ఐదు అడుగుల శేషశాయి పై పవళించి ఉన్న శ్రీ రంగనాథుడు

0
4753

శ్రీ రంగనాథస్వామి కొలువై ఉన్న ఈ ఆలయాన్ని దర్శిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. మరి రంగనాథుడు దట్టమైన అడవిలో కొలువై ఉన్న ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ranganathudiఆంధ్రప్రదేశ్ రాష్త్రం, అనంతపురం జిల్లా, తాడిపత్రి మండలానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఆలూరుకోన అని పిలువబడే దట్టమైన అడవులలో పర్వతముల మధ్య ఒక కొండపైన శ్రీ రంగనాథస్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయం చాలా పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది.

ranganathudiహరిహర బుక్కరాయల కాలంలో ఎర్రమ తిమ్మరాజు గారు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుయుచున్నది. ప్రధానాలయం మరియు మూడు అంతస్థుల గాలిగోపురం దక్షిణముఖంగా ఉన్నాయి. ఇక గర్భాలయం నందు ఐదు అడుగుల శేషశాయి పై శ్రీ రంగనాథుడు పవళించి ఉన్నాడు. స్వామివారి పాదాల చెంత శ్రీదేవి – భూదేవి ఆసీనులై ఉన్నారు. నైరుతి బాగాన పుట్టశిల వెలసివుంది. ఈ శిల స్వయంభూ శిలగా ప్రతీతి.

ranganathudiఅయితే పుట్టశిలగా, నిరాకారునిగా వెలసిన స్వామికి విశ్వామిత్ర మహర్షి ప్రాణప్రతిష్ట చేసినట్లు పురాణాలూ చెబుతున్నాయి. ఇక్కడ ఉన్న మరో విశేషం ఏంటంటే, ఈ ఆలయానికి కొంత దూరంలో రెండు కొండల మధ్య నీరు ఎప్పుడు ఊరుతూ ఉత్తర – దక్షిణములుగా ప్రవహించును. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఇక్కడ మొదట స్నానం ఆచరించి ఆ తరువాత స్వామి దర్శనానికి వెళ్లడం ఒక ఆచారంగా వస్తుంది.

ranganathudiఈ స్వామి వారి కొండపైనే ఒక దర్గా కూడా ఉంది. ఇలా స్వామివారి కొండపైన ఉన్నా ఈ దర్గాని హిందువులు కూడా దర్శిస్తారు. ఇక ఇక్కడ కొలువై ఉన్న ఈ రంగనాథస్వామికి నిత్య పూజలతో పాటు చైత్రశుద్ద నవమి నుంచి బహుళ విదియ వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి.

ranganathudi