Home Unknown facts Indhuru lo khajuraho ani perugaanchina ramalayam

Indhuru lo khajuraho ani perugaanchina ramalayam

0

ఖజురహో లోని ఆలయం అక్కడ శిల్పకళానైపుణ్యం అందరిని కట్టిపడేస్తుంది. ఎందుకంటే అక్కడ చెక్కిన శృంగార భరిత శిలలు అందరిని మంత్రముగ్దుల్ని చేస్తాయి. అదేవిధంగా ఈ ఆలయం ఇందూరు ఖజురహో అని పేరుగాంచింది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.ramalayamతెలంగాణ రాష్ట్రంలోని, నిజామాబాద్ జిల్లా, డిచిపల్లి మండలం వద్ద ఒక గుట్టపైన గొప్ప శిల్ప సంపదతో, కళకళలాడుతూ ఉన్న అతి పురాతన రామాలయం ఉంది. ఈ ఆలయంపైనా అధ్బుతమైన శిల్పకళతో కూడిన గోడలు, పైకప్పు, ద్వారాలతో అధ్బుతంగా నిర్మించబడింది. ఈ ఆలయం క్రీ.శ. 17 వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుయుచున్నది. ఈ ఆలయానికి దక్షిణాన ఒక కోనేరు, దాని మధ్య ఒక మండపం ఉన్నాయి. ఈ చారిత్రాత్మక గ్రామాన్ని ఒకప్పుడు ద్రాక్షానగరమని, సీతానగరమని పిలిచేవారు. అయితే పూర్వం ఇక్కడ డచ్ వారు ఎక్కువగా ఉండేవారని అందుకే ఈ గ్రామానికి డచ్ పల్లి అని పిలిచేవారని అదే రానురాను డిచిపల్లి గా మారినట్లు తెలుయుచున్నది. ఇక్కడ 60 అడుగుల ఎత్తులో ఉన్న ఆలయ ప్రకారం పైన అపురూప శృంగార చిత్రాలు ఉండటంతో ఈ ఆలయం ఇందూరు ఖజురహో ఆలయముగా పేరు గాంచింది. ఈ ఆలయానికి ఎంతో చారిత్రాత్మక ప్రాధాన్యత ఉంది. ఇక్కడి ఆలయం గోడలపైన చక్కని శిల్పాలు ఉన్నాయి. అయితే ఈ ఆలయం పూర్తిగా నిర్మించబడలేదు. 1949 లో చిన్నయ్య గుప్తా నేతృత్వంలో సీతారాముల విగ్రహాలను ప్రతిష్టించారు. ప్రధానాలయంలోని గర్భగుడిలో సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తి మొదలగు దేవతామూర్తులు మనకు దర్శనమిస్తారు. ఆలయంలోని మూలవిరాట్టు తెల్లని పాలరాతితో చేయబడిన అందమైన విగ్రహాలు భక్తులని ఆకట్టుకుంటాయి. అయితే ఆలయం ఎదురుగా ఉన్న ధ్వజస్థంభం వద్ద శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించవచ్చు. అధ్బుతమైన శిల్ప సంపదతో శృంగార శిల్పాలతో నల్లరాతిపైన మలచిన శిల్పాలతో ఈ కట్టడం అత్యంత రమణీయంగా ఉంటుంది. ఆవరణలో మూడు వైపులా మూడు బురు జులతో కనిపిస్తూ మనకు ఆనతి కాలపరిస్థితులను తెలియచేస్తుంది. ఈ ఆలయంలో రెండు సంవత్సరాలకి ఒకసారి ఉత్సవాలు నిర్వహిస్తారు. తిరుక్కల్యాణ ఉత్సవాలు ఇక్కడ అతి వైభవముగా జరుపుదురు. ఈ రోజులలో ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.

Exit mobile version