భారతదేశం ప్రపంచంలోనే ఒక గొప్ప పర్యాటక కేంద్రం అని చెప్పడానికి అతిశయోక్తి లేదు ఎందుకంటే ఇక్కడ ఎంతో ప్రాచుర్యం గల దేవాలయాలు, అబ్బురపరిచే కళా నైపుణ్యం, చారితాత్మక కట్టడాలు, పచ్చటి ప్రకృతి అందాలు, నదులు, సెలయేర్లు, వివిధ రకాల సంస్కృతులు ఇలా చెప్పకుంటూ పోతే ఎన్నో విశేషాల సముదాయం మన భారతదేశం. అయితే మన దేశంలో కొన్ని నగరాలకు వాటికీ తగినట్లు కొన్ని రంగుల పేర్లను పెట్టడం జరిగింది. మరి ఏంటి ఆ రంగులు? రంగుల పేర్లు పెట్టిన ఆ నగరాలు ఏంటి? ఎందుకని ఆ నగరాలకు ఆ పేర్లని పెట్టారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలుపు రంగు నగరం: తెలుపు అంటే స్వచ్ఛతకు చిహ్నం. అయితే రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ నగరాన్ని తెలుపు రంగు నగరం అని పిలుస్తారు. ఇలా పిలవడానికి కారణం ఏంటి అంటే ఈ ప్రదేశంలో పాలరాతితో నిర్మించిన అందమైన కట్టడాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఆహ్లాదకర వాతావరణంలో ఉండే ఎన్నో అందమైన సరస్సులు కూడా ఉన్నాయి. అందుకే ఈ నగరాన్ని “సరస్సుల నగరం” అని కూడా అంటారు. ఇంకా ఈ ఉదయపూర్ నగరంలో ఎన్నో కోటలు, చరితాత్మక కట్టడాలు ఉన్నాయి. వీటిని సందర్శించడానికి దేశం నలుమూలల నుండి యాత్రికులు ఇక్కడ తరలివస్తుంటారు.
ఆకుపచ్చ రంగు నగరం: దేశం మొత్తంలో కేరళ రాష్ట్రం ఎంతో సుందరమైన ప్రాంతం. ఇక్కడి వాతావరణానికి మరియు అక్కడ ఉండే ప్రకృతి మధ్యలో కొబ్బరి చెట్లు, సెలయేళ్ళు ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తాయి. అంతేకాకుండా ఆయుర్వేదం ప్రకారం కూడా కేరళ రాష్ట్రము ముందుటుంది. అయితే కేరళలోని తిరువనంతపురం నగరం ఎల్లపుడు పచ్చదనం ఉండటం చూసి గాంధీ గారు ఈ నగరానికి ఆకుపచ్చ నగరం అని పేరు పెట్టారంటా. సముద్రానికి మరియు పశ్చిమ కనుమల మధ్య వెలసిన ఈ నగరంలో దేవాలయాలు, కొండ ప్రాంతాలు, బీచులు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
బంగారం రంగు: రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మర్ నగరాన్ని బంగారు రంగు నగరం అని పిలుస్తారు. ఎందుకంటే థార్ ఎడారి లో ఇసుక పసుపు రంగు, బంగారపు రంగు, గోధుమ రంగును పోలి ఉండటం కారణంగా ఈ నగరాన్ని బంగారపు నగరం అని అంటారు. అయితే థార్ ఎడారిలో ఎండపడినప్పుడు అక్కడి ఇసుక కనిపించే ఈ రంగులు పర్యాటకులని విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇంకా జైసల్మర్ నగరం సంగీతానికి మరియు రాజస్థాన్ జానపద నృత్యానికి పెటింది పేరు గా చెబుతారు. ఇందులో ముక్యంగా చెప్పుకుంటే “సాం సాండ్ డ్యునెస్” అని జరిపే ఎడారి ఉత్సవంలో కల్బేలియా అనే జానపద నృత్యం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.
నీలి రంగు నగరం: జోధాపూర్ నగరాన్ని నీలి రంగు నగరం అని అంటారు. జోధాపూర్ నగరంలోనే ఎత్తైన కట్టడం మెహ్రాన్గర్ కోట ఉంటుంది. ఈ కట్టడంతో పాటుగా ఇక్కడ ఉండే ఇల్లు నీలి రంగులో కనిపిస్తూ పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తాయి. ఇలా ఇంటికి నీలి రంగు వేసే పద్దతిని మొదటగా బ్రాహ్మణులూ మొదలుపెట్టారు. కాలక్రమేణా అదే అలవాటుగా మారిపోతూ వస్తూ నగరం అంతటా వ్యాపించి నీలి రంగు నగరంగా పేరు గాంచింది.
గులాబీ రంగు నగరం: జైపూర్ ని గులాబీ రంగు నగరం అంటారు. ఇలా గులాబీ రంగు అని పిలడం వెనుక ఒక కథ వెలుగులో ఉంది అది ఏంటి అంటే, 1876 వ సంవత్సరంలో హెల్స్ యువరాజు మరియు విక్టోరియా మహారాణిని ఈ నగరానికి ఆహ్వానించే సమయంలో ఈ నగరాన్ని పాలించే మహారాజు సా వై రాంసింగ్ టెర్రకోటకి గులాబీ రంగుని పూయుంచాడు. ఆ తరువాత ప్రతి ఇంటికి కూడా గులాబీ రంగు ఉండాలని చట్టం పెట్టి నగరాన్ని గులాబీ నగరంగా మార్చేసాడు. అప్పటినుండి ఈ నగరాన్ని గులాబీ నగరం అని అంటారు.
ఈ విధంగా మన దేశంలో కొన్ని నగరాలకు రంగుల పేర్లు పెట్టి పిలవడం జరిగింది.