Home Health తలస్నానం చేసేటప్పుడు అందరూ చేసే పొరపాట్లు ఇవే!

తలస్నానం చేసేటప్పుడు అందరూ చేసే పొరపాట్లు ఇవే!

0

కేశాలు అందంగా సవరించుకోకపోతే అలంకరణ పూర్తి కానట్టే. మనిషికి మరింత అందాన్ని పెంచేవి శిరోజాలే. అందుకే ఆడవాళ్ళూ వాళ్ళ కోరుకున్న జుట్టు కోసం ఎన్నో షాంపూలు,ఆయిల్స్ ను వాడుతుంటారు. ఆడవాళ్లే కాదు పురుషులైనా హెయిర్ స్టైల్ ని బట్టి లుక్ మారుతూ ఉంటుంది. అందుకే అందమైన జుట్టు కావాలని అందరికీ ఉంటుంది.. పొడుగుగా సిల్కీ హెయిర్ కావాలని ప్రతి ఒక్కరూ ఆశ పడుతూ ఉంటారు..

hairs silkyకానీ మారుతున్న వాతావరణ కాలుష్యానికి అనుగుణంగా జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది.. వీటికి తోడు కెమికల్స్ ఉన్న షాంపూలను ఎక్కువగా వాడితే జుట్టు ఊడడం ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకే తలస్నానం చేసేటప్పుడు మాత్రం కొన్ని నియమాలను పాటించాలి. సాధారణంగా మనకి తలస్నానం చేసినప్పుడు చాలా హాయి గా ఉంటుంది.మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. నిద్రపోయే ముందు తలస్నానం చేస్తే చక్కని నిద్ర సొంతమవుతుంది. అయితే కొందరు మాత్రం తలస్నానం చేసేందుకు బద్ధకిస్తారు.

ముఖ్యంగా స్త్రీలు అయితే తలస్నానం చేసే విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. దీని వల్ల వెంట్రుకలు రాలిపోవడం, జుట్టు తక్కువగా అవడం, శిరోజాలు కాంతిని కోల్పోవడం జరుగుతుంది. అలాంటి వారు తలస్నానం చేసే విషయంలో కొన్ని సూచనలు పాటించాల్సి ఉంటుంది. జుట్టును ఎప్పుడు సంరక్షణ గా ఉంచుకోవాలి.. కేశ సౌందర్యం కోసం ఉపయోగించే షాంపూల పాత్ర కూడా ఉంటుంది. కాబట్టి మార్కెట్లో దొరికే అన్నింటిలో ఏ షాంపూ లను ఎంచుకుంటే కేశాలు దృఢంగా పెరుగుతాయో, జుట్టు సమస్యలు తగ్గుతాయో తెలుసుకోవాలి.

బయట దొరికే షాంపు లలో యాసిడ్, బేసిక్, న్యూట్రల్ వంటి రకాల లభిస్తాయి. బేసిక్ రకాలన్నీ గాఢత ఎక్కువగా ఉన్న శాంపుల్ గా పరిగణించాలి. వీటిని ఎంత తక్కువగా వాడితే కేశాలకు అంత మంచిది. ఇప్పుడు ఔషధగుణాలున్న షాంపూలను పీహెచ్ శాతం లభిస్తోంది. పీహెచ్ శాతం 5.5 శాతం ఉన్న షాంపూలను ఎంచుకోవాలి. ఇవి మంచి షాంపూ. ప్రతి షాంపూ ప్యాకెట్ లో వెనకన పీహెచ్ వాల్యూ కనిపిస్తుంది. జుట్టు రాలే సమస్య ఉన్నవారు విటమిన్స్ ఎక్కువగా ఉన్న షాంపూలను ఎంపిక చేసుకోవాలి.

