Home Unknown facts కర్ణుడు మరణించడానికి పరశురాముడు శాపమే కారణమా ?

కర్ణుడు మరణించడానికి పరశురాముడు శాపమే కారణమా ?

0

భృగువంశంలో రుచీకుడనే మునికుమారుడు తన తపశ్శక్తితో వెయ్యి విచిత్ర గుర్రాల్ని వరుణదేవుడి నుంచి పొందాడు. వాటిని గాది రాజుకు సమర్పించి ఆయన కుమార్తె సత్యవతిని వివాహమాడాడు. సత్యవతి తనకు బ్రహ్మతేజస్సు కలిగిన సంతానం కావాలని భర్తను కోరింది. అలాగే పుత్ర సంతానం లేని తన తల్లిదండ్రులకు క్షత్రియ తేజస్సు కలిగిన పుత్రుణ్ని కూడా ప్రసాదించమని వేడుకుంది.

పరశురాముడురుచీకుడు యజ్ఞం చేసి బ్రహ్మ, క్షత్రియ తేజస్సులు కలిగిన రెండు ప్రసాదాల్ని భార్యకిచ్చాడు. అవి తారుమారయ్యాయి. సత్యవతి రుచీకుణ్ని వేడుకోగా, యజ్ఞ ప్రసాదానికి తన తపశ్శక్తి కూడా తోడైన కారణంగా ఆమె తల్లికి క్షత్రియ తేజస్సు కలిగిన పిల్లాడే పుట్టి కాలక్రమంలో బ్రహ్మ తేజస్సు కలిగిన వాడిగా మారతాడని చెబుతాడు. అలాగే సత్యవతికి బ్రహ్మతేజస్సు కలిగినవాడు జన్మించి కాలక్రమంలో ఉగ్రస్వభావం కలిగి ఉంటాడని అంటాడు. సత్యవతి తీవ్ర దుఃఖంతో అర్థిస్తుంది. ఆ ఉగ్రస్వభావం పుత్రుడికి కాకుండా మనవడికి వచ్చేట్లు దీవిస్తాడు. అలా సత్యవతికి జమదగ్ని జన్మిస్తాడు. జమదగ్ని, రేణుకలకు వైశాఖ శుక్లపక్ష తదియనాడు విష్ణ్వంశతో జన్మించిన కుమారుడే పరశురాముడని స్కాందపురాణం పేర్కొంటుంది.

పరశురాముడు.. విష్ణుమూర్తి దశావతారములలో ఆరవ అవతారం. వైశాఖ శుద్ద తదియ రోజున పరశురాముడు జన్మించాడని స్కాంద, బ్రహ్మండ పురాణాలు చెబుతున్నాయి. క్షత్రియుల నుంచి ప్రజలను రక్షించడానికి పరశురాముడు అవతరించాడని విశ్వాసిస్తుంటారు. అలాగే పరశురాముడి జయంతి కూడా త్రేతాయుగ ప్రారంభరోజే అని నమ్ముతుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం పరశురాముడి జయంతి వైశాఖ మాసంలో వస్తుంది. శుక్ల పక్షం మూడవ రోజున జయంతి జరుపుకుంటారు.

హరి వంశ పురాణం ప్రకారం, కర్తా విర్య అర్జునుడు రాజు, అతను మహిష్మతి నగరాన్ని పరిపాలించాడు. అతను మరియు ఇతర క్షత్రియులు అనేక విధ్వంసక పనులలో పాల్గొన్నారు. దీంతో చాలా మంది అనేక కష్టాలు పడ్డారు. దీంతో బాధపడిన భూమి క్షత్రియుల క్రూరత్వం నుండి భూమిని, జీవులను కాపాడడానికి విష్ణువు సహాయం కోరింది. అప్పుడు ఆ దేవికి సహాయం చేసేందుకు విష్ణువు పరశురాముని పేరుతో రేణుక, జమదగ్ని దంపతులకు కుమారుడిగా జన్మించాడు. అతనే అర్జునుడిని మరియు క్షత్రియులను వధించి భూమిని, ఇతర ప్రజలను వారి క్రూరత్వం నుండి కాపాడాడు.

పరశురాముడనే పేరుకు ‘పరశు’ అనబడే గొడ్డలిని కలిగి ఉన్న రాముడు అని అర్థం. పరశురాముడి ఆయుధం గొడ్డలి. పరమశివుడు పరశురాముడికి గొడ్డలిని అందిస్తాడు. పరశురాముడి ఘోర తపస్సుకు మెచ్చి మహాశివుడు పరశురాముడికి గొడ్డలిని కానుకగా ఇస్తాడు. క్రూరమైన క్షత్రియుల నుంచి 21 సార్లు భూమికి విముక్తిని ప్రసాదించాడు పరశురాముడు. ఆ తరువాత కశ్యప మహర్షి సహకారంతో యజ్ఞాలను నిర్వహించి భూమిని పొందాడు. అయితే, భూమిని పరిపాలించేందుకు పరశురాముడు ఇష్టపడలేదు. అందువల్ల భూమిని కశ్యప మహర్షికి ఇచ్చేస్తాడు పరశురాముడు.

