Home Health పిల్లలకు పాలపొడితో చేసిన పాలు తాగించవచ్చా ?

పిల్లలకు పాలపొడితో చేసిన పాలు తాగించవచ్చా ?

0

పాలు ఇష్టపడని చాలా మంది… పాల పొడి అంటే ఇష్టపడతారు. హఠాత్తుగా ఏదైనా తియ్యగా తినాలనిపిస్తే అందుబాటులో ఉండేది పాల పొడే. వీటన్నింటికంటే ముఖ్యం అర్జెంట్‌గా పాలు కావాలంటే క్షణాల్లో పాల పొడితో ట్రై చేస్తాం.వేడి నీటిలో ఒక చెంచా పాల పొడి వేసుకుంటే పాలు రెడీ అయినట్లే.

Baby Powderపాలూ, పాల పొడిలో కూడా పోషాకాలు సమానంగా ఉంటాయి. అయితే, పాల పొడి కంటే పాలు ఎక్కువ రుచిగా ఉంటాయి. అంతే కాకుండా పాలలో ఫాస్ఫరస్, సెలీనియం, బీ-కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి. పాల పొడినే వాడాలనుకుంటే ఇవన్నీ అందులో సెలెక్ట్ చేసుకున్న బ్రాండ్‌లో ఉన్నాయో లేదో చూసి తీసుకోవాలి.

పాలలో 87.3% నీళ్ళూ, 3.9% మిల్క్ ఫ్యాట్స్, 8.8% ఫ్యాట్ లేని మిల్క్ సాలిడ్స్ ఉంటాయి. ఇక పాలపొడి తయారు చేసే సమయంలో పాలు వేడి చేసి అందులో నీటిని మొత్తం ఆవిరి చేస్తారు. ఇలా ప్రాసెస్ చేసి ఆ పాలపొడి తయారు చేస్తారు. మినరల్స్, విటమిన్స్ మెగ్నీషియం, కాల్షియం, జింక్, పొటాషియం, విటమిన్స్ ఏ, డీ, ఈ, కే ఈ ఈ పాలపొడిలో ఉంటాయి.

పాల పొడి ప్యాకెట్స్ వెనుక ఎంత పొడికి ఎన్ని నీళ్ళు కలపాలి అని రాసే ఉంటుంది. అన్ని మాత్రమే కలపాలి. అప్పుడే పోషకాలు అందుతాయి. ఎక్కువగా నీటిని కలపడం వల్ల అందాల్సిన పోషకాలు అందవు. అలాంటి పరిస్థితుల్లో పాలకి ప్రత్యామ్నాయంగా కాకుండా అవసరమైనప్పుడు వాడుకునేందుకు పాల పొడిని అందుబాటులో పెట్టుకోవచ్చు.

 

Exit mobile version