సింథటిక్ రసాయనాలు అధికంగా ఉండే షాంపులను ఉపయోగించడం వల్ల కేశాలకు ఇబ్బంది కలుగుతుంది. ఇది జుట్టు మీద ఉన్న మురికి మరియు జిడ్డు తొలగించడానికి ఒక మార్గం. కానీ ఇది జుట్టు మూలాలను కూడా పాడుచేస్తుంది. వాటికి సరైన పోషణ అందదు. ఇది జుట్టును దెబ్బతీస్తుంది. జుట్టు పలుచగా మరిచిపోయేలా చేస్తుంది. తలస్నానం చేసేటప్పుడు షాంపు ని తలకు రుద్దినప్పుడు అందరూ చేసే అత్యంత సాధారణమైన తప్పు ఏంటంటే జుట్టు సున్నితంగా రుద్దకుండా గట్టి గట్టిగా రుద్దుతూ ఉంటారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇలా చేయడం వల్ల జుట్టు సున్నితత్వం కోల్పోతుంది.

జుట్టు తడిగా ఉన్నప్పుడు 5 రెట్లు సున్నితంగా ఉంటుంది. అప్పుడు మీరు గట్టిగా రుద్దటం వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. కాబట్టి తలస్నానం చేసేటప్పుడు షాంపు తో జుట్టుపై మృదువుగా రుద్దాలి. ప్రతి రెండు రోజులకు ఒకసారి తలస్నానం చేయాలి వీలు కుదరకపోతే వారానికి రెండు సార్లైనా కచ్చితంగా తల స్నానం చేయాలి. తలస్నానానికి చాలా మంది వేడినీళ్లనే ఉపయోగిస్తుంటారు కాని అలా చేయకూడదు. వేడినీళ్లతో తలస్నానం చేయడం వల్ల వెంట్రుకలు వేగంగా పొడిగా మారుతాయి. కాబట్టి తలస్నానానికి కేవలం గోరు వెచ్చని లేదా చల్లని నీటిని మాత్రమే వాడాలి. దీని వల్ల షాంపూ, కండిషనర్లు కూడా వెంట్రుకలపై బాగా పనిచేస్తాయి.

చాలా మంది తలస్నానం చేసేసమయంలో షాంపును ఎక్కువగా వేసుకుంటారు. అలా చేస్తే మురికి పోతుందన్నది వారి భావన. నిజానికి షాంపును ఎక్కువగా వేసుకోవడం వల్ల మురికిపోదు కదా… తలపై నురగ ఎక్కువగా వస్తుందేగానీ పెద్దగా ప్రయోజనం ఉండదు. అందువల్ల తక్కువ షాంపు వేసుకుని తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తలస్నానం చేసేముందు వెంట్రుకలను నీటితో బాగా కడుక్కోవాలి. షాంపును తలకు రాసుకోబోయే ముందు కనీసం ఒకటి రెండు నిమిషాల పాటు జట్టును షవర్‌ కింద ఉంచాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు బాగా తడుస్తాయి. దీంతో షాంపు, కండిషనర్లు జుట్టుపై బాగా పనిచేస్తాయి.

అలాగే, తలస్నానం తూతూమంత్రంగా వేగంగా చేయకూడదు. వెంట్రుకలకు రాసుకున్న షాపు లేదా కండిషనర్లు పోయేంతవరకు నీటితో శుభ్రం చేయాలి. తలస్నానం చేయటానికి ముందు దువ్వెనతో జుట్టును దువ్వితే జుట్టు రాలే సమస్యను కొంతవరకు తగ్గించవచ్చు. తలస్నానం చేసిన వెంటనే తలను దువ్వకూడదు. అలా దువ్వితే జుట్టు తడిగా ఉండటం వలన జుట్టు ఎక్కువగా రాలే ప్రమాదం ఉంది. తలస్నానం చేసేటప్పుడు హెయిర్ డ్రై ఉపయోగించకుండా సాధారణంగానే జుట్టును ఎండబెట్టాలి. బయటకు వెళ్తున్నప్పుడు జుట్టుపై దుమ్ము, ధూళి పడకుండా స్కార్ఫ్ కట్టుకోవడం మంచిది.

Exit mobile version