Home Unknown facts సతీదేవి గుండె పడిన ప్రాంతంగా చెప్పబడే ఆ శక్తి పీఠం ఎక్కడ ఉంది?

సతీదేవి గుండె పడిన ప్రాంతంగా చెప్పబడే ఆ శక్తి పీఠం ఎక్కడ ఉంది?

0

దక్ష ప్రజాపతి తలపెట్టిన యాగానికి శివపార్వతులని ఆహ్వానం రానప్పటికీ సతీదేవి ఆ యాగానికి వెళ్లగా దక్షప్రజాపతి శివుడిని అవమానించడంతో ఆ అవమాన భారాన్ని తట్టుకోలేని సతీదేవి ఆత్మాహుతి చేసుకుంటుంది. అప్పుడు శివుడు ఆగ్రహించి ఆమె శరీరాన్ని భుజాన వేసుకొని ప్రళయ తాండవం చేస్తుంటే శ్రీమహావిష్ణువు తన చక్రాయుధంతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేసి శివుడిని శాంతిపచేస్తాడు. ఆలా సతీదేవి శరీర భాగాలూ పడిన ప్రాంతాలన్నీ కూడా శక్తి పీఠాలుగా వెలిశాయని పురాణం. మరి సతీదేవి గుండె పడిన ప్రాంతంగా చెప్పబడే ఆ శక్తి పీఠం ఎక్కడ ఉంది? ఆ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Ambaji Mata Shakti Peeth

గుజరాత్ రాష్ట్రం, రాజస్థాన్ సరిహద్దుల్లో గబ్బర్ కొండలపైన అంబాజీ మాత పీఠం ఉంది. భారతదేశంలోని అతి పురాతన ఆలయాలలో అంబాజీ మాత పీఠం ఒకటిగా చెబుతారు. ఇంకా అమ్మవారి 52 శక్తి పీఠాలలో ఇది కూడా ఒకటి అని చెబుతారు.

ఈ ఆలయం ఉన్న కొండ చుట్టూ ఆరావళి పర్వతాలు ఉన్నాయి. అయితే సముద్రమట్టానికి 1600 అడుగుల ఎత్తున పురాతన ఆరావళి పర్వతాల నైరుతి వైపున ఉన్న అరసుర్ కొండలపైన వేదకాలపు సరస్వతి నది జన్మస్థానానికి దగ్గరలో ఈ గబ్బర్ కొండలు ఉన్నాయి.

పురాణాల ప్రకారం, సతీదేవి దేహంలోని గుండె గబ్బర్ కొండలపైన పడినది అని చెబుతారు. ఇక్కడి గర్బాలయంలో వేదికపైన శ్రీ విసా శ్రీ యంత్రం ప్రతిష్టించబడి ఉంది. భక్తులు ఈ యంత్రాన్ని ప్రధాన దేవతగా కొలుస్తారు. ఈ యంత్రాన్ని కళ్ళతో చూడరాదు, ఈ యంత్రాన్ని పూజించడానికి కళ్ళకి గంతలు కట్టుకొని పూజించాలి. మహాభారతంలోని ఒక కథ ఆధారంగా పాండవులు వనవాసం చేసేప్పుడు అంబాజీ మాతను కొలిచేవారని తెలియుచున్నది.

ప్రతి సంవత్సరం భాద్రపద పౌర్ణమి రోజున ఇక్కడ ఒక పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఈ ఆలయానికి వెనుక మన్ సరోవర్ అనే చెరువు ఉంది. ఈ చెరువుకి రెండు ప్రక్కల రెండు దేవాలయాలు ఉన్నాయి. ఇలా శక్తిపీఠాలలో ఒకటిగా చెప్పే ఈ అంబాజీ మాత పీఠం దర్శించడానికి ఎప్పుడు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Exit mobile version