ప్రతి ఒక్కరు శుభ్రంగా స్నానం చేసి ఎలా పూజా కార్యక్రమాలు నిర్వహించాలి అనుకుంటామొ దానికంటే ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేసుకోవడానికి చీపురును వాడుతాము. చీపురును సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా భావించాలి.
సాధారణంగా ఇంటిని శుభ్రం చేసిన తర్వాత చీపురును మనము ఒక మూలన పెడుతూ ఉంటాము. మూలన పెట్టినప్పుడు చీపురు పట్టుకునే భాగమును నేలకు ఆనించి పెడుతూ ఉంటారు. కుచ్చు భాగమును నేలకు ఆనించి పెడితే పాడైపోతుంది అని తలచి ఇలా చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కుచ్చు భాగమును మాత్రమే నేలకు ఆనించి పెట్టాలి. చీపురుకట్టను నిలబెడితే దరిద్ర దేవతకు ఆహ్వానం పలుకుతూ ఉన్నట్లే లెక్క. ఇలాంటి పొరపాట్లు ఇంకా చాలానే ఉన్నాయి అవేమిటో తెలుసుకుందాం…
ఉదయం నిద్రలేవగానే ఉత్తర దిశ (కుబేర స్థానం) ను చూడటం మంచిది. దీనివల్ల ధనాదాయం లభిస్తుంది.
పక్కమీద నుండి దిగగానే తూర్పువైపుకు కొంచెం నడక సాగించడం ద్వారా తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి.
గృహాన్ని చిమ్మేటప్పుడు ఈశాన్యం నుంచి నైరుతి వైపుకు చిమ్మి చెత్తను పోగు చేయండి. ఈశాన్యం వైపు చెత్త తీసుకురాకూడదు. ఈశాన్యం వైపు చెత్తను పోగు చేస్తే ఆ గృహంలో సంపద నిలకడగా ఉండదు.
ఇంటిని చిమ్మే చీపురు శనీశ్వరుని ఆయుధం. ఈశాన్యం దర్వాజా తప్ప ఏ వైపు డోర్ వేనుకవైపు గోడకు ఒక మేకు కొట్టి చీపురు హ్యాండిల్ పైకి వచ్చేలా మాత్రమే పెట్టి ఉండాలి. రివర్స్ పెడితే ఇంట్లో శని దేవుని నిలుపుకున్నట్లే అవుతుంది.
చీపురు ఇంటికి వచ్చిన అతిథులకు కనబడకుండా ఉండాలి, కాబట్టి డోర్ వెనక భాగంలో పెట్టుకొమ్మని సలహా ఇవ్వడం జరుగుతుంది.
ఈశాన్య మూలలో దేవుని మందిరాలు నిర్మించడం చేయకూడదు. దీని వల్ల ఈశాన్య మూల మూతపడుతుంది. అది శుభదాయకం కాదు. గృహంలో ఈశాన్య మూల మూతపడకుండా చూసుకోవడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. ఈశాన్య దిక్కు మూతపడ్డట్లైతే అశుభ ఫలితాలు సంభవిస్తాయి.
శాస్త్రాన్ని నమ్మి సూచనలు పాటిస్తే శుభాలు కలుగుతాయి. పెద్దల మాట సద్దన్నం ముట అంటారు.
చీపురు లక్ష్మీ దేవికి చిహ్నం. ఎప్పుడు దానిని అగౌరవపరచకూడదు. చీపురును ఎప్పుడూ తాకవద్దు, గట్టిగా కొట్టవద్దు. సూర్యాస్తమయం తర్వాత చీపురుతో ఊడవకూడదు. అది డబ్బు నష్టానికి దారితీస్తుంది.