మన దేశంలో చాలా రకాల దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఆలయాలు వెలసి ప్రస్తుతం భక్తుల చేత పూజలందుకుంటున్నాయి. అయితే కొన్ని దేవాలయాలు కొత్త ఆశ్చర్యాన్ని గురి చేసేవిధంగా ఉంటాయి. అలాంటి దేవాలయాలలో ఒకటి ఈ కప్పల దేవాలయం. మరి కప్పలకి, దేవుడికి ఏంటి సంబంధం? అక్కడ దేవాలయాన్ని సందర్శిస్తే పేదవారు ధనికులుగా మారడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే కొన్ని పౌరాణిక సాహిత్యాల ప్రకారం సూచించిన మండూకాలు అంటే కప్పలు సంతానోత్పత్తి శక్తికి పేరు గాంచినది. అంతే కాదు కొంతమంది పండితుల ప్రకారం ఐశ్వర్యం మరియు సిరి-సంపదకు రాయబారిగా కప్పలను సూచిస్తారు. ఎంతోమంది భక్తులు సిరి-సంపదలు వృద్ధిచెందుతుంది అనే కారణం చేతనే ఇక్కడకు అనేకమంది భక్తులు సందర్శిస్తుంటారు. అయితే ముఖ్యమైన విషయమేమంటే అన్ని సమయాలలో ఇక్కడకు భక్తులు రారు ప్రత్యేక సమయాలలో మాత్రం దేవాలయాన్ని సందర్శిస్తారు. అంటే దీపావళి పండుగ, శివరాత్రి మరియు శ్రావణ సోమవారాలప్పుడు ఈ దేవాలయానికి భక్తులు తండోపతండాలుగా వస్తారు. దీపావళి పండుగ రోజు మాత్రం ఇక్కడ భక్తులతో నిండివుంటుంది.
పేదరికం నుండి విముక్తి ఈదేవాలయంలోని కప్పలు కొన్ని వరాలను ప్రసాదిస్తాయి. పిల్లలులేని వారు ఈ దేవాలయానికి దర్శిస్తే పిల్లలు కలుగుతారంట. అలాగే పేదరికం నుండి విముక్తి కలగాలనుకునేవారు కూడా ఇక్కడ అపార జన సాగరం దర్శించుకుంటారు. ఇది మహాశివునికి ముడిపడ్డ దేవాలయం కప్ప వీపు మీద అందంగా నిర్మించబడివుంది.
ఈ దేవాలయం వున్న ప్రదేశానికి మండూక మందిరం అని కూడా పిలుస్తారు. మండూక విద్య ప్రకారం కప్ప వీపు మీద వుంచిన తాంత్రిక చక్రం మీద ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయం సుమారు 200 సంవత్సరాల పురాతన దేవాలయం అని చెప్పబడింది. ఈ దేవాలయాన్ని సందర్శించటం వల్ల వారి యొక్క దారిద్ర్యం నివారణ అవుతుంది అని నమ్ముతారు. దీనికి సంబంధించిన ఒక స్థలపురాణం కూడా వుంది. రాజా భకత్ సింగ్ రాజా ఇక్కడ రాజపుత్ర పాలకుడు భగత్ సింగ్ అనునతనికి ఎక్కడెక్కడి కష్టాలో ఎదురయ్యాయి. ఈ విధంగా సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ కొన్ని రోజులకి కప్ప యొక్క ఆశీర్వాదం రాజునకు మరియు ప్రజలకు లభించింది. అప్పటి నుంచి రాజు యొక్క అన్ని కష్టాలు దూరమై సకల సంపదలు లభించాయి. అలా కష్టాలు తీరిన రాజు కప్ప దేవాలయాన్ని నిర్మించాడు అని స్థల పురాణం చెబుతుంది.
ఈ దేవాలయం యొక్క ముఖ్యమైన ఆకర్షణ వాస్తు శిల్పాలు. ఈ రచనలో కప్ప వెనుక భాగంలో మొత్తం నిర్మాణం కనిపిస్తుంది. ముందుభాగంలో కప్ప యొక్క ఒక భవ్యమైన శిల్పం కూడా వుంది. కప్ప వెనకభాగంలో చతురస్రఆకారంలో ఒక గోపురాన్ని నిర్మించారు. తాంత్రిక సంప్రదాయం అంటే ప్రాచీన హిందూ ధర్మం మరియు బౌద్ధధర్మం యొక్క ప్రభావాన్ని కలిగియున్న ప్రాచీనమైన భారతీయ సంస్కృతి. ఇది ముఖ్యంగా స్త్రీ శక్తిని ప్రతిబింబించే పూర్వవైదిక సంప్రదాయం. ఈ తాంత్రిక సంప్రదాయాన్ని దేవతలు ఉగ్రరూపాల్లో ఈ సంప్రదాయాన్ని పూజిస్తారు. కప్ప దేవాలయం కూడా ఈ తాంత్రిక పద్దతిని అనుసరిస్తుంది.
భక్తి శ్రద్ధలతో పూజిస్తే పేదవారిని ధనికులుగా మార్చే ఈ కప్ప దేవాలయానికి శివరాత్రి మరియు దీపావళి పండుగ రోజున భక్తులు ఎక్కువగా వస్తుంటారు.