Home Unknown facts శివయ్యకు నాన్ వెజ్ నైవేద్యంగా పెట్టె ఆలయం

శివయ్యకు నాన్ వెజ్ నైవేద్యంగా పెట్టె ఆలయం

0

ఆధ్యాత్మికతకు ఆలవాలం భారతదేశం అంటారు. 64 కోట్ల దేవతలను కలిగిన ఈ పవిత్ర భూమిలో ఎన్నో విశిష్టతలు, ఎన్నో ప్రత్యేకతలు. ఇక్కడ అడుగడుగునా దేవాలయాలు మనం చూడవచ్చు. కానీ విచిత్రమైన పద్ధతులు కలిగిన అసాధారణ దేవాలయాలు కొన్ని మాత్రమే చూడగలం. ఈ దేవాలయాల్లో ఉండే నమ్మశక్యం కాని నిజాలు వీటిని ప్రత్యేకంగా నిలిపాయి. అలాంటిదే ఇప్పుడు మనం తెలుసుకోబోయే శివాలయం. దేవుళ్ళకి కొంతమంది పళ్ళు, కొంతమంది కాయలు, ఇంకొంతమంది స్వీట్స్, తినుబండారాలు ఇలా చాలామంది వాళ్ళ యొక్క ప్రాంతాల్లో, వాళ్ళ యొక్క పద్ధతుల్లో దేవుడికి నైవేద్యంగా ఎన్నో రకాల తినుబండారాలు ప్రసాదంగా సమర్పిస్తూ వుంటారు.

Gumpa Sangameshwara Swamyభక్తితో భక్తులు ఎటువంటి నైవేద్యం సమర్పించినా భగవంతుడు స్వీకరిస్తాడు. అందులోనూ బోళా శంకరుడు భక్తులకు, భక్తికి లొంగుతాడు. పురాణ కథల్లో శ్రీకాళహస్తిలో భక్తకన్నప్ప అనే మహాభక్తుడు శివుడికి ఆ రోజుల్లో అడవిలో దొరికే జంతువు యొక్క మాంసాన్ని ప్రసాదంగా సమర్పించేవాడట. దాని గురించి వింటేనే మనకు అదోలా వుంటుంది. దేవుడికేంటి?మాంసం సమర్పించటం ఏంటని? కానీ దేవునికి భక్తితో సమర్పించేది ఏదైనా ప్రసాదంగా ఇవ్వొచ్చంట. కానీ ఆ రోజుల్లో అంత భక్తుడైన భక్త కన్నప్ప యొక్క మాంసాన్ని ప్రసాదంగా సమర్పించాడని వింటే మనం ఎంతో ఆశ్చర్యానికి గురవుతాం.

ఈ రోజుల్లో కూడా విజయనగరం జిల్లా కొమరాడు మండలం గుంప సంగమేశ్వర ఆలయంలో ఆ వూరి ప్రజలు శివరాత్రిరోజున జాతర నిర్వహిస్తారు. శివరాత్రిరోజున జాతర నిర్వహించటం మామూలే. కానీ ఇక్కడ గుంప సంగమేశ్వర ఆలయంలో కొలువైన ఈశ్వరుడిని మాత్రం అక్కడ చేపల్ని కూరగా వండి నైవేద్యంగా, ప్రసాదంగా సమర్పిస్తారట.ఇది అక్కడ విశేషం. ఆ వూరిలో గుంప సంగమేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది.

ఆ దేవాలయంలో శివునికి ప్రతీ సంవత్సరం నిష్టగా మూడు రోజుల పాటు శివరాత్రి ఉత్సవాలు జరుపుతారు. అక్కడ ప్రసాదంగా రకరకాల పండ్లు, పువ్వులు ప్రసాదాలతో పాటు చేపలకూర కమ్మగా వండి శివునికి నైవేద్యంగా పెడతారట. ఈ ఆచారం ఇప్పటిది కాదు అంటున్నారు అక్కడి వారు. కొన్ని దశాబ్దాలుగా ప్రజలు ఈ విధంగానే ఈ పద్ధతిని పాటిస్తున్నారట.

ఈ విధంగా చేపల్ని కూరగా వుండి శివునికి ప్రసాదంగా సమర్పించటం వల్ల వారిలో చాలామందికి వారు కోరుకునే కోరికలు నెరవేరాయని అక్కడ ప్రజలు చాలామంది ఇప్పటికీ చెపుతూనే వున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఆ వూరి ప్రజలు తమ పూర్వీకుల నుండి వస్తున్నా ఈ ఆచారాన్ని ఇప్పటికి కూడా తూచ తప్పకుండా పాటిస్తునే వున్నారు.

Exit mobile version