Home Entertainment Intense And Clap Worthy Dialogues From Aravindha Sametha

Intense And Clap Worthy Dialogues From Aravindha Sametha

0

త్రివిక్రమ్ సినిమాలంటేనే హీరోయిజం, కామెడీ కంటే ముందు అద్భుతమైన ప్రాసలతో కూడిన పంచ్ లను ఎక్స్ పెక్ట్ చేస్తారు ప్రేక్షకులు. అయితే.. రాను రాను ఆయన ప్రాసల కోసం ప్రాకులాడి పంచ్ ల విలువ పడిపోయింది. ముఖ్యంగా “అజ్ణాతవాసి” సినిమాలో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ఒకట్రెండు మినహా పెద్దగా వినిపించకపోవడంతో గురూజీ అభిమానులందరూ ఒక్కసారిగా ఢీలాపడిపోయారు. అలా ఢీలాపడిన అభిమానుల నోట “అరవింద సమేత” ట్రైలర్ తో పాలు పోసాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ట్రైలర్ లోని కొన్ని మాటలు మనసుకి హత్తుకొంటే.. కొన్ని సంభాషణలు రోమాలు నిక్కబొడుచుకొనేలా చేసాయి. ఇంకొన్ని ఆలోజింపజేశాయి. ఆ సంభాషణలు మీకోసం..!!

1) చావు చొక్కా లేకుండా తిరగాడుతున్నట్లుంది

Aravindha Sametha

2) నేను ఊరికే అడిగానండి.. నేను ఊరికే చెప్పనండి,

3) కదురప్పా ఈడ మంది లేరా, కత్తుల్లేవా,

4) వయొలెన్స్ నీ డి.ఎన్.ఏలో ఉంది,

5) 30 ఏండ్ల నాడు మీ తాత కత్తిపట్టినాడంటే.. అది అవసరం !!
అదే కత్తి మీ నాయన ఎత్తినాడంటే.. అది వారసత్వం !!
అదే కత్తి నువ్వు దూసినావంటే అది లక్షణం !!
ఆ కత్తి నీ బిడ్డనాటికి లోపమైతుందా !!

6) వాడిదైన రోజున ఎవడైనా కొట్టగలడు.. అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు వాడు గొప్పోడు..

7) వినే టైము, చెప్పే మనిషి వల్ల.. విషయం విలువే మారిపోతుంది..

8) సార్ వందడుగుల్లో నీరు పడుతుందంటే నీరు పడుతుందంటే.. 99 అడుగులు వరకు తవ్వి ఆపేసేవాడ్ని ఏమంటారు? మీ విజ్ణతకే వదిలేస్తున్నాను.. ఈ ఒక్క అడుగు వంద అడుగులతో సమానం సార్.. తవ్వి చూడండి..

Exit mobile version