Home Health కీళ్ల నొప్పులను తగ్గించే జిల్లేడు మొక్క!

కీళ్ల నొప్పులను తగ్గించే జిల్లేడు మొక్క!

0

జిల్లేడు మొక్క గురించి దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. జిల్లేడు పూలు హనుమాన్ కి ప్రీతిపాత్రంగా చెబుతారు. అర్క పత్రిగా పిలిచే ఈ జిల్లేడు ఆకే వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు ఇరవయ్యవది. సాధారణంగా జిల్లేడులో రెండు రకాలు ఉంటాయి. వంగపూవు రంగు పూలు పూసే జిల్లేడు ఒకటి, తెల్ల పూల జిల్లేడు మరొకటి. ఇది హేరంబ గణపతికి ప్రతీక. తెల్ల జిల్లేడును శ్వేతార్కం అంటారు. వృక్షజాతిలో తెల్ల జిల్లేడు విశిష్టమైంది. ఇందులో విషం ఉంటుందని చాలామంది ఈ మొక్కలకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా జిల్లేడు పాలు కళ్ళలో పడితే చూపు పోతుందని భయపడతారు. గమ్మత్తేమిటంటే ఈ మొక్కలో ఉన్న విషంతో ఆయుర్వేదంలో దివ్యమైన ఔషధాలు తయారు చేస్తున్నారు.

jilledu plantతెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి, తులసి మొక్కలా ఇంట్లో నాటుతారు. ఈ మొక్క ఇంటిలో ఉంటే ధనధాన్యాలు పుష్కలంగా లభిస్తాయని, ఆలోచనల్లో పరిపక్వత వస్తుందని, ఎవరైనా హాని తలపెట్టినా అలాంటివి దుష్పభ్రావం చూపకుండా, వారి ప్రయోగాలే నశిస్తాయని ప్రతీతి. రాత్రి సమయంలో పీడకలలతో బాధపడేవారికి ఈ చెట్టు వేరుని తలకింద పెట్టుకుని పడుకుంటే పీడకలలు తగ్గుతాయి. శ్వేతార్క మూలాన్ని చిన్నదిగా తీసుకుని భుజం మీద లేదా కంఠంలో ధరించడం వల్ల ఆరోగ్య రక్ష కలుగుతుంది.

రధసప్తమి రోజు జిల్లేడు ఆకులు ధరించి స్నానమాచరిస్తే చాలా మంచిదనీ చెబుతారు. తెల్ల జిల్లేడు ఆకులు కీళ్ల నొప్పులకు, మధుమేహానికి కాకుండా విరేచనాలు, మలబద్ధకం, కడుపులో పూత, పంటి నొప్పి, తిమ్మిర్లు వంటి సమస్యలకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు కలబంద తీసుకొని శుభ్రంగా చెక్కు తీసుకొని లోపల ఉన్న గుజ్జుని మెత్తని గుజ్జులా తయారు చేసుకోవాలి. ఇప్పుడు కలబంద గుజ్జుకు చెంచా పసుపు కలిపి మెత్తని మిశ్రమంగా తయారు చేసుకోవాలి. తెల్లటి జిల్లేడు ఆకు తీసుకుని నువ్వుల నూనె రాసి వేడి చేయాలి. ముందుగా ఎక్కడైతే కీళ్లనొప్పులు ఉంటాయో, అక్కడ కలబంద గుజ్జు, పసుపు మిశ్రమం రాసి దానిపైన వేడిచేసిన జిల్లేడు ఆకులు ఊడిపోకుండా దారంతో కట్టాలి. ఇలా రాత్రల్లా కట్టుకొని ఉంచి ఉదయం తీసేయాలి. ఇలా ప్రతి నిత్యం చేయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. లేదా జిల్లేడు ఆకులను సేకరించి నీళ్ళు చేర్చకుండా ఉప్పు వేసినూరుకోవాలి. ఈ పేస్ట్ను కీళ్ళనొప్పులు ఉన్నచోట రాస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ ఆకులకు ఆముదం రాసి కీళ్ళనొప్పులు ఉన్నచోట కట్టినా కీళ్ళనొప్పులు తగ్గుతాయి. తెల్ల జిల్లేడు ఆకులతో ఇలా చేస్తే కీళ్ల నొప్పులు రమన్నా రావు.

