Home Health పండ్లపై ఉప్పు చల్లుకోవడం ఆరోగ్యానికి లాభమా నష్టమా?

పండ్లపై ఉప్పు చల్లుకోవడం ఆరోగ్యానికి లాభమా నష్టమా?

0

అరోగ్యంగా ఉండడానికి పండ్లు, కూరగాయలు తినడం మంచిదని అందరికి తెలిసిందే… వాటితో అరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ప్రతీవారు తమ స్తోమతను బట్టి, అందుబాటులో ఉన్న పండ్లను కొనుక్కుని తింటుంటారు. అయితే పండ్లు తినేప్పుడు సాధారణంగా చాలామంది కట్ చేసి ఉప్పు చల్లుకుని తింటారు. ఎక్కువగా పుచ్చకాయ, జామకాయ విషయంలో ఇలా చేస్తుంటారు.

Health Tips In teluguఇక ఉసిరికాయ, మామిడి కాయల లాంటి పుల్లగా ఉండేవాటికి కాస్త ఉప్పు, కారం చల్లుకొని తినడం మనకు అలవాటు. అయితే కొందరు అన్నిరకాల పండ్లను అలాగే తింటారు…అలా పండ్లు కోసుకుని తినేటప్పుడు వాటి మీద కాస్తంత సన్న ఉప్పు చల్లుకుంటే రుచి పెరుగుతుంది. అంతేకాదు దానివల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. అలాగే నష్టాలు కూడా ఉన్నాయి అవేంటంటే..?

పండ్లపై ఉప్పు చల్లుకుని తినడం వల్ల పండ్ల రుచి పెరగడమే కాదు పండ్లపై ఉండే బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. అలా అని అన్ని పండ్లముక్కల మీద ఉప్పు చల్లుకుని తినడం కరెక్ట్ కాదు. పండ్లముక్కలపై ఉప్పు చల్లడం వల్ల బ్యాక్టీరియాను నాశనం చేయొచ్చు. సిట్రస్ జాతి పండ్ల మీద ఉప్పు చల్లుకుని తింటే కడుపులో ఉత్పత్తి అయ్యే ఆమ్లాలను నిరోధించవచ్చు. దీంతో అజీర్తి సమస్యలకు చెక్ పెట్టినట్టవతుంది. జామకాయ మీద ఉప్పు చల్లుకుని తింటే దంతాలకు ఎంతో మేలు జరుగుతుంది. నోటిలోని బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మంచిది కాదు. ఉప్పు ఎక్కువగా చల్లుకుంటే గుండెజబ్బులు, కిడ్నీ వ్యాధులు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మనలో చాలా మంది మన శరీరానికి కావాల్సిన దాని కంటే ఎక్కువగానే సాల్ట్ తీసుకుంటున్నారు. అందువల్ల పండ్ల వంటివి తినేటప్పుడైనా ఈ సాల్ట్ వాడకాన్ని మానేయమంటున్నారు నిపుణులు. ఫ్రెష్ పండ్లు చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి, వాటిని అలాగే తినేయమంటున్నారు. మన బాడీకి ఉప్పు అవసరమే… కానీ అతి తక్కువ మాత్రమే కావాలి. కాబట్టి… ఎప్పుడో తప్పితే… రోజూ పండ్లపై ఉప్పు వేసుకోవద్దని సూచిస్తున్నారు.

 

Exit mobile version