Home Unknown facts సర్పరాజు, సూర్యుడు, చంద్రుడు శివుడిని ఎందుకు పూజించారు?

సర్పరాజు, సూర్యుడు, చంద్రుడు శివుడిని ఎందుకు పూజించారు?

0

రావణుడి కారణంగా వాసుకి అను సర్పరాజు, సూర్యుడు, చంద్రుడు ఈ ప్రాంతం నందు ఒక శివలింగాన్ని ప్రతిష్టించి పూజించారని స్థల పురాణం. మరి వారు ఎందుకు శివుడిని పూజించారు? ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Someswara Temple

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పచ్చిమగోదావరి జిల్లా, పెనుమంట్ర మండలం లో, తణుకు నుండి 11 కి.మీ. దూరంలో జుత్తిగ అనే ఈ గ్రామంలో శ్రీ ఉమవాసుకి రవి సోమేశ్వరం అను పురాతన దేవాలయం ఉంది. జుత్తిగ అను పిలువబడుతున్న ఈ ఊరును పూర్వం దుతికాపురము అని పిలిచేవారు.

విష్ణు స్వరూపుడైన వ్యాసమహర్షి వ్రాసిన వాయు పురాణంలో గోస్తనీనది మహత్యం, శ్రీ ఉమవాసుకి రవి సోమేశ్వర క్షేత్ర మహాత్య ప్రస్తవన కలదు. ఈ క్షేత్రం నందు ఉత్తరవాహినిగా ప్రవహించే గోస్తనీ నది తీరమున వాసుకి రవి సోములచే ఈ శివలింగం ప్రతిష్టించబడింది.

అయితే తేత్రాయుగమున రావణాసురుడు వాసుకి అను సర్పరాజును, సూర్యుడిని, చంద్రుడిని పరాభవించాడు. వాసుకి, కర్కోటకుడు, తక్షకుడు, ధనుంజయుడు అను సర్పములచే రావణుని రథమును లాగించారు. అయితే రావణ భటులచే పీడింపబడిన సూర్యచంద్రులు, వాసుకి మొదలగువారు గొస్తా నది తీరమున ఈ శివలింగం ప్రతిష్టించి పూజించారు. అందువలన ఈ లింగం వాసుకి రవి సోమేశ్వర లింగమని ప్రసిద్ధి చెందినది.

అయితే ఎంతో పురాతనమైన గోస్తనీ నది బస్తరు జిల్లా ధేను పర్వతం నందు జన్మించి నాలుగు పాయలై ఒక పాయ ధూతికాపురం మీదుగా ఉతరవాహినిగా ప్రవహించి కాశీపట్నం వద్ద సముద్ర సంగమం చేస్తుంది. ఈ పవిత్ర గొస్తానది తీరమున వెలసిన శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర క్షేత్రం భక్తజనులకు భక్తిని పంచుతూ కొంగుబంగారమై విరాజిల్లుతుంది.

ఇలా వెలసిన ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు పండుగ, పర్వదినాలలో విశేష పూజలు, ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.

Exit mobile version