జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉంగరం ఏ వేలికి ధరించినవారు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటారు?

0
1219

రింగ్స్ ధరించడం నేటి యువతకు ఒక ఫ్యాషన్ బంగారం ,వెండి మాత్రమే కాకుండా రకరకాల రింగ్స్ ధరిస్తున్నారు. వేసుకున్న డ్రెస్ లకి మ్యాచ్ అయ్యే విధంగా ధరించడం కొందరికి ఇష్టం అలాగే నచ్చిన వెలికి కూడా ధరిస్తారు. అదేవిధంగా కొందరు కలర్ స్టోన్ ఉండే రింగ్స్ పెట్టుకుంటారు. కలర్ స్టోన్ ఉన్న రింగ్ ని ధరించడం అనేది ఒక ఫ్యాషన్ మాత్రమే కాదు అంతకు మించి.. ఉంగరం పెట్టుకునే ఒక్కొక్క వేలికి, ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది.

jaatakachakra ungaraamజ్యోతిష్యం ప్రకారం, ఉంగరం వేలికి రింగ్ ని పెట్టుకోవడం గల స్పెషాలిటీ మాత్రమే మనకి తెలుసు. అలాగే మిగతా వేలికి రింగ్స్ ను పెట్టుకోవడం లో గల ప్రత్యేకత ని తెలుసుకుందాం.

చూపుడు వేలు :

లీడర్ షిప్, అధికారం, సెల్ఫ్ రెస్పెక్ట్ కి ఇది సంకేతం. కుడి చేతి – చూపుడు వేలికి పెట్టుకోవడం వల్ల ఆత్మ గౌరవానికి, లీడర్ షిప్ కి, కాన్ఫిడెన్స్ లను తెలియజేస్తుంది. అదే ఎడమచేతికి అయితే ఇతరుల లీడర్ షిప్ ని ఎక్సెప్ట్ చేసినట్లుగా సంకేతం.

మధ్య వేలు :

అందం, భాద్యత, సెల్ఫ్ అనాలసిస్ కి సంకేతం. ఈ వేలికి రింగ్ పెట్టుకోవడం చాలా అరుదు. ఏ విషయానైన “బాగా అర్థం చేసుకునే” వారిగా వీరు ఉంటారు. ఈ వేలికి రింగ్ పెట్టుకునే వారు చాలా సింబలైజ్డ్ గా ఉంటారు.

jaatakachakra ungaraam
ఉంగరం వేలు :

ఇది బ్యూటీ కి, క్రియేటివిటీ కి, వేరొకరితో రిలేషన్ షిప్ లో ఉండటం గురించి తెలియజేస్తుంది. వాటితో పాటు ఇతరులతో గల రొమాంటిక్ రిలేషన్స్ కి ఇది సంకేతం. ప్రపంచంలో ఎక్కువ మంది ఈ వేలికి రింగ్ పెట్టుకోవడం చాలా కామన్. వెడ్డింగ్ రింగ్ ని పెట్టుకునేది ఈ వేలికే.

jaatakachakra ungaraamచిటికిన వేలు :

సిట్యువేషన్స్ ని బాగా అర్థం చేసుకునే వారిగా, కమ్యూనికేషన్ కలిగిన & తెలివైన వారిగా వీరు ఉంటారు. ప్రపంచంలో ఎక్కువగా ఫాలో అవుతున్న ఆచారాలకి, మతాలకి సంబంధించిన వాటికి దూరంగా ఉంటారు. వీరు కొంచెం బడాయి గా ఉంటు, ఇతరులను కాంప్రమైజ్ చేసే వారిగా ఉంటారు.

jaatakachakra ungaraamబ్రోటన వేలు :

వారిలో ఉన్న ఫీలింగ్స్ ని ఓపెన్ గా చెప్పేస్తారు. కుడిచేతికి ధరించిన వారైతే – వాళ్ళ ఓపేనియన్ని ఒక్కొక్క సారి బయటకు చెప్పడానికి ఆలోచిస్తారు. ఎడమచేతి వారు లోలోపల భయపడుతూ ఉంటారు.