీసుకుని దానిపై కొంచెం పంచదారను వేసి చేతులు, పాదాలపై రుద్దాలి. పది నిముషములు అలా వదిలేసి తరువాత కడిగివేయాలి.
టమోటాలు సహజమైన బ్లీచింగ్ పదార్థం మాత్రమే కాదు, యువి కిరణాల నుండి మీ చర్మం యొక్క సున్నితత్వాన్ని తగ్గిస్తుంది. టమోటా రసం లేదా అరచెక్క టమోటాను సమస్య ఉన్నచోట రుద్ది అయిదు నిమిషాల తరువాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.
దోసకాయ రసం, పసుపు, నిమ్మరసంతో చేసిన ప్యాక్ మంచిది. ఎందుకంటే పసుపులో యాంటిసెప్టిక్ లక్షణాలు, దోసకాయలో క్లీనింగ్ ఏజెంట్, నిమ్మలో సిట్రిక్ ఆసిడ్ గుణాలు ఉంటాయి. ఈ ప్యాక్ ను టాన్ ఉన్న మెడకు అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగాలి. ఇలా రోజూ చేయడం వల్ల మంచి ఫలితం కనబడుతుంది.