Home Unknown facts Manam sandharshinche konni yuddhalu jarigina chaarithrika pradeeshalu yokka charithra

Manam sandharshinche konni yuddhalu jarigina chaarithrika pradeeshalu yokka charithra

0

భారతదేశం అంటే చారిత్రక మరియు సాంస్కృతిక అంశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దేశంలో జరిగిన యుద్ధాలు, పోరాటాలు దేశ వ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో చెరగని ముద్రలను వేసాయి. మరి అసలైన యుద్ధాలు ఎపుడు ఎక్కడ జరిగాయి, ఆ ప్రదేశాల చరిత్ర ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కురుక్షేత్ర :yuddhaluకురుక్షేత్ర పోరాటం ఒక చారిత్రక యుద్ధం. పాండవులకు, కౌరవులకు మధ్య జరిగినట్లు హిందువుల పవిత్ర ఇతిహాసం మహాభారతం చెపుతోంది. ఈ కురుక్షేత్ర రణ రంగంలోనే శ్రీ కృష్ణుడు భగవత్ గీత ను అర్జ్లునుడికి ఉపదేశించాడు. ఈ ప్రాంతంలో పర్యాటక ఆకర్షణలు అనేకం కలవు. వాటిలో భీష్మ కుండ్, బ్రహ్మ సరోవర్, జ్యోతిసార్ వంటి వాటికి చారిత్రక సంబంధం కలదు.
పానిపట్:పానిపట్ లో జరిగిన యుద్ధాలు ప్రసిద్ధి చెందినవి. ఈ ప్రదేశం హర్యానా రాష్ట్రంలో కలదు. ఈ యుద్ధాలు వివిధ వంశాలకు చెందినా రాజుల మధ్య జరిగాయి. ఈ మూడు పానిపట్ యుద్ధాలు 1526,1556 మరియు 1761 లలో వరుసగా జరిగాయి. మొదటి పానిపట్ యుద్ధం కారణంగా ఇండియా లో మొఘల్ సామ్రాజ్యం ఏర్పడింది. ఈ యుద్ధ భూమి లో నిర్మించిన ఇబ్రహీం లోడి సమాధి ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ.
ఢిల్లీ:ఇండియా లో యుద్ధభూమి పర్యాటకం లో ఢిల్లీ ప్రసిద్ధి చెందినది. ఢిల్లీ నగరం చిన్న, పెద్ద యుద్ధాలు అనేకం చవి చూసింది. ఈ కారణంగా చరిత్ర పుస్తకాలలో ప్రధానంగా చోటు చేసుకుంది. ఢిల్లీ లోని ఇండియా గేటు, ఖూని దర్వాజా వంటివి కొన్ని చారిత్రక యుద్ధ భూములు.
మైసూరు:మైసూరు నగరం అనేక యుద్దాలతో చరిత్ర కలిగి వుంది. టిప్పు సుల్తాన్ వంటి గొప్ప పాలకులు అనేక ఆంగ్లో – మైసూరు యుద్ధాలు జరిపారు. బ్రిటిష్ వారు ఇండియా కు వచ్చినప్పటి నుండి వారి ప్రభుత్వానికి 1767 – 1789 ల మధ్య జరిగిన ఈ ఆంగ్లో – మైసూరు యుద్ధాలు పెద్ద ఆటంకంగా ఉండేవి.
జిల్లియన్ వాలా బాగ్:జిలియన్ వాలా బాగ్ ప్రదేశ అమ్రిత్ సర్ లోని ఒక పబ్లిక్ గార్డెన్. బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడ మూకుమ్మడి హత్యా కాండ నిర్వహించినప్పటి నుండి ఈ ప్రదేశం ప్రసిద్ధి అయ్యింది. ఈ మారణకాండ లో మరణించిన వారి జ్ఞాపకార్ధం ఇక్కడ ఒక మెమోరియల్ నిర్మించారు.
ఇంఫాల్:ఇంఫాల్ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జరిగింది. ప్రపంచ చరిత్రలో ఇది ప్రసిద్ధి అయ్యింది. ఎందుకంటే ఆసియ లో మొట్ట మొదటి సారిగా ఈ ప్రదేశంలో జపాన్ వారి సైన్యాలు ఓడించాబడ్డాయి. ఇంఫాల్ లో కల మిత్ర కూటమిని నాశనం చేసి ఇండియా ను జయించాలని జపాన్ సిద్ధపడింది. ఈ యుద్ధ ప్రదేశంలో ఒక యుద్ధ స్మారకాన్ని మరణించిన సైనికుల గౌరవార్ధం నిర్మించారు.
కొహిమ, నాగాలాండ్:నాగాలాండ్ లోని కొహిమా లో మిత్ర కూటమి లోని 1420మంది సైనికుల శ్మశానం కలదు. వీరికి గాను ఒక ప్రసిద్ధ మెమోరియల్ స్తూపం నిర్మించారు. ఇది ప్రపంచ ప్రసిద్ధం. దీనిపై ” మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, రేపటి కొరకు మేము ఈ రోజు మరనిన్చాము ” అని చెప్పండి అని వ్రాసి వుంటుంది.
కార్గిల్:కార్గిల్ ప్రదేశం లోని పర్వత ప్రాంతాలలో ప్రసిద్ధ 1999 సంవత్సరపు కార్గిల్ యుద్ధం జరిగింది. ఇది లైన్ అఫ్ కంట్రోల్ కు సమీపంలో కలదు. ఈ యుద్ధం ఇండియా మరియు పాకిస్తాన్ దేశాల మధ్య జరిగింది. దీనిని ఆపరేషన్ విజయ్ అని అంటారు. ఈ ప్రదేశం చారిత్రకంగానే కాక బౌద్ధ ఆరామాలకు కూడా ప్రసిద్ధి.
ఇవన్నీ కూడా మన దేశంలో జరిగిన గొప్ప చరిత్ర గల యుద్ధ ప్రదేశాలుగా చెప్పుకుంటారు.

Exit mobile version