Home Health కరోనాని ఎదుర్కోవడానికి విటమిన్ సీ తో పాటు జింక్ కూడా ముఖ్యం!

కరోనాని ఎదుర్కోవడానికి విటమిన్ సీ తో పాటు జింక్ కూడా ముఖ్యం!

0

మన చుట్టూ విష వలయం ఆవరించింది. తప్పించుకునే దారి లేదు. ఎదుర్కోవడమే మన ముందున్న మార్గం. కరోనా మహమ్మారిని జయించడానికి శరీరాన్ని ఓ ఆయుధంగా మార్చుకోవాలి. దాన్ని శక్తి సంపన్నం చేసుకోవాలి. అందుకే మంచి ఆహారమే మార్గం మందులతో పనిలేకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలని చాలా మంది కోరుకుంటున్నారు. తద్వారా కరోనా సహా వెయ్యికి పైగా రకాల వైరస్‌లను ఎదుర్కోవాలనుకుంటున్నారు. ఇండియాలో ఆల్రెడీ సెకండ్ వేవ్ ఉంది. నవంబర్‌లో థర్డ్ వేవ్ వస్తుంది అంటున్నారు. అందువల్ల మనం సరైన ఆహారం తినాలి. మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటే… ఇక మందులతో పని ఉండదు.

Best Foods That Are High in Zincమన శరీరానికి విటమిన్ సీ బాగా అందితే అది కణాలకు బలం ఇస్తుంది. అప్పుడు వైరస్‌ కణం దగ్గరకు వచ్చినప్పుడు కణం దానికి లొంగదు. కణం లొంగకపోతే వైరస్ ఓడిపోతుంది. చనిపోతుంది. కాబట్టే మనం సీ విటమిన్ ఉండే ఆహారం ఎక్కువ తీసుకుంటున్నాం. ఇదే పనిని జింక్ కూడా చేస్తుంది. ఇలాంటి వైరస్‌లు వచ్చినప్పుడు వాటిని చచ్చిపోయేలా చెయ్యడంలో జింక్ కీలక పాత్ర పోషిస్తుంది. జింక్ కోసం మనం జింక్ టాబ్లెట్లు వాడుతుంటాం. ఈ టాబ్లెట్ల వల్ల సైడ్ ఎఫెక్టులు ఉంటాయి. వాటి బదులు జింక్ ఉండే ఆహారం తినడం వల్ల నేచురల్ గా శరీరానికి అందుతుంది. జిక్… మన చర్మం, పాంక్రియాస్, లివర్, కిడ్నీలకు మేలు చేస్తుంది. అయితే జింక్ మూలకం ఎక్కువగా ఉండే ఆహారం ఏమిటో చూద్దాం…

గుడ్డులోని పచ్చసొన:

ముందు డాక్టర్లు గుడ్డులోని పచ్చసొనను తినకూడదనేవారు. ఎందుకంటే అందులో కొలెస్ట్రాల్ శాతం అధికమని. అయితే పచ్చసొనలో ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో ఎక్కువగా జింక్ ఉంటుంది.

బీఫ్ లివర్:

మాంసాహారంలో ఏ లివర్ అయినా సరే అధిక శాతంలో జింక్ లభ్యం అవుతుంది. న్యూట్రీషియన్స్, ఐరన్, కూడా పుష్కలంగా దొరుకుతుంది. ముఖ్యంగా బీఫ్ లివర్ లో ఎక్కువగా లభిస్తుంది.

శనగలు:

శనగల్ని మన దేశంలో బాగానే వాడుతారు. జింక్ కావాలి అనుకునేవారు శనగలు తప్పక తీసుకోవాలి. శనగల్లో జింక్‌తోపాటూ ఐరన్, సోడియం, సెలెనియం, మాంగనీస్, రాగి ఉంటాయి. ఓ కప్పు ఉడికించిన శనగల్లో ఫైబర్, ప్రోటన్, 2.5 మిల్లీగ్రాముల జింక్ ఉంటుంది.

తృణ ధాన్యాలు :

గింజల్లో కూడా జింక్ బాగా ఉంటుంది. పైగా వీటిలో ఫ్యాట్ తక్కువ. ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ. కప్పు గింజల్లో 4.7 మిల్లీ గ్రాముల జింక్ ఉంటుంది. మీరు వండే వంటల్లో ఇలాంటివి వీలైనంత ఎక్కువగా వేసుకోండి.

గుమ్మడికాయ గింజలు:

గుమ్మడికాయ గింజల్లో కూడా జింక్ ఉంటుంది. 28 గ్రాముల గుమ్మడికాయ గింజల్లో 2.2 మిల్లీ గ్రాముల జింక్ ఉంటుంది. అలాగే ప్రోటీన్స్ 8.5 మిల్లీగ్రాములు ఉంటాయి. గుమ్మడికాయ గింజల్ని తరచూ తింటూ ఉంటే… కేన్సర్ తగ్గే అవకాశాలు ఉంటాయని పరిశోధన తెలిపింది. జింక్ లోపం ఉన్నవారు… రోజూ గుప్పెడు గుమ్మడికాయ గింజలు తినాలి.

ఓట్స్:

ఈ రోజుల్లో ఓట్స్ చాలా మంది వాడుతున్నారు. వీటిని వండుకోవడం చాలా తేలిక. వీటిలో జింక్, ఫైబర్, ఫోలేట్, విటమిన్ B6, బీటా గ్లూకాన్ వంటి పోషకాలు ఉంటాయి. కప్పు ఓట్స్‌లో 1.3 మిల్లీ గ్రాముల జింక్ ఉంటుంది.

పెరుగు:

ఫ్యాట్ ఎక్కువగా లేని పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మన పొట్టలో చేరి… కావాల్సినంత జింక్ అందిస్తుంది. ఓ కప్పు పెరుగులో 1.5 మిల్లీ గ్రాముల జింక్ ఉంటుంది.

పుచ్చకాయ గింజలు:

పుచ్చకాయ గింజల్లో పోషకాలు, జింక్, మాక్రోన్యూట్రియంట్స్ ఎక్కువ. కొన్ని గింజలు తిన్నా చాలు 4 మిల్లీగ్రాముల జింక్ లభిస్తుంది. మీరు వాటిని ఎండబెట్టి… రోజూ స్నాక్స్‌లా తినవచ్చు. పుచ్చకాయ గింజలు వ్యాధినిరోధక శక్తిని కూడా పెంచుతాయి. గుండెను కాపాడతాయి.

డార్క్ చాక్లెట్ :

మీరు 100 గ్రాముల డార్క్ చాకొలెట్ తింటే… మీకు 3.3 మిల్లీగ్రాముల జింక్ లభిస్తుంది. ఐతే… డార్క్ చాకొలెట్‌లో క్యాలరీలు ఎక్కువ, షుగర్ కూడా ఎక్కువే. ఇందుకోసం అంతగా స్వీట్ లేని డార్క్ చాకొలెట్ ఎంచుకుంటే మంచిది.

బీన్స్:

కిడ్నీ ఆకారంలో ఉండే బీన్స్, బ్లాక్ బీన్స్‌లో జింక్ ఎక్కువే. కరిగిపోయే, కరగని ఫైబర్, ప్రోటీన్స్, ఐరన్, పాస్పరస్, కాల్షియం వంటివి ఇందులో ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఓ కప్పు వండిన బీన్స్‌లో 0.9 మిల్లీగ్రాముల జింక్ ఉంటుంది.

 

Exit mobile version