Home Health వ్యాయామం సడన్ గా ఆపేస్తే ఇన్ని సమస్యలు వస్తాయట! 

వ్యాయామం సడన్ గా ఆపేస్తే ఇన్ని సమస్యలు వస్తాయట! 

0
exercise
వ్యాయామం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎప్పుడు ఆక్టివ్ గా ఉండేలా చేస్తుంది. వ్యాయాయం చేయడం వలన మనసుకి ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.  అందుకే వ్యాయామం చేయడానికి సమయం కేటాయిస్తూ  ఉండాలి. అయితే ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అంత తేలికైన పని కాదు. దీనికి చాలా కృషి, పట్టుదల అవసరం. చాలా మంది వ్యాయామాన్ని ప్రారంభించేటప్పుడు ఉత్సాహంగానే ప్రారంభిస్తారు. కానీ ఓ నెల లేదా కొన్ని రోజుల తర్వాత పనుల బిజీలో పడిపోయి మానేస్తూ ఉంటారు.
  • ఇక కొంతమంది ఆరోగ్యంగానే ఉన్నాం కదా. ఎలాంటి సమస్యలు లేవు కదా… కొద్దిరోజులు వ్యాయామం మానేస్తే ఏం అవుతుందిలే  అనుకుంటుంటారు. అప్పుడప్పుడు వ్యాయామం ఆపేసినా ఎలాంటి ఇబ్బందీ ఉండదని భావిస్తుంటారు. కానీ ఇదేమంత మంచి పద్ధతి కాదు. ఇలా వ్యాయామం చేయడం సడన్ గా మానేస్తే అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు.
  • కొన్ని రోజుల పాటు వ్యాయామం చేసిన తర్వాత సడన్ గా దాన్ని ఆపేయడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోయి, ఆరోగ్య సమస్యలు ఎదురవడంతో పాటు అప్పటివరకూ తగ్గిన బరువు తిరిగి పెరిగిపోయే అవకాశం ఉంటుందట. దీంతో పాటు చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు.
  • కేవలం 2 వారాల పాటు వ్యాయామం మానేసినా కండరాల మోతాదు తగ్గుతోందని, కొవ్వు శాతం పెరిగిపోతోందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. వ్యాయామం ఆపేయడం మూలంగా మధుమేహం, గుండెజబ్బుల వంటి దీర్ఘకాలిక సమస్యల ముప్పూ ఎక్కువవుతోందని చెబుతున్నాయి అధ్యయనాలు.
  • అప్పటి వరకు ప్రతి రోజూ వర్కవుట్స్ చేసి ఆపేయడం వలన అన్ని రోజులు శరీరంలోని కండరాలు మీద పడిన శ్రమ ఇక పడక పటుత్వాన్ని కోల్పోవడం తో పాటుగా శరీరంలో కెలొరీ లు కూడా చాలా తక్కువగా ఖర్చు అయ్యి తద్వారా బరువు పెరుగుతారు. ఇలా సడన్ గా వ్యాయామం మానేయడం వలన చిన్న చిన్న పనులకే కండరాలు నొప్పిగా మరియు అలసట గా అనిపించి నీరసం వస్తుంది.
  • వ్యాయామం మానేసిన వెంటనే మీ రక్తపోటు స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. మీరు వ్యాయామం మానేసిన సమయంలో రక్తపోటు సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. అదే రెండు వారాల తరువాత, రక్త నాళాలు నిశ్చల జీవనశైలికి అనుగుణంగా మారిపోతాయి. సడన్ గా వ్యాయామం మానేస్తే శ్వాస సమస్యలు అధికమవుతాయి. మీరు కొద్ది దూరం నడిచినా, పరిగెత్తినా సరే వెంటనే అలసట చెందుతారు. మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఈ సమస్యకు ప్రధాన కారణం మీ ఆక్సిజన్‌ను శక్తిగా మార్చే మీ కండరాలకు పనిచెప్పక పోవడమే.
  • రోజువారి వ్యాయామాన్ని సడన్ గా ఆపేయడం వలన మెదడు త్వరగా అలసిపోతుంది. అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరం ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. దీనివల్ల మనసు ఆహ్లాదంగా మారుతుంది. నిరాశ, ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అంతేకాక, మానసిక స్థితిని మెరుగుపర్చుకోవచ్చు.
  • వీటన్నిటి నుంచి దూరంగా ఉండాలి అంటే సడన్ గా వ్యాయామాన్ని మానేయకూడదు. ఒకవేళ ఏదైనా పరిస్థితిలో మానేయాలి అనుకుంటే మీరు చేయవలసింది క్రమంగా మీ వ్యాయామ సమయాన్ని తగ్గించుకోవడమే. ఒకవేళ ఎప్పుడైనా వ్యాయామం చేయటానికి తగినంత సమయం లభించకపోతే ఇంట్లో, ఆఫీసుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచిదని వివరిస్తున్నారు.
  • రోజుకి కనీసం 5000 అడుగులు.. సెలవుదినాల్లో 10,000 అడుగులు నడిచేలా చూసుకోవటం మంచిది. ఫిట్‌నెస్‌ ట్రాకింగ్‌ పరికరాలు ధరిస్తే ఎంత చురుకుగా ఉన్నామో తేలికగా తెలుసుకోవచ్చు.

Exit mobile version