Home Health పంచదార కంటే బెల్లమే మన ఆరోగ్యానికి మంచిదా ?

పంచదార కంటే బెల్లమే మన ఆరోగ్యానికి మంచిదా ?

0

ప్రస్తుత రోజుల్లో తీపి కోసం చక్కెరనే ఎక్కువగా వాడుతున్నాం. ఎప్పుడో స్వీట్లలో తప్పితే దాదాపుగా బెల్లం వాడటమే మానేశాం. నిజానికి పంచదార కంటే బెల్లమే మన ఆరోగ్యానికి మంచిది. అందుకు చాలా కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Is Ginger Better Than Sugarబెల్లంలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. దీని వల్ల మన శరీరంలోకి అధికంగా క్యాలరీలు చేరుతాయన్న బెంగ, అధిక బరువు పెరుగుతామన్న భయం ఉండవు. రోజూ బెల్లం తింటే లివర్‌లో ఉండే హానికర వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. లివర్ శుభ్రంగా ఉంటుంది. కాలేయ సంబంధ అనారోగ్యాలు రాకుండా ఉంటాయి.

రోజూ రాత్రి పూట భోజనం చేశాక ఒక చిన్న బెల్లం ముక్కను తింటే మనకు చాలా లాభాలు కలుగుతాయి. జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. బెల్లంలో ఉండే ఔషధ గుణాలు జీర్ణాశయంలోని డైజెస్టివ్ ఎంజైమ్‌లను యాక్టివేట్ చేస్తాయి. మలబద్దకం, గ్యాస్, ఏసీడీటీ సమస్యలు కూడా ఉండవు. శ్వాసనాళాలు, రక్తనాళాలు శుద్దిపడాలంటే కూడా బెల్లం ఖచ్చితంగా తినాలి. రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది. దగ్గు, జలుబును కూడా బెల్లం సులభంగా దూరం చేయగలదు.

టీ, కాఫీలలో చక్కెర వేసుకోవడం కంటే బెల్లం ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది అంటున్నారు వైద్య నిపుణులు. స్వీట్లు కూడా బెల్లంతో తయారు చేసుకోవడమే ఉత్తమమని చెబుతున్నారు. అందరికీ బెల్లం ఇష్టం ఉండకపోవచ్చు కానీ దాని వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

ఎక్కువగా తిని ఇబ్బంది పడుతున్న సమయంలో బెల్లం ముక్కను నోట్లో వేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఐరన్ లోపం ఉన్న వాళ్లు బెల్లం తింటే మంచిది. రక్తాన్ని ఉత్పత్తి చేయడంలో ఇది ఎంతగానో తోడ్పడుతుంది. బెల్లం తింటే ముఖంపై మచ్చలు, మొటిమలు కూడా తగ్గుతాయి. చర్మానికి మంచి నిగారింపు వస్తుంది. రుతుక్రమ సమస్యలతో బాధపడే మహిళలకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.

అదేసమయంలో చక్కెర తింటే అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. కానీ బెల్లం వల్ల దుష్ప్రభావాలు ఉండవు. శరీరంలోని మలినాలను బయటకు వెళ్లేలా చేసే శక్తి బెల్లానికి ఉంది. ఆర్గానిక్ బెల్లం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. బెల్లంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.

 

Exit mobile version