Home Health దానిమ్మ పండ్లకంటే ఆకులోనే ఎక్కువ ఔషధాలు!

దానిమ్మ పండ్లకంటే ఆకులోనే ఎక్కువ ఔషధాలు!

0
కాలంతో సంబంధం లేకుండా ప్రతీ సీజన్ లో అందుబాటులో ఉండే పండు దానిమ్మపండు. ఈ పండు చూడడానికి ఎంత అందంగా ఉంటుందో అంతకన్నా ఎక్కువ ఆరోగ్యప్రయోజనాలు అందిస్తుంది. అయితే దానిమ్మ పండు మాత్రమే కాదు.. ఆకులు, బెరడు కూడా అనేక వ్యాధ్యులను నివారిస్తుంది. దాడిమీ పత్రి అంటూ వినాయక చవితి రోజున గణపతిని పూజిస్తాం.. ఈ ఆకు పత్రి పూజా క్రమంలో పన్నెండవది. ఈ ఆకు పసరు వాసన వస్తుంది.
  • మన పూర్వీకులు కూడా దానిమ్మ ఆకులను ఎన్నో అనారోగ్యాలను నయం చేసుకోవడానికి ఉపయోగించేవారు. చలికాలంలో జలుబు, దగ్గు సమస్య ఎక్కువగా బాధిస్తుంది. అలాంటప్పుడు  స్టవ్ మీద గ్లాసు  నీళ్ళు పెట్టుకుని శుభ్రంగా కడిగిన దానిమ్మ ఆకులను వేసి రెండు నిమిషాల పాటు మరిగించాలి.
  • ఈ నీటిని ఉదయం, సాయంత్రం తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు తగ్గుతుంది. దగ్గు ఆగకుండా వస్తున్నట్లయితే ఎండ బెట్టిన  దానిమ్మ ఆకుల పొడి,  దానిమ్మ పూల మొగ్గలు, నల్ల మిరియాలు,  తులసి ఆకులు నీటిలో వేసి  ఐదు నిమిషాలు మరిగించి  ఆ నీటిని  రోజుకి రెండుసార్లు తీసుకుంటే  దగ్గు తగ్గుతుంది. కిడ్నీ సమస్యలు,   లివర్ సమస్యలు, వాంతులు, అరుగుదల సమస్యలు ఉన్నవారు  దానిమ్మ ఆకులను సేకరించి నీడలో ఆరబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని  రోజుకు మూడు గ్రాముల చొప్పున తీసుకోవడం వల్ల ఈ సమస్యలు అన్నీ తగ్గుతాయి.
  • ఈ పత్రి విశిష్టత ఆయుర్వేదంలో కూడా చెప్పబడింది. ఆయుర్వేదంలో దానిమ్మ ఆకుని కుష్టు వ్యాధి, చర్మ రోగాల నివారణకు ఉపయోగిస్తారు. ఈ ఆకుల రసం లో కొద్దిగా నువ్వుల నూనె కలిపి రెండు చుక్కలు చెవిలో వేసుకుంటే చెవిపోటు, ఇన్ఫెక్షన్స్ ను తగ్గిస్తుంది. దానిమ్మ ఆకులను ముద్దగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా చేస్తే ముఖం పై మొటిమలు తగ్గిపోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది. దానిమ్మ ఆకుల రసాన్ని గజ్జి, తామర ఉన్న చోట రాస్తే త్వరగా తగ్గుతుంది. ఇంకా పుండ్లు, గాయాలు ఉన్నచోట రాస్తే త్వరగా మానిపోతాయి.
  • దానిమ్మ ఆకులను పొడిచేసి కషాయం కాచి త్రాగటం వలన అజీర్తి, ఉబ్బసం తగ్గుతాయి. గ్యాస్ ట్రబుల్ కంట్రోల్‌లో ఉంటుంది. దానిమ్మ ఆకులను సేకరించి  నీటిలో వేసి మరిగించి  ఆ టీ తాగడం వలన అధిక బరువు, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు నొప్పి, కడుపులో  ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే  తగ్గిపోతాయి. ఈ ఆకుల టీ తాగడం వలన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
  • నిద్ర లేమి వారికి దివ్య ఔషధం దానిమ్మ ఆకుల పేస్ట్ తో చేసిన కాషాయం.. మూడు వంతుల నీటిలో దానిమ్మ ఆకుల పేస్ట్ ని వేసి.. ఆ నీరు అర వంతు వచ్చే వరకూ మరిగించి.. ఈ నీటిని  రోజూ రాత్రి నిద్ర పోయేముందు తాగితే సుఖ నిద్ర మీ సొంతం. నోటి సంబంధిత వ్యాధుల నుంచి మంది ఉపశమనం లభిస్తుంది. నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్య, నోటిలో పుండ్లు ఉంటే.. దానిమ్మ ఆకుల ర‌సాన్ని నీటిలో క‌లిపి ఆ నీటితో పుక్కిలిస్తుండాలి.  దీంతో నోటి సమస్యలు నివారింపబడతాయి.
  • వాంతులు, విరేచ‌నాల‌ను అరిక‌ట్ట‌డంలో దానిమ్మ ఆకులు మంచి మెడిసిన్. అజీర్ణం, మ‌ల‌బ‌ద్దకం, గ్యాస్‌, విరేచ‌నాలు వంటి స‌మ‌స్య‌లు తరచుగా ఏర్పడుతుంటే.. దానిమ్మ ఆకుల జ్యుస్ రోజుకు రెండు టి స్పాన్లు మేర తాగవచ్చు. ముఖంపై మొటిమలు తగ్గడానికి బెస్ట్ చిట్కా దానిమ్మ ఆకుల పేస్ట్‌ను మొటిమ‌ల‌పై రాస్తుంటే మొటిమ‌లు త‌గ్గిపోతాయి.

Exit mobile version