Home Unknown facts ఈ పూజారి భక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే!!!

ఈ పూజారి భక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే!!!

0

శరన్నవరాత్రులు, విజయదశమి దేశవ్యాప్తంగా అందరు హిందువులు అంగరంగ వైభవంగా నిర్వహించుకునే పండుగ. ఈ రోజుల్లో ముఖ్యంగా అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు. నవరాత్రుల్లో, నవదుర్గలు మనకు అంగరంగ వైభవంగా దర్శనమిస్తాయి.

templeఅమ్మవారి ఆలయాలను అందంగా అలంకరించి..ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఒక్కోరోజు ఒక్కో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటోంది.

కరోనా నియమ నిబంధనల మధ్య అమ్మవారి దర్శనానికి అనుమతినిస్తున్నారు. ఆలయాల్లోనే కాకుండా..రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో మంటపాలను ఏర్పాటు చేసి అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టింప చేస్తున్నారు. మంటపాలను విద్యుత్ దీపాలతో అలంకరించి…పూజలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాలన్నీ భక్తిభావంతో వెల్లివిరుస్తున్నాయి. అయితే..కొంతమంది అమ్మవారికి వినూత్నంగా పూజలు నిర్వహిస్తూ…భక్తి ప్రవత్తులను చాటుకుంటున్నారు.

ఓ పూజారి మాత్రం దుర్గాదేవికి చేస్తున్న పూజ అందర్నీ ఆకట్టుకొంటోంది. ఇతనిని చూడడటానికి చాలా మంది ఆలయానికి పోటెత్తుతున్నారు. బీహార్ రాజధాని పాట్నాలో ఓ ప్రాంతంలో ఉన్న ఆలయంలో దుర్గాదేవికి పూజలు నిర్వహిస్తున్నారు.

పూజలు చేసే పూజారీ..కింద పడుకుని…నీటితో నిండిన 21 కలశాలను ఛాతిపై పెట్టుకుని పూజలు చేస్తుండడం విశేషం. తాను 9 రోజుల పాటు ఆలయంలో ఉపవాసం ఉండడంతో పాటు..దీక్షలో ఉంటానని ఆయన వెల్లడిస్తున్నారు.

నవరాత్రుల సందర్భంగా..తాను ఇలా చేయడం జరుగుతోందని, గత 25 ఏండ్లుగా తాను దీనిని ఆచరించడం జరుగుతోందన్నారు. ఈ పూజారి చేస్తున్న పూజ…అందరికీ తెలిసిపోయింది. దీంతో ఆయన్ను చూడటానికి ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు.

Exit mobile version