Home Health హోమ్ క్వారంటైన్ లో ఉండేవాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హోమ్ క్వారంటైన్ లో ఉండేవాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

0

దేశవ్యాప్త కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. అటు అనుమానితుల సంఖ్యా కూడా క్రమేపీ పెరుగుతూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో కరోనా పేషెంట్లకు చికిత్స అందించడంతో పాటు, చాలామందికి క్వారంటైన్ సూచించింది ప్రభుత్వం. క్వారంటైన్ లో ఉన్నవారు ఇళ్ల నుంచి బయటకు వస్తే కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. అందుకే క్వారంటైన్ లో ఉన్నవారు బయటకు రాకుండా ఇళ్లలోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అసలు కరోనా రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

1.రోజుకు కనీసం 7 నుండి 8 గంటల పాటు నిద్ర పోవాలి. ఎక్కువగా నిద్ర పోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది.

home quarantine guidelines and tips2.ఉదయాన్నే 6 గంటలకు నిద్ర లేవాలి.

3.ఉదయం కాలకృత్యాలు ముగించుకుని 6:30 నుండి ఒక అరగంట యోగ, వ్యాయామం చేయాలి.

4.ఉదయం 7 గంటలకు వేడి నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగండి. దీనిలో విటమిన్ సి ఉండడం వలన బ్యాక్టీరియా వైరస్ ని నివారిస్తుంది.

5.వ్యాయామం అయ్యాక ఉదయం 7:15 నిమిషాలకు వేడి నీటితో స్నానం చేయాలి. దీనివల్ల బద్ధకం వదులుతుంది.

6.ఉదయం 8 గంటలలోపే విటమిన్ సి ఉండే అల్పాహారం తీసుకోవాలి.

7.అలాగే ఉదయం 8:45 నిమిషాలకు వేడి పాలలో 100ml నుండి 150ml ముడి పసుపును వేసుకొని తాగండి. దీని వలన ముక్కు, గొంతులోని బ్యాక్టీరియా చనిపోతుంది.

8.తరువాత ఉదయం 9:30 నిమిషాలకు ఒక 10 నిమిషాల పాటు ఆవిరి పట్టండి.

9.ఉదయం 10 గంటలకు వేడి ఆయుర్వేద టీ తీసుకోవాలి.

10.అలాగే 11 గంటలకు 50ml వేడి వేడి టీ తాగాలి.

11. ఉదయం 11:45 నిమిషాలకు కివి, నారింజ వంటి సి విటమిన్ ఉండే సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవాలి.

12. మధ్యాహ్నం 1 నుండి 2 గంటల మధ్య భోజనం చేయాలి. ఇందులో విటమిన్ బి ఉండే ఆహారపదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే విటమిన్ బి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

13. రోజుకి కనీసం 4 నుండి 5 లీటర్ల నీటిని తాగడం వలన శరీరంలోని అన్నీ అవయవాలు ఆక్టివ్ గా పనిచేస్తాయి.

14. అయితే భోజనం చేసేటప్పుడు నీళ్లు ఎక్కువగా తాగకూడదు. భోజనానికి ఒక అరగంట ముందు, భోజనం చేసాక అరగంట తరువాత నీళ్లు తాగితే తిన్న ఆహరం చక్కగా జీర్ణమై గ్యాస్ సమస్యలు తలెత్తవు.

15.మధ్యాహ్నం 3 గంటలకు 500ml నుండి 1 లీటర్ వేడి నీటిని తాగడం వల్ల ఈ కాలంలో వచ్చే జలుబు, దగ్గు రాకుండా ఉంటాయి.

16. సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు ఒక గంట విశ్రాంతి తీసుకోవాలి.

17. రాత్రి 7 గంటలకు 10ml వేడి నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగాలి.

18. రాత్రి 9 గంటలకు మరోసారి పది నిమిషాల పాటు ఆవిరి పట్టాలి.

19. ఇక నిద్రపోయే ముందు గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసుకొని తాగాలి. ఇలా చేయడం వలన శాశ్వ సంబంధిత బాధలు తొలగిపోతాయి.

20.ఈ డైట్ తో పాటు కరోనా మనకు వస్తుందేమో అనే భయాన్ని తగ్గించుకోవాలి. భయాన్ని మించిన వ్యాధి లేదు. అది మనలోనే ఉంటూ మానసికంగా కృంగదీస్తుంది.

కాబట్టి కరోనా వచ్చినా దాని నుండి బయటపడగలమనే ధైర్యం ఉండాలి. ఇలా చేయడం వలన కరోనా బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు.

Exit mobile version