Home Health షుగర్ నియంత్రణలో కీలకంగా పనిచేసే పెరటి మొక్కలు!

షుగర్ నియంత్రణలో కీలకంగా పనిచేసే పెరటి మొక్కలు!

0

మధుమేహం లేదా షుగర్ అనేది జీవితాంతం కొనసాగే ఒక తీవ్రమైన అనారోగ్య సమస్య. ఇది ఎవరికైనా రావచ్చు. రక్తప్రవాహంలోకి వచ్చే చక్కెర (గ్లూకోజ్) మొత్తాన్నీ శక్తిగా మార్చే ప్రక్రియకు ఆటంకం కలిగినప్పుడు ఈ వ్యాధి తలెత్తుతుంది. అలాగే మారుతున్న జీవనశైలితో ఊబకాయం, ఒత్తిడి వంటి సమస్యలతో ఇప్పటి యువతకు డయాబెటిక్ ప్రమాదం తొందరగా అటాక్ చేస్తుంది. అయితే ఒక్కసారి డయాబెటిక్ బారీన పడితే.. నియంత్రణ చాలా కష్టం. నిత్యం మందులతో సహజీవనం చేయాల్సి వస్తుంది. ఇది గుండె పోటు, స్ట్రోక్, అంధత్వం, మూత్రపిండాలు విఫలమవడం, పాదాలు, కాళ్లు తొలగించాల్సి రావటం వంటి పరిణామాలకు దారితీయగలదు.

sugar levelsడయాబెటిస్ అనేది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో కనిపిస్తూనే ఉంది. చాలా మంది దీని వలన వచ్చే వ్యాధులతో బాధపడుతున్నారు. షుగర్ భోజనానికి ముందు 80mg/dl-120mg/dl భోజనం తర్వాత 180mg/dl ఉండాలి. కానీ కొంతమందిలో 200, 300, 400 వరకు ఉంటుంది. ప్రతి 7 సెకండ్లకు ప్రపంచవ్యాప్తంగా షుగర్ వలన ఒకరు చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. డాక్టర్లు ఇచ్చే మందులు షుగర్ను నియంత్రణలో ఉంచుతాయి కానీ శాశ్వతంగా తగ్గించలేవు. అందుకే కేవలం కెమికల్ ట్యాబ్లెట్స్ మాత్రమే కాకుండా.. ఆయుర్వేదం, ఇంటి నివారణలను అనుసరించడం ద్వారా డయాబెటిక్ సమస్యను నియంత్రించవచ్చు. ముఖ్యంగా ఇంట్లో ఉండే కొన్ని మొక్కల ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు.

ఈ మొక్కలు మన ఇంటి దగ్గర అందుబాటులో ఉండేవి. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది తులసి మొక్క. ఈ కాలంలో కూడా తులసి మొక్క లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు.. ప్రతి ఇంటిలోనూ తులసి మొక్క ఉంటుంది.. తులసి ఆకుల వాసన పీల్చడం వల్ల ఎన్నో వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయని మనందరికీ తెలిసిందే.. పది తులసి ఆకులు తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి పది నిమిషాలు మరిగించాలి ఇలా తయారు చేసుకుని తులసి కషాయాన్ని ప్రతి రోజు తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి శాశ్వతంగా తగ్గిపోతుంది.

షుగర్ వ్యాధిని నియంత్రించడంలో కీలకంగా పనిచేసే మరో మొక్క తిప్పతీగ. ఈ చెట్టుకి ఎర్రటి కాయలు గుత్తులు గుత్తులుగా ఉంటాయి. వీటి ఆకులు మందంగా మెరుస్తూ హృదయాకారంలో ఉంటాయి. ఇవి రోడ్డుకిరువైపులా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ తిప్పా తీగ ఆకులు నాలుగు తీసుకొని ఒక గ్లాసు నీటిలో మరిగించి ఆ నీటిని 21 రోజులు పరగడుపున తాగడం వలన షుగర్ వ్యాధిని తగ్గించే గుణం ఉంటుంది.

కలబందలో ఔషధ గుణాల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. దీనిని అనేక చర్మ, జుట్టు సంరక్షణలో భాగంగా ఉపయోగిస్తుంటాం. అలాగే ఆరోగ్యరక్షణకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కలబంద లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. ఒక చిన్న కలబంద ముక్కను తీసుకుని చెప్పు తీసి అందులో ఉన్న గుజ్జును మెత్తగా చేసుకోవాలి.. కలబంద గుజ్జు ఒక గ్లాసు నీటిలో కలిపి పరగడుపున తాగడం వలన షుగర్ వ్యాధి అదుపులోకి రావటమే కాకుండా శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు.

జామ ఆకులలో కూడా షుగర్ వ్యాధిని తగ్గించే గుణం ఉంటుంది. నాలుగు లేదా ఐదు ఆకులు నీటిలో మరిగించి ఆ నీటిని ప్రతి రోజూ తాగడం వలన షుగర్ నియంత్రణలో ఉండటం గమనించవచ్చు. మరో మొక్క మామిడి లేదా నేరేడు. ఈ రెండు ఆకులను కలిపి నీటిలో మరిగించి పరగడుపున 21 రోజులు తాగడం వలన శాశ్వతంగా షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.ఈ ఆకులు అనేక ఆయుర్వేద గుణాలను కలిగి ఉంటాయి. ఇవి సహజంగా షుగర్ ను కంట్రోల్లోకి తీసుకు రాగలవు.

ఆయుర్వేదంలో ఇన్సులిన్ మొక్కకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్క డయాబెటిక్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మొక్క ఆకులు పుల్లగా ఉంటాయి. ఈ ఆకులను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించవచ్చు. డయాబెటిక్ రోగులకు స్టెవియా మొక్క చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని ఆకులు తియ్యగా ఉంటాయి.ఈ ఆకులను పొడి చేసి టీ, షర్భత్‏లలో చక్కెరగా ఉపయోగించవచ్చు. దీని ఆకులు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఉపయోగపడతాయి. ఇందులో జీరో కేలరీలు ఉంటాయి. అలాగే తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది.

మధుమేహాన్ని నియంత్రించవచ్చు కరివేపాకు కీలక పాత్ర పోషిస్తుంది. వేప ఆకుపచ్చ ఆకులలో గ్లైకోసైడ్స్, అనేక యాంటీ-వైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ మొత్తాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ప్రతిరోజు 4 కరివేపాకు ఆకులను నమలడం ద్వారా షుగర్ వ్యాధికి చెక్ పెట్టవచ్చు. అలాగే శివునికి ఎంతో ఇష్టమైన మారేడు ఆకులు అదే… బిల్వ పత్రాలు కూడా షుగర్ నియంత్రణలో చక్కగా పనిచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం బిల్వపత్రాల లో అనేక ఆయుర్వేద గుణాలు ఉంటాయి. ఈ మొక్క ఆకులను మరిగించి ఆ కషాయాన్ని రోజు తీసుకోవడం వలన షుగర్ నియంత్రణలో ఉంచుకోవచ్చు.

Exit mobile version