మధుమేహంతో బాధపడేవారు తెల్ల జిల్లేడు ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని రాత్రి నిద్రించే ముందు అరికాళ్లకు కట్టుకోవాలి. జిల్లేడు ఆకు ఊడిపోకుండా దారంతో కట్టుకోవాలి. లేదంటే సాక్సులు వేసుకున్న మంచిదే. తెల్ల జిల్లేడు ఆకు మన ఎదురు కనిపించేలా కట్టుకోవాలి. జిల్లేడు ఆకులు కట్టుకుని రాత్రంతా నిద్రించి, ఉదయం లేచాక తీసేయాలి. ఇలా పదిహేను రోజుల పాటు చేశాక, షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. షుగర్ లెవెల్స్ కంట్రోల్ లోకి రావడం గమనించవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు ఎటువంటి చేదు పదార్థాలు తినకుండా, డైట్ ఫాలో అవ్వకుండా జిల్లేడు ఆకుతో సులువుగా డయాబెటిస్ ను అదుపులో పెట్టుకోవచ్చు. ఈ ఆకులను ఎండబెట్టి పొడి చేసి పుండ్లు, గాయాలపై రాస్తే త్వరగా తగ్గుముఖం పడతాయి. పేస్ట్ లా చేసి కూడా రాయొచ్చు.

సెగగడ్డలు, వేడికురుపులు తగ్గడానికి ఈ ఆకులకు పసుపు కలిపి నూరి రాయాలి. అరికాళ్ళకు, అరిచేతులకు బొబ్బలు వస్తే ఈ చెట్టు పాలు రాయడంవలన తగ్గిపోతాయి. జిల్లేడు పాలల్లో పసుపు కలిపి ముఖానికి రాస్తే ముఖంపై నల్లమచ్చలు పోతాయి. ముఖం కాంతివంతంగా అందంగా మారుతుంది. తెల్లజిల్లెడు వేరు బెరడును బోదకాలు చికిత్సలో వాడతారు. వేరు బెరడును నూరి కాలికి పట్టు వేస్తే ఎంతకాలంగా బాధపడుతున్న బోదకాలు కూడా తగ్గుతుంది.

జిల్లేడు పాలను తెగిన గాయాలపై రాస్తే రక్తస్రావం వెంటనే ఆగుతుంది. గజ్జల్లో బిల్లలు కడితే ఈ చెట్టు ఆకులకు ఆముదం రాసి వేడిచేసి కడితే బిల్లలు తగ్గుతాయి. ఈ చెట్టు బెరడును పొడి చేసి వాడితే ఆస్తమా, బోదకాలు, బ్రాంకైటీస్ చికిత్స కు వాడతారు. జిల్లేడు వేరుని కాల్చి పళ్ళు తోమడానికి వాడతారు. దీనివలన దంతసమస్యలు తగ్గిపోతాయి. పాముకాటు చికిత్స లో కూడా ఈ చెట్టుని ఉపయోగించేవారు. ఈ ఆకుల పేస్ట్ ని పాముకాటు పై రాసి కట్టుకడితే విషప్రభావం తగ్గుతుంది. జిల్లేడు వేరు, బెరడుని నూరి నీటిలో కలపాలి. తర్వాత వడకట్టి ఆ నీటిని కొద్దికొద్దిగా తాగిస్తే పామువిషం విరుగుతుంది. జిల్లేడు ఆకు పొగపీల్చినా ఉబ్బసం తగ్గుతుంది. అయితే జిల్లేడు ఆకుతో ఏ చికిత్స చేసినా ఆ పాలు కంట్లోపడకుండా జాగ్రత్త పడాలి.

Exit mobile version