అన్ని రకాల పండ్లు కొన్ని సీజన్స్‌లలో మాత్రమే దొరుకుతాయి. కొన్ని పండ్లు సంవత్సరానికి ఒక్కసారే దొరుకుతాయి. చాలా తక్కువ పండ్లు మాత్రమే ప్రతి రోజు దొరుకుతాయి. అలా దొరికే పండ్లలో మనకు ఎక్కువగా అందుబాటులో ఉండేది అరటి పండు. అరటి పండు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. వీటి వల్ల మన శరీరానికి కావల్సిన కీలక పోషకాలు అందుతాయి. జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. గుండె ఆరోగ్యానికి మంచిది. తక్షణ శక్తిని ఇవ్వడంలోనూ దీనికి సాటిలేదు.
చాలామంది అరటి పండ్లను ఎక్కువగా తింటే బరువు పెరుగుతామని భయపడుతూ ఉంటారు. అందుకే ఈ పండుకు దూరంగా ఉంటారు. అయితే, ఇందులో పెక్టిన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి తిన్న వెంటనే కడుపునిండిన ఫీలింగ్ కలుగుతుంది.
దీంతో పొట్ట కొంత ముందుకు వచ్చినట్లు అనిపిస్తుంది. అంతేకాని అరటిపండ్లను తింటే బరువు పెరుగరు. పొట్ట కూడా రాదు. అరటిపండ్లలో కొలెస్ట్రాల్ ఉండదు. కానీ వాటిలో ఉండే పలు ఔషధ గుణాలు మన శరీరంలోని మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో మనకు ఉపయోగమే తప్ప నష్టం ఉండదు.
బరువు తగ్గాలని అనుకునే వారు కూడా అరటి పండ్లను దూరంపెడతారు. ఎందుకంటే అరటి పండ్ల వల్ల శరీరంలో అదనపు క్యాలరీలు చేరుతాయని వారు నమ్ముతారు. కానీ అది వాస్తవం కాదు. ఎందుకంటే బరువు తగ్గాలనుకునేవారు ఎక్సర్‌సైజ్ చేసే క్రమంలో అరటి పండ్లను తింటే శరీరానికి ఎక్కువ శక్తి లభిస్తుంది. దీంతో మరికొంత సేపు ఎక్కువగా వ్యాయామం చేయవచ్చు. అది మనకు మేలే చేస్తుంది. కానీ నష్టం చేయదు.