పరశురాముడి తండ్రి ఆశ్రమం వద్ద నుంచి పవిత్రమైన దూడను కార్తవీర్య అనబడే రాజు దొంగిలించినప్పుడు పరశురాముడిలో వినాశన ధోరణి మొదలైంది. ఆ దూడను రక్షించాలనుకున్న పరశురాముడు కార్తవీర్యుడితో పోరాడి అతడిని అంతమొందిస్తాడు. కార్తవీర్యుడి కుమారుడు తన తండ్రి మరణానికి కారణమైన వారిపై పగ తీర్చుకోవాలని భావిస్తాడు. అందువలన జమదగ్ని మహర్షిని వధిస్తాడు. దీంతో పరశురాముడు తీవ్రంగా కలత చెందుతాడు. అనంతరం క్షత్రియులను అంతమొందిస్తాడు.

పరశురాముడి తల్లి తన భర్త పట్ల భక్తిశ్రద్ధలతో వ్యవహరిస్తూ ఉండేది. ఆవిడ వ్యక్తిత్వం వల్ల నీళ్లను బిందె లేకుండా కూడా ఆమె తీసుకురాగలిగే శక్తిని పొందింది. ఒకరోజు, ఆవిడ నదీ తీరం వద్ద గంధర్వుడిని చూడటం జరుగుతుంది. అప్పుడు, ఆమె మనసులో క్షణకాలం పాటు కోరిక కలుతుంది. అయితే అదే సమయంలో జమదగ్ని మహర్షి తన యోగిక శక్తులతో జరిగిన విషయాన్ని గ్రహిస్తాడు. ఆ కోపంలో, తన పుత్రులందరినీ వారి తల్లిని చంపమని ఆజ్ఞాపిస్తాడు. వారందరు నిరాకరిస్తారు. అప్పుడు, వాళ్లందరినీ రాయిగా మారిపోమని జమదగ్ని శపిస్తాడు. పరశురాముడు తండ్రి మాటను జవదాటని వాడు. వెంటనే తన గొడ్డలిని తీసుకుని తల్లి తలను నరికివేస్తాడు. అతని వినయానికి మహర్షి కదిలిపోయాడు. ఏదైనా వరాన్ని కోరుకోమని తన కుమారుడిని అడుగుతాడు జమదగ్ని. తన తల్లికి తిరిగి ప్రాణం పోయామని పరశురాముడు వేడుకుంటాడు. అలాగే, తన సోదరులను కూడా తిరిగి మాములుగా మార్చమని వేడుకుంటాడు. కుమారుడి కోరికను మన్నిస్తాడు జమదగ్ని మహర్షి.

పరమశివుడికి పరశురాముడు గొప్ప భక్తుడు. అయితే, తానెంతో భక్తి శ్రద్ధలతో పూజించే పరమేశ్వరుడితోనే పరశురాముడు పోరాడవలసి వచ్చింది. పరమశివుడు తన భక్తుడిని పరీక్షించడం వల్లే ఇలా జరిగింది. ఈ పవిత్ర యుద్ధమనేది భయంకరంగా సాగింది. చివరలో, పరశురాముడు తన గొడ్డలితో వేగంగా దాడి చేయగా పరమశివుడి నుదుటిపై గొడ్డలి ఇరుక్కుంటుంది. పరశురాముడి నైపుణ్యాన్ని గ్రహించిన పరమశివుడు ప్రేమతో పరశురాముడిని హత్తుకుంటాడు. ఈ సంఘటనతో పరమశివుడి పేరు ఖండ పరశుగా మారింది.

కుంతీపుత్రుడైన కర్ణుడు పరశురాముడి చేత విద్యను అభ్యసించాలని కోరుకుంటాడు. అయితే, క్షత్రియులకు విద్యను నేర్పకూడదని పరశురాముడు నిర్ణయించుకుంటాడు. అప్పుడు, కర్ణుడు తనను బ్రాహ్మణుడిగా పరిచయం చేసుకుంటాడు. తాను క్షత్రియుడిని కానని పరశురాముడితో చెప్తాడు. కొంతకాలం తరువాత నిజం తెలుసుకున్న పరశురాముడు కోపంతో ఊగిపోతాడు. కర్ణుడు నేర్చుకున్న విద్యలేవీ అవసరానికి ఉపయోగపడవని అబద్దం చెప్పి నేర్చుకున్న విద్యలు అక్కరకు రావని పరశురాముడు శపిస్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు మరణించడానికి ఈ శాపమే కారణమైందని పురాణాలు చెబుతున్నాయి.

 

Exit mobile version