Home Unknown facts నుదుటిపై బొట్టు పెట్టుకోవడం వెనుక కూడా సైంటిఫిక్ రీసన్ ఏంటి

నుదుటిపై బొట్టు పెట్టుకోవడం వెనుక కూడా సైంటిఫిక్ రీసన్ ఏంటి

0

మన పూర్వికులు ఏ ఆచారం పెట్టినా దానివెనుక వైజ్ఞానిక అంశాలు దాగి ఉంటాయి. మూఢనమ్మకాలు అని కొట్టి పారేస్తుంటారు కానీ వాటి వెనుక ఉన్న సైన్స్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు. అలాంటిదే ఒకటి బొట్టు పెట్టుకోవడం. నుదుటి మీద బొట్టు పెట్టుకోవడం హిందువుల సంప్రదాయం. బొట్టు ఆడవారికి అందం కూడా. కాని ఈ బొట్టు పెట్టుకోవడం వెనుక కూడా సైంటిఫిక్ రీసన్ ఉంది.

Importance Behind Hindu Traditionసాధారణంగా బొట్టు బృకుటి ప్రాంతం (కను బొమ్మల మధ్యలో) పెటుకోవాలి. అక్కడ ఇడ, పింగళ, సుఘమ్నా అనే మూడు నాడులు కలుస్తాయి, దీనినే త్రివిణి సంగమం అంటారు. ఇది పీయూష గ్రంధికి అనుబంధ స్థానం. దీనిని జ్ఞాన గ్రంధి అని కూడా అంటారు. ఎవరయితే సుఘమ్నా నాడికి చురుకుదనం కలిగిస్తారో వాళ్ళలో జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. మనం ధరించే బొట్టు ప్రభావం పీయూష గ్రంధి ఫై ఉంటుందట.

మన శరీరంలో బ్రుకుటి స్థానంలో ధన (+ ve ) , మెడ వెనుక భాగాన ఋణ (- ve ) విద్యుత్ ప్రాంతాలు ఉన్నాయి. ఇవి రెండు శారీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరణం చేస్తాయి. బృకుటి వద్ద ఉన్న ఈ నాడులు సున్నితంగా ఉంటాయి. (ఆడవారిలో ఇంకా సున్నితంగా ఉంటాయి.) అందుకే జ్వరం, జలుబు వస్తే నుదిటి మీద చల్లటి గుడ్డ వేస్తారు.

తిక్షణమైన సూర్యకిరణాల నుండి కాపాడేందుకు బొట్టు (కుంకుమ) ధరించాలి. సాయంత్రం, రాత్రి సమయాలల్లో విభూతి ధరిస్తే చల్లగా ఉంటుంది. విభూతి వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. చర్మ రోగాలు రాకుండా కాపాడుతుంది. బొట్టు పెట్టుకోవడం వల్ల అది మన శరీరంలోని ఉష్ణోగ్రతను పిల్చివేస్తుంది. స్వశకొసములకు తగినంత ఉష్ణాన్ని అందిస్తుంది. అంతే కాదండి సూర్యకిరణాల నుండి జ్ఞాన నాడికి హాని కలగకుండా కాపాడుతుంది.

కానీ నేటి స్ర్తీలు రసాయనాలతో తయారు చేసిన బొట్టు ( స్టిక్కర్స్ ) వాడడం వల్ల భ్రుకుటి వద్ద చర్మ రోగాలు వస్తున్నాయి. దీని వల్ల కొందరు స్ర్తీలు బొట్టు పెట్టుకోవడం కూడా వదిలేస్తున్నారు. మనం సూర్యుడిని నేరుగా చూడలేం. అదే రంగుల అద్దాలు లేదా ఒక వైపు రంగు ఉన్న గాజు ద్వారా, స్పష్టంగా సూర్యుడిని చూడగలం. ఎందుకంటే సూర్య కిరణాలు అద్దం పై పడి పరావర్తనం చెందడం వలన కళ్ళకు హని కలుగదు. అంటే ఇక్కడ సూర్య కిరణాలు కళ్ళకు పడకుండా అద్దం ఏ విధంగా పని చేస్తుందో, అదే విధంగా బొట్టు కూడా జ్ఞాన నాడికి హని కలగకుండా పని చేస్తుంది. అందుకే మన పెద్దలు బొట్టుకి ఇంత ప్రాదాన్యత ఇవ్వడం జరిగింది.

 

Exit mobile version