Home Unknown facts ఏ గ్రహా దోషానికి ఎటువంటి ఔషధ స్నానం చేయాలో తెలుసా ?

ఏ గ్రహా దోషానికి ఎటువంటి ఔషధ స్నానం చేయాలో తెలుసా ?

0

ఒక మనిషి పుట్టిన క్షణం నుండి మరణించేంత వరకు ప్రతి ఒక్కరి జీవితంలో గ్రహాల ప్రభావం ఉంటుంది. కొంత మంది పుట్టుక మంచి గ్రహ స్థితిలో జరుగుతుంది. మరికొంతమంది జన్మ జాతకంలో గ్రహాలు సరైన స్థానంలో ఉండక చాలా ఇబ్బందులు పడుతుంటారు. కాలం గడుస్తున్నా కొద్ది గ్రహాల మార్పు వల్ల ఇంకా ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. అందుకే పరిస్థితులు బాగాలేని వారు గ్రహాలకు శాంతి చేయడం చూస్తుంటాం.

Medication bath for asteroid preventionనవగ్రహాల శాంతి చాలా విధాలుగా చేస్తారు. కొంతమంది హోమాలు, కొంతమంది దానాలు ఇలా ఎవరికి తోచినట్టు వాళ్ళు ఆచరిస్తారు. అయితే ఔషధ స్నాన విధానం వల్ల కూడా గ్రహ దోషాలు పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అలా చేయడానికి కారణం లేకపోలేదు. సిద్ధౌషధ సేవల వల్ల రోగాలు, మంత్ర జపం వల్ల సకల భయాలు పోతాయి. ఔషధస్నాన విధానం వల్ల గ్రహదోషాలు నశిస్తాయి. అయితే ఏ గ్రహా దోషానికి ఎటువంటి ఔషధ స్నానం చేయాలో చూద్దాం..

సూర్య గ్రహ దోషం పోవడానికి :

మణిశిల, యాలకులు, దేవదారు, కుంకుమ పువ్వు, వట్టివేళ్ళు, యష్టిమధుకం, ఎర్రపుష్పాలు,ఎర్రగన్నేరు పువ్వులు ఈ వస్తువులు నీళ్ళూ వేసి కాచి, ఈ నీటితో స్నానం చేయాలి.

చంద్ర గ్రహ దోషం పోవడానికి :

గో మూత్రం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు పేడ, ఆవు నెయ్యి, శంఖాలు, మంచిగంధం, స్పటికం ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానం చేయాలి.

కుజ గ్రహ దోషం పోవడానికి :

మారేడు పట్టూ, ఎర్రచందనం, ఎర్రపువ్వులు, ఇంగిలీకము, మాల్కంగినీ, పొగడ పువ్వులు ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానం చేయాలి.

బుధ గ్రహ దోషం పోవడానికి :

ఆవుపేడ, తక్కువ పరిమాణంలో పండ్లు, గోరోచనం, తేనే, ముత్యాలు, బంగారం ఇవన్నీ నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానం చేయాలి.

గురు గ్రహ దోషం పోవడానికి :

మాలతీ పువ్వులు, తెల్ల ఆవాలు, యష్టి మధుకం, తేనే ఇవన్నీ కలిపి నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానం చేయాలి.

శుక్ర గ్రహ దోషం పోవడానికి :

యాలుకులు, మణిశిల,శౌవర్చ లవణం, కుంకుమ పువ్వు ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానం చేయాలి.

శని గ్రహ దోషం పోవడానికి :

నల్ల నువ్వులు, సుర్మరాయి, సాంబ్రాణి, ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానం చేయాలి.

రాహు గ్రహ దోషం పోవడానికి :

సాంబ్రాణి, నువ్వుల చెట్టు ఆకులు, కస్తూరి, ఏనుగు దంతం (ఏనుగు దంతము లేకపొయినను మిగిలిన వాటితో) ఈ వస్తువులను నీళ్ళలో వేసి ఆ నీటితో స్నానం చేయాలి.

కేతు గ్రహ దోషం పోవడానికి :

సాంబ్రాణి, నువ్వుల చెట్టు ఆకులు, ఏనుగు దంతం, మేక మూత్రం, మారేడు పట్ట ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానం చేయాలి.

 

Exit mobile version