Home Unknown facts పౌర్ణమి రోజు ఈ విధంగా పూజ చేస్తే ఆర్ధిక సమస్యలు తొలగిపోతాయి!

పౌర్ణమి రోజు ఈ విధంగా పూజ చేస్తే ఆర్ధిక సమస్యలు తొలగిపోతాయి!

0

అందరికీ ఏదో ఒక సమయంలో సమస్యలు వస్తూనే ఉంటాయి. సమస్యలు లేని వారంటూ ఎవరూ ఉండరు. కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉంటే మరికొంతమందికి ఆర్థిక సమస్యలు ఉంటాయి. సమస్యలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ సమస్యల నుంచి గట్టెక్కడానికి తమ ఇష్టదేవతలను ప్రార్ధిస్తూ ఉంటారు.

పౌర్ణమిఇష్ట దైవానికి విశేష పూజలు నిర్వహిస్తుంటారు. అయితే ఆర్థిక సమస్యలు ఉన్నవారు చంద్రుని పూజిస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు. పౌర్ణమి రోజున పూజలు, వ్రతాలు విశిష్టమైన ఫలితాలినిస్తాయి. ప్రతి మాసంలోను పౌర్ణమి విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది.

మరి పౌర్ణమి రోజున చంద్రుణ్ణి ఏ విధంగా పూజించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అష్టమి నుండి పౌర్ణమి వరకు చంద్రునికి పెరుగన్నం నైవేద్యంగా పెడితే ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ నైవేద్యాన్ని అరటి ఆకులో సమర్పించాలి. ఒకవేళ అరటిఆకు లేకపోతే వెండి గిన్నె లో నైవేద్యాన్ని సమర్పించాలి.

పౌర్ణమి రోజు చంద్రుడికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని మాత్రమే తినాలి. ఇతర ఆహారాలను తీసుకోకూడదు. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఎందుకంటే పౌర్ణమి రాత్రి వేళలో లక్ష్మీదేవి ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ వెళుతుందట. చంద్రుడి పూజించిన వారికి అమ్మవారి కటాక్షం కారణంగా దారిద్ర్య బాధలు తొలగిపోయి, సిరి సంపదలు చేకూరతాయి.

 

Exit mobile version